చైత్ర మాసం తెలుగు సంవత్సరంలో మొదట నెల. చంద్రుడు ఈ మాసంలో చిత్త నక్షత్రంతో కూడుకొని ఉంటాడు కాబట్టి చైత్రమాసం అని అంటారు. తెలుగు సంవత్సరాది తో ప్రారంభము అయ్యే చైత్ర మాసం మొదటి రోజు నుంచి వసంత నవరాత్రులు ప్రారంభం అవుతాయి. శ్రీ రామునికి చాలా ప్రీతికరమైనది ఈ మాసం. చైత్ర మాసంలో వివాహాలు, గృహాప్రవేశాలు, శంఖుస్థాపనాలు, ఉపనాయనాలు వంటి శుభకార్యాలు తలపెట్టడం చాలా శ్రేయోదాయకం.
చైత్ర మాసంలో సీమంతం ముహుర్తాలు – Baby Shower Ceremony Dates in the Month of April 2026
![]()
చైత్ర మాసంలో సీమంతం ముహుర్తాలు – Baby Shower Ceremony Dates in the Month of April 2026
ప్రత్యేకించి చైత్ర మాసంలో సీమంతం ముహుర్తాలు సామాన్యం గా ఉంటాయి. కావునా యాజమానుల, కార్యక్రమం చేయించే పురోహితులను దృష్టి యందు ఉంచుకొని చైత్ర మాసంలో సీమంతం ముహుర్తాలు అన్నిటినీ ఒకచోట సమకూర్చి ఉవ్వడం జరిగినది. అందరూ ఈ సీమంతం ముహూర్తాలను గమనించి, మీకు ఎంతవరకు అవి సరిపడుతాయో యోగ్యులయిన పండితులచే నిర్ధారణ చేసుకోగలరు.
Related
ముహూర్తం అంటే ఏమిటి ?
పురాతన కాలం నుండి, హిందువుల వివాహాలు, గృహప్రవేశం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, నామకరణం, అన్నప్రాసన, ఉపనయనం మొదలైన ముఖ్యమైన కార్యక్రమాలు లేదా కార్యక్రమాలను నిర్వహించడానికి మంచి రోజు మరియు సమయాన్ని ఎంచుకునే సంప్రదాయాన్ని అనుసరిస్తారు. దీనిని ముహూర్తం అంటారు. జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఒక నిర్దిష్ట శుభకార్యానికి తగిన రోజు మరియు సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది.
హిందూ పంచాంగం లో ఒకరి రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి రోజువారీ ముహూర్తాలు ఉన్నాయి, అలాగే ప్రధాన కార్యక్రమాలకు ముహూర్తాలు ఉన్నాయి. రాహుకాలం, వర్జ్యం, యమగండ, దుర్ముహూర్తం వంటివి లేని సమయాలు చాలా మంది హిందువులు ఇప్పటికీ రోజువారీ అనుసరించే విధానాలు. ముహూర్తం అనేది కాలాన్ని కొలిచే వేద ప్రమాణం. 24 గంటల పగలు+రాత్రి 30 ముహూర్తాలను కలిగి ఉంటుంది. ఒక్కో ముహూర్తం 48 నిమిషాల పాటు ఉంటుంది.
ముహూర్తాలను ఎలా నిర్ణయిస్తారు?
ముహూర్తం చూసే ప్రక్రియలో ముఖ్యంగా తారా బలం, చంద్ర బలం, లగ్న బలం, పంచక రహితం మొదలైన విషయాలు గమనించాల్సి ఉంటుంది. వీటి తో పాటు చివరిగా ఆయా కార్యక్రమాలనిర్ధారణ చేసే సమయంలో ఉండే తిథి, వార, నక్షత్ర, యోగ ములను కూడా పరిగణలోనికి తీసుకోవాలి. వారము కన్నా తిథి, తిథికన్నా నక్షత్రము, నక్షత్రముకన్నా లగ్నమూ అత్యంత బలీయములు. కనుక నక్షత్ర, లగ్నములు అనుకూలముగా ఉన్నచో తిథి, వారములు మధ్యస్థముగా ఉన్ననూ ముహూర్తము నిర్ధారణ చేయవచ్చును.
అయితే ఏ ముహూర్తం చూసినా, ఆయా కార్యక్రమానికి సంబంధించిన యోగ్యమైన లేదా నిర్దేశించబడిన శుభ నక్షత్రాలను, యజమానులు జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రముకు సరిచూసి ముహుర్తములను నిర్ణయింపవలెను.
మీ యొక్క శుభకార్యాలకు ముహూర్తము నిర్ణయింపవలెనన్నా లేదా మీకు సరైన ముహూర్తము కావలేనన్నా మమ్మల్ని సంప్రదించగలరు. పురోహిత్యము, జ్యోతిష్య శాస్త్రంలో 25 సంవత్సరాలు అనుభవం కలిగిన పండితులచే మీ జన్మ లేదా నామ నక్షత్రాలు బట్టి మంచి ముహుర్తాలు నిర్ణయించగలము.
Download చైత్ర మాసంలో సీమంతం ముహుర్తాలు – Baby Shower Ceremony Dates in the Month of April 2026
Baby Shower Ceremony Dates in 2026, Baby Shower Ceremony Dates in Chaitra Masam, Baby Shower Ceremony Muhurtham Dates 2026, Muhurtham Dates in 2026, Muhurtham Dates in April 2026, Muhurtham Dates in Chaitra Masam, Seemantham Dates in April Month

జ్యేష్ట మాసంలో ఉపనయనం ముహుర్తాలు – Thread Ceremony Dates in the Month of June 2026

2026 లో శ్రీరామ నవమి ఎప్పుడు.. 26న లేదా 27వ తేదీనా..? అసల పండుగ ఎప్పుడు చేసుకోవాలి?
Related Posts
Related Posts
Recent Posts
- యమునా నది పుష్కర స్నాన సంకల్పం – యమునా పుష్కరములు 2026
- యమునా నది పుష్కరాలు సమయంలో చేయవలసిన దానాలు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కర స్నానానికి ముఖ్యమైన పుష్కర స్నాన ఘాట్లు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కరం తేదీలు ఏమిటి?
- 2026 లో యమునా నది పుష్కరాలు ఎప్పుడు?
- శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ – హనుమాన్ వ్రత విధానం
- హనుమాన్ జయంతి – హనుమజ్జయంతి పండుగ పూర్తి వివరాలు









