Astrology Consultation
Price range: ₹1,000.00 through ₹2,500.00
Select options
This product has multiple variants. The options may be chosen on the product page
![]()

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ధనుస్సు రాశి [Sri Viswavasu Nama Samvatsara Dhanu Rasi Phalalu 2025-26] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ – వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.
సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు ధనుస్సు రాశి లోకి వస్తారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ధనుస్సు రాశి ఫలాలు [Dhanu Rasi Phalalu 2025-26] ఈ కింది విధంగా ఉన్నాయి.
వీరికి గురుడు మే15 నుండి సప్తమస్థానమైన మిథునరాశి యందు మరియూ శని సం॥రమంతా అర్ధాష్టమస్థానమందు లోహమూర్తులు గానూ ధననాశము కలుగ జేయునట్లు గానూ, రాహుకేతువులు వరుసగా మే 18నుండి సం॥రమంతా తృతీయ, భాగ్యస్థానములందు రజితమూర్తులుగనూ ప్రణాళికతో కార్యసాధన, సౌభాగ్యకరమగు ఫలితములు, నూతనమైన ఆలోచనలతో అధికారం వచ్చునట్లుగా ఫలితములిచ్చును.
ఔషధ వ్యాపారులకు ప్రోత్సాహకర కాలం, పరిశోధన రంగ సంబంధవ్యక్తులు మాతన విషయములను ఆవిష్కరించి ప్రభుత్వ మన్ననలు. కళత్ర స్థానమందు గురుడు కళత్రంతో సంబంధాలను మెరుగుదల, ఆర్ధికవృద్ధి, సానుకూలతను పొందుతారు. వ్యాపార భాగస్వామ్య విషయాల్లో ఆనందం, భూమి కొనుగోలు అమ్మకం సంబంధ లావాదేవీల వలన లాభపడతారు. ప్రణాళికతో ముందుచూపుతో లాభాలు. అక్టోబర్లో తలనొప్పి, ఉదరసంబంధ, నోటిపూత, తలనరములు, మెడ వరములు, కండరాల సంబంధించి స్వల్ప రుగ్మతలుంటాయి. ఈ సమయంలో గురువారం శెనగలు దానం చేస్తే స్వస్థత కలుగుతుంది. డిసెంబర్లో వైవాహిక సంబంధాలలో పరస్పర అవగాహన. వ్యాపారంలో ఆర్ధిక లావాదేవీలు మెరుగవుతాయి.
ఈరాశివారు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతుంటే చతుర్ధ స్థానంలో శని సంచారం ఆనందదాయకమవుతుంది. లేకపోతే మత్తుమందులు, జూదములు బెట్టింగు వంటి అసాంఘిక అనైతిక వ్యాపారాలలో పట్టుబడే అవకాశం ఉంది. జూలై నుండి నవంబర్ మధ్య, ఛాతీ, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శ్రద్ధ అవసరం. కుటుంబం మరియు తల్లిదండ్రులు, స్వంత గృహం ఏర్పాటుకోసం చేసుకునే ప్రయత్నాలలో విఫలం కావచ్చు. తల్లిదండ్రులు ఆరోగ్య విషయం అంతంతగానే ఉంటుంది.
తృతీయ స్థానమందలి రాహువు ధైర్యంతో ఎంతటి కార్యాన్నైనా అవలీలగా సాధించగలిగే శక్తి ఉంటుంది. కమ్యునికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి. తోబుట్టువులతో సత్ సంబంధాలు, ధైర్యం మరియు భావ వ్యక్తీకరణలను ఆశావాదంగా ప్రభావితం చేస్తుంది. సృజవాత్మకతతో అన్ని అవకాశాలను చేజిక్కుంచుకుంటారు. మిత్రుల నుంచి మద్దతు పెరుగుతుంది మరియు వారితో సమయం గడపడానికి తరచుగా అవకాశాలు లభిస్తాయి.
మీరు స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతారు మరియు కుటుంబం మరియు మీ వ్యక్తిగత సంబంధాల కంటే స్నేహితులకే ఎక్కువ సహాయం చేస్తారు. డబ్బును కూడా ఖర్చు చేస్తారు. మీ తోబుట్టువు వల్ల కొన్ని సమస్యలు ఉండవచ్చు, కానీ వారికి మీరు కూడా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. వక్తృత్వపు పోటీలలో ఆకర్షణగా నిలబడి బహుమతులు గెలుచుకుంటారు.
అదృష్టం కలసివస్తుంది. సాంప్రదాయ భావాలను గౌరవిస్తూ సుదీర్ఘ తీర్థయాత్రలు చేస్తారు. ధార్మిక ప్రదేశాలపై ఎక్కువగా అభిరుచి కల్గియుంటారు. సాధన, ధ్యానం, ప్రాణాయామం వంటి కార్యక్రమాలను అవలంబిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఘర్షణలు ఒడిదుడుకులతో ఇబ్బంది పడతారు. స్థానచలన సూచన కూడా లేకపోలేదు. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య ‘3’. గురువారనియమములు పాటిస్తూ మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకములు చేయించుకోవాలి. శివ అష్టోత్తరశతనామావళి, విష్ణు సహస్రనామ పారాయణం చేయుట మంచిది.
నెలవారీ ఫలితములు
₹1,000.00 – ₹2,500.00Price range: ₹1,000.00 through ₹2,500.00
₹550.00 – ₹2,200.00Price range: ₹550.00 through ₹2,200.00



