ఉగాది ధనుస్సు రాశి ఫలితాలు – Dhanu Rasi Phalalu 2026-27

Loading

Dhanus Rasi Phalalu 2026-27

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉగాది ధనుస్సు రాశి ఫలితాలు 2026-27

ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనుస్సు రాశి [Sri Parabhava Nama Samvatsara Dhanu Rasi Phalalu 2026-27] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 4 వ్యయం – 11
  • రాజపూజ్యం – 6 అవమానం – 6

ఎవరెవరు ధనుస్సు రాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు ధనుస్సు రాశి లోకి వస్తారు.

  • మూల 1,2,3,4 పాదములు (యె, యో, బ, బి)
  • పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బు, ధ, భ, ఢ)
  • ఉత్తరాషాఢ 1వ పాదం (బె)

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ధనుస్సు రాశి ఫలాలు [Dhanu Rasi Phalalu 2026-27] ఈ కింది విధంగా ఉన్నాయి.

ధనుస్సు రాశి ఫలాలు 2026-27

  • ఈ రాశివారికి గురుడు 2026 జూన్ 1 వరకు సప్తమ స్థానమందు లోహమూర్తిగా సామాన్య ఫలితములను తదుపరి జూన్ 2 నుండి అష్టమ స్థానమందు సువర్ణమూర్తిగా దీర్ఘాయు వృద్ధి, సంపదలను, సౌభాగ్యకర ఫలితములను ఇచ్చును.
    రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు తృతీయ, నవమ స్థానములందు రజితమూర్తులుగా సౌభాగ్యం ఫలితములను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి ద్వితీయ, అష్టమ స్థానములందు సువర్ణ మూర్తులుగానూ ఆశాజనకం ఫలితములను ఇచ్చెదరు.
  • సంవత్సరారంభంలో వివాహ విషయాలలో అనుకూలత, సామాజికంగా గుర్తింపు. వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యా కలసివస్తాయి. ఉద్యోగులకు పై అధికారులతో సంబంధాలు మెరుగుపడును. భార్యా పిల్లలతో అవగాహన పెరుగును. మంచి ఆరోగ్యం, స్నేహపూర్వక సంబంధాలు, గతంకంటే మెరుగైన స్థితి. ప్రయాణాలు కలసివస్తాయి. విలాసవంతమైన జీవనం, సంప జ్ఞానం, ఉన్నత స్థాయి జీవనశైలి. సామాజిక గౌరవం, సంతోషకరమైన వివాహ జీవితం. మతంపై విశ్వాసం, సంప్రదాయాలు కట్టుబడి ఉంటారు.
  • ఈ రాశివారికి అష్టమస్థానంలో గురుని సంచారం వలన ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. తల నరముల నొప్పులు ఛాతీ సంబంధ వైద్య సమస్యలపై శ్రద్ధ అవసరము. అర్ధాష్టమ శనిచే తల్లి ఆరోగ్య విషయాలపై శ్రద్ధ అవసరం. జీవితంలో ఆకసి పరిణామాలు. ఫైనాన్స్, అకౌంట్ రంగాల వారికి కేంద్ర సర్వీసులలో ఉద్యోగముల అవకాశం. జీవిత భాగస్వామి లేదా వారసుల సంపదను పొందే అదృష్టం. అన్నదమ్ముల మధ్య సయోధ్య ఉంటుంది. నూతన వ్యాపారాలు అంత అనుకూలము కాదు. పాతబాకీ వసూళ్లపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులకైననూ జాగ్రత్త అవసరం.
  • అర్ధాష్టమశని సంచారం ఈరాశి వారిపై అన్నీ విషయములలోనూ ప్రభావాన్ని సూచిస్తుంది. రాజకీయనాయకులకు సరై సమయం కాదు వ్యవహార ప్రతిభంధకాలు ఎదురవుతాయి. న్యాయ సంబంధ, కోర్టు సమస్యలు, వృత్తి వ్యాపారాలలో కొన్ని ముఖ్యమైన మార్పులు. వాహన ప్రమాద సూచన. ఆరోగ్య సమస్యలు. పనిచేసేచోట, ఇంటివద్ద విభేదాలు మరియు వాదన పెరుగుతాయి. వృత్తివ్యాపారులకు అనూహ్యమైన లాభాలు కలుగుతాయి. అయితే ప్రవర్తనలో మార్పు వచ్చి పరిణతి చెందినవారు బాధ్యతాయుతమైనవారుగా గుర్తింపబడతారు. తెలివితేటలతో ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా, అడ్డంకులనైనా అధిగమిస్తా రియల్ ఎస్టేటు వ్యాపారులకు కలసివచ్చే కాలం.
  • ఈ రాశివారు రాహుకేతువుల సంచారం వలన గొప్ప సంకల్పం మరియు ధైర్యంతో వ్యవహరిస్తారు. పనులను మనోనిబ్బరం దీక్ష దైవబలంతో పూర్తి చేస్తారు. ధార్మికతతో ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. ఉన్నతవిద్యలలో ముందంజ. వ్యాపార సంస్థల నడుపువారికి మిశ్రమ ఫలితాలుంటాయి. సంవత్సరం ద్వితీయ భాగంలో వ్యాపార ఫలితాల్లో అనూహ్య లాభాలు కల్గుతాయి.
  • ధనూరాశివారికి అదృష్ట సంఖ్య 3.
  • 8, 9 తేదీల సంఖ్యలకు బుధ, శుక్ర, శనివారాలు కలిసిన మరింత యోగప్రదం ఉంటుంది.
Muhurth Fixing | Free Astrology

Astrology Consultation

Price range: ₹1,000.00 through ₹2,500.00

Horoscope Matching

Horoscope Matching for Marriage

Price range: ₹550.00 through ₹2,200.00

Download Horoscope

Download Horoscope

Price range: ₹500.00 through ₹1,000.00

Download

ఉగాది ధనుస్సు రాశి ఫలితాలు – Dhanu Rasi Phalalu 2026-27

Dhanussu Rashiphal 2026, Dhanussu Rasi Phalalu, Dhanussu Rasi Ugadi Rasi Phalalu 2026, Ugadi Rasi Phalalu, Ugadi Rasi Phalalu 2026-27, Ugadi Rasiphalalu, Ugadi Rasiphalalu 2026, What is the future of Dhanussu Rasi, Yearly Prediction for Sagittarius
ఉగాది మకర రాశి ఫలితాలు – Makara Rasi Phalalu 2026-27
ఉగాది వృశ్చిక రాశి ఫలితాలు – Vruschika Rasi Phalalu 2026-27

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.