బొజ్జ గణపయ్యను గరిక(గడ్డి) తో పూజించడం వెనుక అసలు రహస్యం

బొజ్జ గణపయ్యను గరిక(గడ్డి) తో పూజించడం వెనుక అసలు రహస్యం

Loading

Garika Pooja

బొజ్జ గణపయ్యను గరిక(గడ్డి) తో పూజించడం వెనుక అసలు రహస్యం

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Garika Pooja

యమధర్మరాజు కుమారుడు అనలాసుదుడు . ఈయన అగ్ని సంబంధమైన తేజస్సు తో జన్మించాడు . అందువల్ల ఆయన శరీరము నుంచి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించసాగాయి . అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్ధిచాడు . గణపతి అనలాసురుడిని తన బొటన వ్రేలితో నలిపి ఉండలా చుట్టి చప్పున మింగేశాడు . అయితే అనలాసురుడు అగ్నిమయుడు అవడంవల్ల విఘ్నేశ్వరుని ఉదరము లో అమితమైన వేడి పుట్టింది . దాంతో ఆయన బొజ్జలో వివరీతమైన తాపము పుట్టింది . దేవతలు ఆయన భాదను చూడలేక నీటితోను , అమృతం తోను ఎంత అభిషేకించినా ప్రయోజమం లేకపోయింది . నివారణ కోసము ఈశ్వరుని ప్రార్ధించగా …. అప్పుడు మహేశ్వరుడు జంట గరిక పోచలతో విఘ్నేశ్వరుని పూజింపమని చెప్పెను . సంస్కృతము లో గరికను ” దూర్వలం ” అంటారు . శివుడు ఇచ్చిన సలహాతో గణపతి తాపము వెటనే చల్లారిపోయింది .

శ్రావణమాసం లో వచ్చే బహుళ చతుర్ధి గణపతి కి అత్యంత ప్రీతికరమైన రోజు . ఈ రోజున సంకష్టహర చతుర్ధీ వ్రతాన్ని ఆచరించడం సర్వ విఘ్నహరం . ఈ నామాలు మహా విశేష ఫలప్రదమైనవి. నిరంతరం పఠించిన శుభములు కలుగును. విఘ్నేశ్వరుణునికి గరిక (గడ్డి) పత్రం అంటే మహాప్రీతి.

విఘ్నేశ్వరుని పూజలలో వాడే ఇరవై ఒక్క రకాల పత్రాలలోను ” గరిక (గడ్డి) ” పత్రం అంటే విఘ్నేశ్వరునికి అమిత ఇష్టము . గరికతో పూజిస్తాం గనుక ఈ స్వావిని దూర్వాగణపతి అని కూడా పిలుస్తారు . ఈ స్వామిని అర్చించేటపుడు జంట గరికపోచలతో ఇరవై ఒక్కసార్లు పూజించాలన్న నియమము ఉన్నది .

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళి
హనుమాన్ చాలీసా

Related Posts

No results found.