గోపాష్టమి

గోపాష్టమి

Loading

Gopastami

గోపాష్టమి

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Gopastami

‘గోపాష్టమి’ శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు. కృష్ణ పరమాత్మ తన చిటికెన వేలితో గోవర్ధన గిరిని ఎత్తి నందనవనంలో గోపాలురను రక్షించిన రోజు. ‘గోవర్ధనోర్ధారి’ అన్న నామాన్ని పొందిన పరమ పవిత్రమైన రోజే ఈ గోపాష్టమి.

‘గో’ అనగా ‘గోమాత’. ‘గోపా’  అనగా ‘గోప బాలుడు’. కార్తిక శుక్లపక్ష అష్టమి నాడు వచ్చే రోజు కాబట్టి దీన్ని ‘గోపాష్టమి’ గా పిలుస్తారు.

గోపాష్టమి రోజున ఎవరైతే గోవును పూజించి దానికి ధాన్యం లేదా పండ్లను తినిపించి, గోవు యొక్క పృష్ట భాగమునకు నమస్కరిస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం లభించి చేసిన పాపాలు అన్నీ పోతాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.

గోవు పరదేవతా స్వరూపము. గోవులకు అధిష్ఠాన దేవత ‘సురభీదేవి’. కామధేనువు పరాశక్తియైన లక్ష్మీస్వరూపం. ఈ ‘శ్రీసురభ్యై నమః’ అనే మంత్రాన్ని జపించి, క్రింది స్తోత్రాన్ని గోసన్నిధిలో పఠిస్తే, ఆయురారోగ్యైశ్వర్యాలు, అభీష్టసిద్ధులు సంప్రాప్తిస్తాయి. కీర్తి, ధనము, జ్ఞానము, క్షేమము ప్రసాదించే మహిమ గల స్తుతి ఈ ‘గోపాష్టమి స్తుతి’. (దేవీ భాగవతం అంతర్భాగంగా)

గోపాష్టమి స్తుతి:

లక్ష్మీ స్వరూపాం పరమాం రాధా సహచరీం పరాం!
గవామధిష్ఠాతృ దేవీం గవామాద్యాం గవాం ప్రసూమ్!!

పవిత్ర రూపాం పూతాం చ భక్తానాం సర్వ కామదాం!
యయా పూతం సర్వవిశ్వం తాం దేవీం సురభిం భజ్!!

నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమోనమః!
గవాం బీజ స్వరూపాయై నమస్తే జగదంబికే!!

నమో రాధాప్రియాయై చ పద్మాంశాయై నమోనమః!
నమః కృష్ణప్రియాయై చ గవాం మాత్రే నమోనమః!!

కల్పవృక్ష స్వరూపాయై సర్వేషాం సతతం పరే!
క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై నమోనమః!!

శుభాయై చ సుభద్రాయై గోప్రదాయై నమోనమః!
యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమోనమః!!

devotional facts, god, goddess durga, hindu tradition, Karthika Masam, krishna, lord shiva, Pooja Vidhanalu, siva
కార్తీక శుద్ధ ద్వాదశి – క్షీరాబ్ధి ద్వాదశి విశిష్టత
సూర్య షష్టి

Related Posts