ఉగాది కర్కాటక రాశి ఫలితాలు – Karkataka Rasi Phalalu 2026-27

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు 2026-2027

ఈ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి [Sri Parabhava Nama Samvatsara Karkataka Rasi Phalalu 2026-27] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 02
  • వ్యయం – 11
  • రాజపూజ్యం – 04
  • అవమానం – 07

ఎవరెవరు కర్కాటక రాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు కర్కాటక రాశి లోకి వస్తారు.

  • పునర్వసు 4వ పాదము (హి)
  • పుష్యమి 1, 2, 3, 4 పాదములు (హు, హె, హో, డా)
  • ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో)

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది కర్కాటక రాశి ఫలాలు [Karkataka Rasi Phalalu 2026-27] ఈ కింది విధంగా ఉన్నాయి.

శ్రీ పరాభవ నామ సంవత్సరం లో కర్కాటక రాశి ఫలాలు 2026-27

  • ఈ రాశివారికి గురుడు 2026 జూన్ 1 వరకు వ్యయస్థానమందు రజితమూర్తిగా సౌభాగ్యకరమగు శుభఫలితాలనిచ్చును. మంగళ తోరణములు, బంధుమిత్ర సమాగమము, శుభవ్యయము, కుటుంబవృద్ధి కల్గించును. తదుపరి జూన్ 2 నుండి జన్మరాశి యందు సువర్ణమూర్తిగా అత్యంత శుభ ఫలితములను ధనవృద్ధిని, రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు అష్టమ, ద్వితీయ స్థానములందు తామ్రమూర్తులుగా సామాన్య ఫలితములను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి సప్తమ, జన్మ స్థానములందు లోహమూర్తులుగా అతి సామాన్య ఫలితములను ఇచ్చెదరు.
  • గురుసంచారం శుభప్రదం, ఉద్యోగ వ్యాపారాలలో మంచి ప్రయోజనాలు. ఉన్నత ఆలోచనలు, ఆత్మ విశ్వాసం. ప్రతిష్టాత్మకమై పదవిని పొందే అవకాశాలు. కుటుంబ వాతావరణం అనుకూలం. పరిశోధన వృత్తి నైపుణ్యాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్ళడానికి ఆ ఇతర ప్రాంతాలకు ప్రయాణించడానికి అనుకూలమైన సమయం. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జన్మరాశిలో గురు సంచారం ఇతరులకు ప్రోత్సాహకారిగా ఉంటూ తగిన స్ఫూర్తినిచ్చేటట్టు చేస్తుంది.
  • ఈ సంవత్సరంలో ఒక నామినేటెడ్ పదవికి ఎంపిక అవుతారు. వృత్తి నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. అన్నిరకాల వ్యాపారస్తులకు అధిక ఆదాయం. జన్మగురుని సంచారకాలంలో అహంకార స్వభావం, మాటతొందర ఇతరులపై నోరుజారడం వలన కొన్ని సమస్యలు, అప్పుడప్పుడు అతిగా ఆశపడటం వలన ఇబ్బందులు.
  • భాగ్యరాశిలో శనైశ్చరుని సంచారం మిశ్రమ ఫలితాలనిస్తుంది. క్రమశిక్షణతో శ్రమించి పనిచేయువారికి, మంచి ఫలితాలు ప్రణాళిక లేని పనులకు ప్రతికూల ఫలితాలు. కష్టపడి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు. ఎగుమతి, దిగుమతి వ్యాపారులకు, పర్యాటక రంగము వారికి, కేటరింగ్ హోటళ్లు నిర్వహణ, ఆహార సంబంధ వ్యాపారులకు, ఫార్మసీ, వైద్య సంబంధ వ్యాపారులకు అధిక సంపాదన.
  • డిసెంబర్ నుండి వత్సరాంతం వరకు జన్మరాశిలో గురు శుక్ర సంచారం, కేతుసంచారం వలన అధిక శ్రమ, ఒత్తిడి. పుష్యమి ఆశ్రేష నక్షత్రంవారు సర్పసూక్తంతో సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. ఉదర, కాలేయ సంబంధ వ్యాధుల అపమృత్యుదోషము తొలగును. ఆయుర్వృద్ధి. ఛాతీ, రొమ్ము, ఊపిరితిత్తుల విషయాలకు సంబంధించి, ఆస్తమా, నిద్రలేమి, మధుమేహం, ఋతుక్రమ సమస్యలకు వైద్య సహాయం అవసరం. రావిచెట్టుకు ప్రదక్షిణలు ఆరోగ్యకరం.
  • డిసెంబరు వరకు రాహుకేతువుల సంచారం అష్టమ, ద్వితీయ స్థానములందు సామాన్యము. ఏ పని తలపెట్టిననూ నిర్లిప్తత, వృధాగా కాలక్షేపం చేయడం ఇతరులకు కలసిరాకపోవడం, మానసికంగా ఇబ్బందులు. ఆదాయానికి మించిన ఖర్చులు.
  • కర్కాటక రాశివారికి అదృష్ట సంఖ్య 2. 7 మరియు 11 సంఖ్యలు సోమ, మంగళ, గురువారాలు కలసిన మరింత శుభప్రదం.
Muhurth Fixing | Free Astrology

Astrology Consultation

Price range: ₹1,000.00 through ₹2,500.00

Horoscope Matching

Horoscope Matching for Marriage

Price range: ₹550.00 through ₹2,200.00

Download Horoscope

Download Horoscope

Price range: ₹500.00 through ₹1,000.00

Download

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు – Karkataka Rasi Phalalu 2026-27

Karkataka Rashiphal 2026, Karkataka Rasi Phalalu, Karkataka Rasi Ugadi Rasi Phalalu 2026, Ugadi Rasi Phalalu, Ugadi Rasi Phalalu 2026-27, Ugadi Rasiphalalu, Ugadi Rasiphalalu 2026, What is the future of Karkataka Rasi, Yearly Prediction for Cancer
ఉగాది సింహ రాశి ఫలితాలు – Simha Rasi Phalalu 2026-27
ఉగాది మిధున రాశి ఫలితాలు – Mithuna Rasi Phalalu 2026-27

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.