ఉగాది కుంభ రాశి ఫలితాలు – Kumbha Rasi Phalalu 2026-27

Loading

Kumbha Rasi Phalalu 2026-27

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉగాది కుంభ రాశి ఫలితాలు 2026-27

ఈ పరాభవ నామ సంవత్సరంలో కుంభ రాశి [Sri Parabhava Nama Samvatsara Kumbha Rasi Phalalu 2026-27] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 2 వ్యయం – 8
  • రాజపూజ్యం – 2 అవమానం – 2

ఎవరెవరు కుంభరాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు కుంభరాశి లోకి వస్తారు.

  • ధనిష్టా 3, 4 పాదాలు (గు, గె)
  • శతభిషం 1,2,3,4 పాదాలు (గొ, స, సి, సు)
  • పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు (సె, సో, ద)

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది కుంభ రాశి ఫలాలు [Kumbha Rasi Phalalu 2026-27] ఈ కింది విధంగా ఉన్నాయి.

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభ రాశి ఫలాలు 2026-27

  • ఈ రాశివారికి గురుడు 2026 జూన్ 1 వరకు పంచమ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్య ఫలితములను తదుపరి జూన్ 2 నుండి షష్ఠ స్థానమందు సువర్ణమూర్తిగా అత్యంత శుభఫలితములను ధన కుటుంబ వృద్ధిని కలుగజేయును.
  • రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు జన్మ, సప్తమ స్థానములందు లోహమూర్తులుగా అతి సామాన్య ఫలితములను, సామాన్య యోగములు కల్గునట్లును, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి షష్ట, వ్యయస్థానములందు రజితమూర్తులుగానూ సౌభాగ్యకరమగు ఫలితములను ఇచ్చెదరు. కృత్రిమ మేధస్సుకు సంబంధించిన సాంకేతికతలో పరిపక్వత సాధించి ఇతర దేశాలకు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
  • వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలం. క్రమశిక్షణతో కృషి చేయుదురు. అధిక దిగుబడి వలన తగిన ఆదాయాన్ని సముపార్జిస్తారు. వైద్య సహాయం అందటంతో స్వస్థత కలుగును. ఆరోగ్యం క్రమేపీ రాణించి, ఆర్థికవృద్ధి కలుగును. చేసే ఉద్యోగ వ్యాపారాలలో సహచరులతో సంఘర్షణలు వచ్చే అవకాశం. శ్రమించి ధైర్యంతో విజయం సాధిస్తారు. సామాజిక సేవకు అంకితమవుతారు. ఆర్థిక వెనుకబాటు, రుణాలు, అనారోగ్యం వలన చికాకులు.
  • శత్రువులు ఎక్కువగుట. కోళ్ళపరిశ్రమ, మత్స్య, ఉత్పత్తిదారులకు, స్టోన్, క్రషర్స్, మైనింగు వ్యాపారులకు ఆదాయం పెరుగును. నిర్మాణరంగం వారికి ఒడిదుడుకులు, వృత్తి వ్యాపారాలు సామాన్యం. పౌండరీస్, ఇనుము, ఉక్కు, మెషీన్ కట్టింగు, టూల్స్ పరిశ్రమల వారికి బాగుండును. చేతివృత్తులవారికి మధ్యతరహా పరిశ్రమల వారికి ఆదాయం సమకూరును.
    కుంభరాశి వారికి శనైశ్చరుడు ద్వితీయ స్థానమందు మిశ్రమ ఫలితముల నిచ్చును.
  • ధనవిషయాలలో పొదుపు అవసరం. వాగ్ధారణి మంచి మాటలకు పరిమితం చేసుకోవాలి. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం వికటిస్తుంది. కంపెనీ షేర్లలో పెట్టుబడులు నిలబడి ఉంటాయి. రైతులకు, కమ్మరి, కుమ్మరి మొదలగు భూమిని నమ్ముకుని జీవించే వృత్తులవారికి ఆదాయం గణనీయంగా ఉంటుంది.
  • ఈ రాశివారు భ్రమలకు లోనయ్యే అవకాశం, ఇతరుల విషయాలలో తలదూర్చి హద్దుమీరి ప్రవర్తించటం, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఊహాగానాలు చేయడం లాంటివి చేస్తారు. జన్మరాశిలో రాహువు ముఖము కళ తప్పినట్టు ఉండుట, శ్మశాన సందర్శనము, జూదమునకు అధిక ధనవ్యయము, సప్తమ స్థానంలో కేతువు స్వయంకృషి, అహంకారం, నాయకత్వ లక్షణాలన, నిరాశావాదాన్ని, కార్యవిముఖతను, సూచిస్తుంది, విదేశీయాన అభిలాష ఫలించును.
  • ఈ రాశివారు సుబ్రహ్మణ్య ఆరాధన నియమ నిష్ఠలతో చేయుటవలన వ్యవహారములలో భంగపాటు తొలగి సదుర్తి కార్యసిద్ధి కలుగును.
  • కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 8.
  • 2,3,7 తేదీల సంఖ్యలకు బుధ, శుక్ర, శనివారములు కలసి వచ్చిన మరింత మంచి జరుగును.
Muhurth Fixing | Free Astrology

Astrology Consultation

Price range: ₹2,000.00 through ₹3,000.00

Horoscope Matching

Horoscope Matching for Marriage

Price range: ₹550.00 through ₹2,500.00

Download Horoscope

Download Horoscope

Price range: ₹500.00 through ₹1,000.00

Download

ఉగాది కుంభ రాశి ఫలితాలు – Kumbha Rasi Phalalu 2026-27

Kumbha Rashiphal 2026, Kumbha Rasi Phalalu, Kumbha Rasi Ugadi Rasi Phalalu 2026, Ugadi Rasi Phalalu, Ugadi Rasi Phalalu 2026-27, Ugadi Rasiphalalu, Ugadi Rasiphalalu 2026, What is the future of Kumbha Rasi, Yearly Prediction for Aquarius
ఉగాది మీన రాశి ఫలితాలు – Meena Rasi Phalalu 2026-27
ఉగాది మకర రాశి ఫలితాలు – Makara Rasi Phalalu 2026-27

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.