శ్రీరామనవమి | సీతారాముల వంశ వైభవం | కళ్యాణ ప్రవర

శ్రీరామనవమి | సీతారాముల వంశ వైభవం | కళ్యాణ ప్రవర

Loading

శ్రీరామనవమి | సీతారాముల వంశ వైభవం | కళ్యాణ ప్రవర

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే!
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః!!

శ్రీరాముడు జన్మించిన పవిత్ర దినముగా శ్రీ రామనవమి పండుగను జరుపుకొంటాము. ఈ సంవత్సరము 30 వ తేదీ మార్చి గురువారం శ్రీరామనవమి పండుగ.

శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం గా భూమి మీద సంచరించి, మానవతా విలువలను తెలిపిన మహోన్నతమైన వ్యక్తి శ్రీరాముడు. ధర్మమునకు మూర్తీభవించిన నిదర్శనం శ్రీరాముడు. ఈ రోజున రామకళ్యాణం చేయుట వలన అనంత పుణ్యఫలితం లభించును. రామునిని పూజించినంతమాత్రాన ధైర్యము, విజయము లభించును. రామ నామమును జపించినా, రామకధను వినినా, సీతారామ కళ్యానం తిలకించి పానకమును తీసుకొనినా , సీతారాముని అనుగ్రహం తప్పక కలుగును.

శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ఇరువురి వంశ వృత్తాంతం తెలుసుకొందామా???

రఘువంశ వర్ణన (దశరథ మహారాజు పూర్వీకులు):

  • చతుర్ముఖ బ్రహ్మ
  • మరీచి
  • కశ్యపుడు
  • సూర్యుడు
  • మనువు
  • ఇక్ష్వాకుడు
  • కుక్షి
  • వికుక్షి
  • భానుడు
  • అనరంయుడు
  • పృథుడు
  • త్రిశంకువు
  • దుందుమారుడు
  • మాంధాత
  • సుసంధి కి ఇద్ధరు ధృవసంధి, ప్రసేనజిత్‌
  • ధృవసంధి
  • భరతుడు
  • అశితుడు
  • సగరుడు
  • అసమంజసుడు
  • అంశుమంతుడు
  • దిలీపుడు
  • భగీరతుడు
  • కకుత్సుడు
  • రఘువు
  • ప్రవృద్ధుడు
  • శంఖనుడు
  • సుదర్శనుడు
  • అగ్నివర్ణుడు
  • శీఘ్రకుడు
  • మరువు
  • ప్రశిశృకుడు
  • అంబరీశుడు
  • నహుశుడు
  • యయాతి
  • నాభాగుడు
  • అజుడు
  • దశరథుడు
  • రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు.

జనక వంశ వర్ణన (జనక మహారాజు పూర్వీకులు):

  • నిమి చక్రవర్తి
  • మిథి
  • ఉదావసువు
  • నందివర్దనుడు
  • సుకేతువు
  • దేవరాతుడు
  • బృహధ్రతుడు కి ఇద్ధరు శూరుడు, మహావీరుడు.
  • మహావీరుడు
  • సుదృతి
  • దృష్టకేతువు
  • హర్యశృవుడు
  • మరుడు
  • ప్రతింధకుడు
  • కీర్తిరతుడు
  • దేవమీదుడు
  • విభుదుడు
  • మహీద్రకుడు
  • కీర్తిరాతుడు
  • మహారోముడు
  • స్వర్ణరోముడు
  • హ్రస్వరోముడు కి ఇద్దరు. జనకుడు, కుశద్వజుడు.
  • జనకుడు సీత, ఊర్మిళ
  • కుశద్వజుడు మాంఢవి, శృతకీర్తి

శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణోత్సవములో ఉచ్చరించ వలసిన కళ్యాణ ప్రవరలు.

శ్రీరామ ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ ఐంద్ర ప్రమధ త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే…
అజ మహారాజ వర్మణః పౌత్రాయ…
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ…
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.

సీతాదేవి ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం,
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం…
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం…
జనక మహారాజ వర్మణః పుత్రీం…
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం…

సేకరణ: https://www.panditforpooja.com/blog/sri-rama-navami/

lord rama, ram navami, Sri Rama Navami
తొలి ఏకాదశి విశిష్టత – Toli Ekadashi
శ్రీ రామ నవమి సీతారామచంద్ర స్వామి పూజ విధానం

Related Posts