2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మకర సంక్రాంతి
సూర్యుడు ఒక రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశించే విధానాన్ని సంక్రమణం అంటారు. సూర్యభగవానుడు ఏరాశిలోకి మారుతాడో ఆ రాశి పేరుతో ఆ సంక్రమణాన్ని పిలవడం జరుగుతుంది. ఆ ప్రకారంగా ప్రతి సంవత్సరం జనవరిలో మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశం అవుతాడు కావునా ఈ సంక్రమణంను మకర సంక్రాంతి అంటారు.
స్వస్తి శ్రీ ప్లవ నామ సంవత్సర పుష్య శుద్ధ ద్వాదశి శుక్రవారం అనగా ది.. 14- జనవరి – 2022 న తేది రాత్రి 8:14 ని.లకు రవి [సూర్యుడు] మకర రాశి లో ప్రవేశించును మరియు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం.
[/vc_column_text]
సంక్రాంతి నాడు ఏం జరుగుతుంది?
కాలంలో, రుతువులలోప్రత్యేకించి దేశం యొక్క స్థితిగతులలో అనేక మార్పులు కన్పిస్తాయి. భారత దేశంలో తాత్విక అంశాలన్నీ నామరూపాత్మకంగా చూపిస్తారు. అదేవిధంగా ఒక్కో సంక్రాంతి ఫలితాలని ఒక్కో సంక్రాంతి పురుషునిగా చూపిస్తారు, ఆయా ఫలితాలకు ప్రతీకగా వాహన, ఆయుధాలు మొదలైనవి చూపిస్తారు. ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు రాక్షస నామకుడు.
రవి మకర సంక్రమణ తదుపరి జనులందరు తమ తమ శక్తికొలదీ బ్రాహ్మణ స్వయంపాక దానులు, వంశ పెద్దలకు ఖర్మలు , వస్త్ర దానములు, ఇష్ట దైవ సందర్శనాది కార్యములు చేయవలెను.
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన మకర సంక్రమణ ముహూర్త నిర్ణయమును రేలంగి తంగిరాల, పిడపర్తి పూర్ణయ్య, నేమాని తదితర వార్లచే వ్రాయబడిన పూర్వపద్దతి ఆధారిత పంచాంగములచే సేకరించి ఇవ్వబడినవి.