ఉగాది మీన రాశి ఫలితాలు – Meena Rasi Phalalu 2026-27

Loading

Meena Rasi Phalalu 2026-27

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉగాది మీన రాశి ఫలితాలు 2026-27

ఈ పరాభవ నామ సంవత్సరంలో మీన రాశి [Sri Parabhava Nama Samvatsara Meena Rasi Phalalu 2026-27] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  •  ఆదాయం – 14, వ్యయం – 11 
  • రాజపూజ్యం – 7, అవమానం – 2

ఎవరెవరు మీనరాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు మీనరాశి లోకి వస్తారు.

  • పూర్వాభాద్ర 4వ పాదం (ది)
  • ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదాలు(దు, శం, ఝ, థ)
  • రేవతి 1,2,3,4 పాదాలు (దే, దో, చ, చి)

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది మీనరాశి ఫలాలు [Meena Rasi Phalalu 2026-27] ఈ కింది విధంగా ఉన్నాయి.

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీన రాశి ఫలాలు 2026-27

  • ఈ రాశివారికి గురుడు 2026 జూన్ 1 వరకు చతుర్ధ స్థానమందు రజితమూర్తిగా సౌభాగ్యకరమగు ఫలితములను తదుపరి జూన్ 2 నుండి పంచమ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్యఫలితములను ఇచ్చును. రాహు కేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు వ్యయ, షష్ట స్థానములందు సువర్ణమూర్తులుగా విశేషమైన ధనయోగములు కలుగు శుభఫలితములను ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి లాభ, పంచమ స్థానములందు లోహమూర్తులుగానూ సామాన్య ఫలితములనిచ్చెదరు.
  • జూలై 26 నుండి డిసెంబరు 11ల మధ్య రేవతి ఉత్తరాభాద్ర నక్షత్రములలో శని వక్రసంచారం వలన ఋణముల వత్తిడి పెరిగి కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. శిరస్సు, పాదముల సంబంధ అనారోగ్య సమస్యలు ఉంటాయి.
  • జూన్ నెలారంభం నుండి గురుని పంచమ స్థాన సంచారము చాలా ఆశావాహముగా యుండి ధనవృద్ధి, కుటుంబ వృద్ధి కల్గును. సత్సంతానం కల్గుతుంది. రాహువు వ్యయస్థానంలో అనవసర ఖర్చులను, విదేశీ ప్రయాణాలను సూచిస్తుంది. వ్యాపారాలలో పెట్టుబడులు తగ్గించుట మంచిది. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత. పంచమ స్థానమందు బృహస్పతి ఉచ్ఛస్థితి వలన అన్ని రంగాలలోనూ ముందంజ వేస్తారు. పూర్వ పుణ్యము వలన ఆకస్మిక ఉపద్రవాల నుండి రక్షణ. అపమృత్యు దోష నివారణ. దైవబలంతో అన్నింటా రాణిస్తారు. ఈ రాశివారు తమ సద్గుణ వంతులైన సంతానం వలన ఆనందాన్ని పొందుతారు.
  • జన్మరాశి యందు శని ఈ రాశివారికి దైవ బలం, జ్ఞాపక శక్తిని పెంచుటలో బుద్ధిశాలిగా, జ్ఞానిగా, కఠిన పరిశ్రమ చేయువారిగా తీర్చిదిద్దును. శరీర దారుఢ్యం కలిగియుంటారు. సోదరులతో అభిప్రాయ భేదాలు, వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి.
  • రాహువు సంచారం వలన సంవత్సరారంభంలో ప్రతీ పని ప్రారంభంలో అడ్డంకులు, అబద్ధాలు చెప్పడం, జూదంలో నష్టపోవడం, ఇతరులపై దౌర్జన్యం, మోసం చేస్తారు. దొంగతనం, వంటి నేరాలలో ఆరోపణలు ఉంటాయి. మానసిక సమస్యలు, నిద్రలేమి. రుద్రాభిషేకం వలన అపమృత్యుదోష నివారణ. మృత్యుంజయ మంత్రంతో గృహమున శాంతి, ఆత్మహత్యా ప్రయత్నాలను నివారించవచ్చు.
  • డిసెంబర్ నుండి రాహు కేతువుల రాశిమార్పు చాలా అనుకూలం. అన్నిరకాల ఆరోపణల నుండి విముక్తి కలుగును. ఆకస్మిక ధనలాభం. భూగృహ స్థిరాస్తులు వృద్ధి అవుతాయి. వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులు కలసివస్తాయి.
    ఇనుము వ్యాపారం వారికి బాగా కలసి వచ్చే సమయం. చేపలు, రొయ్యలు మొదలగు రంగముల వారికి గతం కంటే మేలగును. రైతులకు పంటలు కలసి వచ్చును. పరిశోధనారంగం వారికి నూతన ఆవిష్కరణలు చేయడం వలన గుర్తింపు వస్తుంది.
  • గాయకులకు, సాహిత్య కళాకారులకు గుర్తింపు తెచ్చే సమయం. రచయితలకు, పుస్తక వ్యాపారం, స్టేషనరీ వ్యాపారస్తులకు కలసి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రజాసంబంధాలు బలపరచుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగును.
  • మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 3.
  • గురు, సోమ మంగళవారములు కలసిన మరింత మేలగును. అంజనేయారాధన, దుర్గారాధన, శివారాధన చేయుట మంచిది.
Muhurth Fixing | Free Astrology

Astrology Consultation

Price range: ₹1,000.00 through ₹2,500.00

Horoscope Matching

Horoscope Matching for Marriage

Price range: ₹550.00 through ₹2,200.00

Download Horoscope

Download Horoscope

Price range: ₹500.00 through ₹1,000.00

Download

ఉగాది మీన రాశి ఫలితాలు – Meena Rasi Phalalu 2026-27

Meena Rashiphal 2026, Meena Rasi Phalalu, Meena Rasi Ugadi Rasi Phalalu 2026, Ugadi Rasi Phalalu, Ugadi Rasi Phalalu 2026-27, Ugadi Rasiphalalu, Ugadi Rasiphalalu 2026, What is the future of Meena Rasi, Yearly Prediction for Pisces
వైశాఖ మాసంలో ఉపనయన ముహుర్తాలు – Thread Ceremony Dates in the Month of May 2026
ఉగాది కుంభ రాశి ఫలితాలు – Kumbha Rasi Phalalu 2026-27

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.