ఉగాది మేష రాశి ఫలితాలు – Mesha Rasi Phalalu 2026-27

Loading

Mesha Rasi Phalalu 2026-27

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉగాది మేష రాశి ఫలితాలు 2026-27

ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేష రాశి [Sri Parabhava Nama Samvatsara Mesha Rasi Phalalu 2026-27 ] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం -11
  • వ్యయం -05
  • రాజపూజ్యం -02
  • అవమానం -04

ఎవరెవరు మేషరాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు మేషరాశి లోకి వస్తారు.

  • అశ్విని 1, 2, 3, 4, పాదములు (చూ, చే, చో, లా)
  • భరణి 1, 2, 3, 4 పాదములు (లీ, లూ, లే, లో)
  • కృత్తిక 1వ పాదము (ఆ)

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది మేషరాశి ఫలాలు [Mesha Rasi Phalalu 2026-27] ఈ కింది విధంగా ఉన్నాయి.

శ్రీ పరాభవ నామ సంవత్సర మేషరాశి ఫలితములు 2026 – 2027

  • ఈ రాశివారికి గురుడు 2026 జూన్ 1 వరకు తృతీయ స్థానమందు లోహమూర్తిగా ధన నాశమును కలిగించునట్లుగానూ, తదుపరి జూన్ 2 నుండి చతుర్ధ స్థానమందు గురుడు రజితమూర్తిగా సౌభాగ్యకరమైన ఫలితముల నిచ్చును. శని గత సంవత్సరారంభం నుండి వ్యయస్థానమందు లోహమూర్తిగా సంచరించును. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు ఏకాదశ, పంచమ స్థానములందు తామ్రమూర్తులుగానూ ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి దశమ, చతుర్థ స్థానములందు తామ్రమూర్తులుగానూ సామాన్య ఫలితములను ఇస్తారు.
  • ఉన్నత విద్యాయోగం, ఆకస్మికంగా గృహవాహనాలను కొనుగోలు చేయడం, పనిచేసే చోట ఒత్తిడి తగ్గి, పై అధికారుల అండదండలు, వేతనవృద్ధి, పదోన్నతి కల్గును. సహ ఉద్యోగులు వీరికి అనుకూలంగా ఉంటారు. వ్యవహార జయం, వత్సరాది నుండి మొదటి మూడు నెలలలోపు గురుబలం లేదు.
  • గురుని చతుర్ధస్థాన సంచారకాలం వీరికి శుభప్రదం. గృహ నిర్మాణాదుల వలన లాభం. కుటుంబం మరియు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహసౌఖ్యం, తల్లి తరపు ఆస్తిని వృద్ధి చేస్తారు. స్థిరాస్థి వ్యాపారులకు అధిక లాభాలు. ఈ రాశిలోని వైద్యులకు ఉన్నత విద్యకు ప్రోత్సాహకాలు అందును. ఆయుర్వృద్ధి, మీ శ్రమకు తగిన ప్రతిఫలం.
  • న్యాయస్థానాల్లో కేసులకు వ్యవహార లాభం. ఈ రాశివారికి భాగ్య వ్యయాధిపతి గురుడు చతుర్ధ కేంద్రమందు సంచారం సానుకూలం, ఆనంద జీవనం. చేసేపనిలో ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో విజయం పొందుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభం. వీరికి నూతన నిర్మాణాలు కలసివస్తాయి. వ్యాపారాల నిమిత్తం దూరప్రయాణాలు, విద్యార్థులకు పోటీ పరీక్షలు అనుకూలం.
  • శనైశ్చరుని వ్యయస్థాన సంచారం వలన ఒత్తిళ్లను ఎదుర్కొని క్రమశిక్షణతో అన్నింటిని జయిస్తారు. ఆలోచన మరియు ప్రవర్తనలో చురుకుదనం. ఇతరదేశాలలో ఉద్యోగం, నివాసం మరియు స్థానము సుస్థిరం. వృత్తి విషయాలలో విదేశీయులతో భాగస్వామ్య సంబంధాలు, నమ్మకమైన వ్యక్తులతో వ్యాపారాలు సాగిస్తారు.
  • జూలై 26 నుండి డిసెంబరు 11ల మధ్య రేవతి ఉత్తరాభాద్ర నక్షత్రములలో శని వక్రసంచారం వలన కుటుంబ, వ్యాపార నిర్వహణకు ఖర్చులు పెరుగును. ఎగుమతుల వలన నష్టం. మోకాళ్ళు, పాదములకు అస్వస్థత, పనులు ఆలస్యం. ఆరోగ్యంలో క్రమేపీ స్వస్థత. కష్టకాలంలో సహనంతో విజయం. వ్యాపార అవసరాల కోసం తమకంటే తక్కువస్థాయి వారితో స్నేహం. రాజకీయపరంగా తగిన స్థానం కోసం, ఇతరదేశాల నుండి సంపద కోసం ఎదురుచూస్తారు. విదేశీ మిత్రుల ద్వారా ఆర్థికంగా బలపడతారు.
  • శివారాధన, రుద్రాభిషేకము, ఆంజనేయ ఆరాధన, శ్రీ వేంకటేశ్వరుని పూజ వలన మనోవికాసము ఆర్ధిక పరిపుష్టి, మార్చి.. ఏప్రిల్, మే నెలల్లో రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయుట మంచిది.
  • వీరి అదృష్ట సంఖ్య 9. 1 మరియు 9 తేదీల సంఖ్యలు ఆది, సోమ, గురువారములతో కలసిన మరింత శుభప్రదము.
Muhurth Fixing | Free Astrology

Astrology Consultation

Price range: ₹1,000.00 through ₹2,500.00

Horoscope Matching

Horoscope Matching for Marriage

Price range: ₹550.00 through ₹2,200.00

Download Horoscope

Download Horoscope

Price range: ₹500.00 through ₹1,000.00

Download

ఉగాది మేష రాశి ఫలితాలు – Mesha Rasi Phalalu 2026-27

Mesha Rashiphal 2026, Mesha Rasi Phalalu, Mesha Rasi Ugadi Rasi Phalalu 2026, Ugadi Rasi Phalalu, Ugadi Rasi Phalalu 2026-27, Ugadi Rasiphalalu, Ugadi Rasiphalalu 2026, What is the future of Mesha Rasi, Yearly Prediction for Aries
ఉగాది వృషభ రాశి ఫలితాలు – Vrushabha Rasi Phalalu 2026-27
చైత్ర మాసంలో ఉపనయనం ముహుర్తాలు – Thread Ceremony Dates In the Month of April 2026

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.