ఉగాది మిధున రాశి ఫలితాలు – Mithuna Rasi Phalalu 2026-27

Loading

Mithunam Rasi Phalalu 2026-27

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉగాది మిధున రాశి ఫలితాలు 2026-2027

ఈ పరాభవ నామ సంవత్సరంలో మిధున రాశి [Sri Parabhava Nama Samvatsara Mithuna Rasi Phalalu 2026-27] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 08
  • వ్యయం – 11
  • రాజపూజ్యం – 01
  • అవమానం – 07

ఎవరెవరు మిధునరాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు మిధునరాశి లోకి వస్తారు.

  • మృగశిర 3,4 పాదములు (కా,కి),
  • ఆరుద్ర 1,2,3,4 పాదములు(కు, ఘ, ఙ, ఛ)
  • పునర్వసు 1,2,3 పాదములు (కే,కో, హా)

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది మిధున రాశి ఫలాలు [Mithuna Rasi Phalalu 2026-26] ఈ కింది విధంగా ఉన్నాయి.

శ్రీ పరాభవ నామ సంవత్సరం లో మిధున రాశి ఫలాలు 2026-27

  • ఈ రాశివారికి గురుడు జూన్ 1 వరకు జన్మస్థానమందు సువర్ణమూర్తి విశేషముగు శుభఫలితములను ఇచ్చును. తదుపరి జూన్ 2 నుండి ద్వితీయ స్థానమందు గురుడు తామ్రమూర్తిగా సామాన్య ఫలితములను ఇచ్చును. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు నవమ, తృతీయ స్థానములందు లోహమూర్తులుగా ధనవ్యయం, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి అష్టమ, ద్వితీయ స్థానములందు రజితమూర్తులుగానూ సౌభాగ్యకరమగు ఫలితములను ఇచ్చెదరు. సంవత్సరారంభంలో రచయితలుగా, న్యాయమూర్తులుగా లేదా విదేశీ రాయబార కార్యాలయాలలో పనిచేసేందుకు ఉద్యోగావకాశములు కలుగుతాయి.
  • ద్వితీయ స్థానమైన కర్కాటకం గురుని ఉచ్చసంచారం వాక్ పటిమకు, సంపద వృద్ధికి నిలయం. అధికారం మరియు హోదా, ఆర్థిక భద్రత. మధురమైన స్వరంతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఉద్యోగాలలో రాణిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ మరియు వృద్ధి అవకాశాలు. రచనా నైపుణ్యాల ద్వారా ఆదాయం, కవులకు, సాహిత్య పండితులకు గుర్తింపు, పురస్కారాలు వస్తాయి. పరిశోధనలకు విదేశీ మారక ద్రవ్యం, గుర్తింపు లభిస్తాయి.
  • శనైశ్చరుడు దశమ స్థానమందు సంచారం వలన ధార్మికమైన జీవనం సాగిస్తారు. కుటుంబానికి అండగా ఉంటారు. సంతానాభివృద్ధికి ప్రయత్నం చేస్తారు. పూర్వపు అలసట, ఒత్తిడి తట్టుకుంటారు. ఆరోగ్యం గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. పరస్పర అవగాహన, వృద్ధి, ఆనందమయమైన కుటుంబ జీవనం. న్యాయాధికారులు బ్యాంకు, వాణిజ్యరంగ సంస్థల అధికారులు మితంగా ప్రవర్తిస్తే ఇబ్బందులు. ఋజువర్తన కలిగి సన్మార్గాన్ని అనుసరించే అధికారులకు గుర్తింపు, ఉద్యోగ ఉన్నతి. విద్యార్థులు పబ్లిక్ సర్వీస్ పోటీ పరీక్షలలో రాణించి, ఉన్నత ఉద్యోగములు సాధిస్తారు. న్యాయాధికారులుగా అవకాశాలు వస్తాయి.
  • పొదుపుతో కూడిన ఆదాయం అవసరానికి ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో పొదుపు చేసిన ధనం చేతికి అందుతుంది. సహనంతో కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. పెద్దలను గౌరవిస్తూ కుటుంబంలో సంబంధాలను వృద్ధిచేసుకుంటారు. ఈ రాశివారు పరిపక్వత అవగాహన మరియు సమతుల్యతతో సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు.
  • జూలై 26 నుండి డిసెంబరు 11 మధ్య రేవతి ఉత్తరాభాద్ర నక్షత్రములలో శని వక్రించి సంచరించుట వలన దశమస్థానంలో శనైశ్చరుడు వక్ర సంచారం వలన వృత్తి వ్యాపార లావాదేవీలలో ప్రతిబంధకములు, బ్యాంకింగ్ రంగం, వాణిజ్య, బ్యాంకు ఉద్యోగస్తులు అప్రమత్తతతో వ్యవహరించవలసిన సమయం.
  • తల్లిదండ్రులు ఇతరదేశాలలో సంచరించడంతో వారికి దూరంగా ఉండవలసి వస్తుంది. అలాగే వీరు ఇతరులకు సహాయకారిగా ఉంటారు.
  • మిథునరాశి వారికి అదృష్ట సంఖ్య 5. 3 మరియు 8 సంఖ్యలు గల తేదీలు ఆది, బుధ, శుక్ర, శనివారాలు కలసివస్తాయి.
Muhurth Fixing | Free Astrology

Astrology Consultation

Price range: ₹1,000.00 through ₹2,500.00

Horoscope Matching

Horoscope Matching for Marriage

Price range: ₹550.00 through ₹2,200.00

Download Horoscope

Download Horoscope

Price range: ₹500.00 through ₹1,000.00

Download

ఉగాది మిధున రాశి ఫలితాలు – Mithuna Rasi Phalalu 2026-27

Midhuna Rashiphal 2026, Midhuna Rasi Phalalu, Midhuna Rasi Ugadi Rasi Phalalu 2026, Ugadi Rasi Phalalu, Ugadi Rasi Phalalu 2026-27, Ugadi Rasiphalalu, Ugadi Rasiphalalu 2026, What is the future of Midhuna Rasi, Yearly Prediction for Gemini
ఉగాది కర్కాటక రాశి ఫలితాలు – Karkataka Rasi Phalalu 2026-27
ఉగాది వృషభ రాశి ఫలితాలు – Vrushabha Rasi Phalalu 2026-27

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.