ఆన్‌లైన్‌ పూజా సమర్పయామి…

ఈనాడు దినపత్రిక వారి శనివారం, నవంబర్ 11, 2017 పత్రికలో, ఆదివారం పుస్తకంలో సేవ/స్ఫూర్తి/జ‌న‌ర‌ల్ అంశంలో భాగంగా Poojalu.com గురించి ఒక ప్రత్యేక వ్యాసము ప్రచురితమైనది…

‘పండగ దగ్గరకొచ్చేస్తోంది. ఇంట్లో పూజ చేయించడానికి ఇంతవరకూ పురోహితుడే దొరకలేదు. పూజకు ఇరవై రకాలకు పైగా సామగ్రి కావాలి. వాటికోసం ఎన్ని షాపులకు తిరగాలో… ఏం అర్థం కావడంలేదు…’ ఇక, ఇలా టెన్షన్‌ పడే అవసరమే లేదు. ఎందుకంటే, పురోహితులూ పూజావస్తువుల దగ్గర్నుంచి ప్రముఖ ఆలయాల ప్రసాదాల వరకూ ఇప్పుడన్నీ Online లో ఒక్క Click తో ఇంటికొచ్చేస్తున్నాయి మరి.

కొత్తగా పెళ్లి చేసుకుని నగరానికి వచ్చిన గణేష్‌ అతని భార్యా దసరా సందర్భంగా ఇంట్లో చండీహోమం(Chandi Havan) చేయించాలనుకున్నారు. కానీ నగరంలో పురోహితుడు ఎక్కడ దొరుకుతాడో తెలియదు. పూజకు అవసరమైన రకరకాల సామగ్రి(Pooja Material) కోసం ఎక్కడికెళ్లాలో తెలియదు. అసలే భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలతో బిజీ బిజీ. అలాంటి వారికి ఆలయాల చుట్టూ తిరిగి హోమం చేసేందుకు పురోహితుడిని పట్టుకోవడమూ షాపుల చుట్టూ తిరిగి అవసరమైన సామగ్రిని తేవడమూ ఎంత కష్టమైన పనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈరోజుల్లో నగరాలతో పాటు చిన్నచిన్న పట్టణాల్లోనూ చాలామందికి ఎదురయ్యే సమస్యే ఇది. కానీ అన్నీ ఆన్‌లైన్‌లో దొరుకుతున్న ఈ హైటెక్‌ కాలంలో పూజలు చేసేందుకు ఇంత ఇబ్బందిపడితే ఎలా… అందుకే, పండుగల సమయాల్లో చేసే పూజలూ వ్రతాలతో పాటు, పెళ్లి, గృహప్రవేశం… లాంటి సంప్రదాయ వేడుకల కోసం పురోహితులతో పాటు పూజా సామగ్రి, పూజలకు సంబంధించిన మరెన్నో సేవల్ని Online ద్వారా అందించే స్టార్టప్‌లు చాలానే వస్తున్నాయి. Poojalu.com, MyPanditg.com, OnlinePurohit.com, WheresMyPandit.com లాంటి Websiteలు ఇలాంటివే.

చిటికెలో ఏర్పాట్లు: 

దసరా, దీపావళి, వరలక్ష్మీ వ్రతం, సత్యన్నారాయణ స్వామి వ్రతం, పెళ్లి, నామకరణం, బారసాల… ఏ పూజ అయినా ఎలాంటి వేడుకైనా వినియోగదారులు తాము చేయించుకోవాలనుకుంటున్న సమయాన్ని ఎంచుకుంటే చాలు. సంబంధిత పురోహితుడ్ని పూజకు అవసరమైన సామగ్రితో సహా ఆ సమయానికి అక్కడికి పంపుతాయి(Online Pandit Booking with Pooja Material) ఆయా కంపెనీలు. ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా ఈ వెబ్‌సైట్‌ల్లోని పండితులను సంప్రదించవచ్చు. కాబట్టి, మనం అడుగు బయట పెట్టకుండా, హడావుడి లేకుండా, పూజలూ హోమాలకు కూడా ఏర్పాట్లన్నీ చేసేసుకోవచ్చు.

‘నగరాల్లోని వారికి పురోహితుల్ని సంప్రదించడమూ పూజా సామగ్రి కొనుక్కోవడమూ కాస్త కష్టమైన పనే. పూజలు చెయ్యడానికి వెళ్లినపుడు చాలామంది నాతో ఈ సమస్యల గురించి ప్రస్తావించేవారు. అప్పుడే Online Purohits / Pandits దొరికే సౌలభ్యం ఉంటే బాగుంటుందనిపించింది. అలా ప్రారంభమైందే Poojalu.com website. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారు కూడా పురోహితుల కోసం మమ్మల్ని సంప్రదిస్తుంటారు. వారికోసం స్థానికంగా ఉండే మా పురోహితుల్ని పంపిస్తాం. కావాలంటే పురోహితులే పూజకు (Pandit for Pooja) అవసరమైన సామగ్రి మొత్తాన్ని తీసుకెళ్తారు’ అంటారు పూజలు.కాం వ్యవస్థాపకుడు రవికుమార్‌ శర్మ. ఈ కంపెనీ విదేశాల్లో ఉండేవారికి వీడియోచాట్‌ ద్వారా కూడా పూజలు(ePuja Services) చేయిస్తోంది. అంటే ఎవరైనా అక్కడ పూజ చేయించాలంటే ముహూర్తాన్ని నిర్ణయించి పూజకు అవసరమైన వస్తువుల గురించి ఇక్కణ్నుంచే Online లో చెబుతారు. వారు అక్కడ అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక వీడియో చాట్‌ ద్వారా మంత్రాలు చదువుతూ అక్కడున్నవారితో పూజలు చేయిస్తారు. మిగిలిన వెబ్‌సైట్‌లు కూడా కొన్ని ఇలాంటి సేవల్ని అందిస్తున్నాయి.

ఆన్‌లైన్‌లో ప్రసాదం :

ePuja.co.in అయితే, ఇంటిదగ్గరుండే మన దేశంలోని 3,600 ఆలయాల్లో ఎక్కడైనా మన పేరున హోమాలు జరిపించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఈ సేవల్ని పొందొచ్చు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసి, ఆ సీడీనీ ప్రసాదాన్ని వారికి పంపిస్తారట.

తెలిసిన పురోహితులు ఉన్నారు, వస్తారు… లేదా చిన్న చిన్న వ్రతాలు పుస్తకం చదివి మనమే చేసుకుంటాం… అనుకున్నా… కొన్నిటికి 20 రకాలకు పైగా పూజా సామగ్రి అవసరం అవుతుంది. అన్నీ ఒకే షాపులో దొరకడమూ కష్టమే. అందుకే, ఆ ఇబ్బంది కూడా లేకుండా పూజలూ వ్రతాలకు సంబంధించిన అన్నిరకాల వస్తువులూ ఒకే చోట దొరికే సైట్‌లూ చాలానే ఉన్నాయి. Poojadhravyam18, Divinestore.in, ఈ ePoojaStore.com, ShubhPuja.com లాంటివి ఆ కోవకు చెందినవే. వీటిలో ప్రధాన పండుగలూ వేడుకలకు అవసరమైన సామగ్రి అంతా దొరుకుతుంది. మన దగ్గర సామగ్రి లిస్టు ఉంటే అవసరమైన వాటిని ఎంచుకుని తీసుకోవచ్చు. లేదంటే వరలక్ష్మీ వ్రతం, సత్యన్నారాయణ స్వామి వ్రతం, నవరాత్రి పూజ, శంకుస్థాపన, గృహప్రవేశం, పెళ్లి, వాహనపూజ… ఇలా దేనికి దానికే సామగ్రి ఓ కిట్‌లా దొరుకుతుంది. ఆ కిట్‌ను ఆర్డరిస్తే అన్నీ వచ్చేస్తాయి.

Online Pooja Services - Article

ఇలాంటి వస్తువుల్నే కాదు, దేవుడి ప్రసాదాన్ని కూడా Online లో తెప్పించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది OnlinePrasad.com, OnlineTemple.com. దీనిద్వారా మనం వెళ్లకుండానే షిరిడీ, తిరుపతి, పూరీ జగన్నాథ్‌ ఆలయం, వైష్ణోదేవి… ఇలా దేశంలోని ఎన్నో ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాన్ని తెప్పించుకోవచ్చు.

ముస్లింలూ సిక్కులూ జైనులకు సేవలందించే వెబ్‌సైట్‌లూ చాలానే ఉన్నాయి. Rahat-Travels(Rahat.in) వెబ్‌సైట్‌ హజ్‌, ఉమ్రా యాత్రలకు అవసరమైన ఉత్పత్తులను అమ్ముతుంటే, sikhrumalacentre.com సిక్కులకు సంబంధించిన ఉత్పత్తుల్ని అమ్ముతోంది.

అదండీ సంగతి… ఈరోజుల్లో వ్రతాలూ హోమాల ఏర్పాట్లు చెయ్యడం కూడా ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్‌ కొన్నంత సులభం అయిపోయింది.

Published on: http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=7543