శంఖం గూర్చి పూర్తి వివరణ – శంఖములో రకాలు | శంఖం ఉపయోగాలు

శంఖం గూర్చి పూర్తి వివరణ – శంఖములో రకాలు | శంఖం ఉపయోగాలు

Loading

significance of conch or shankha

శంఖం గూర్చి పూర్తి వివరణ – శంఖములో రకాలు | శంఖం ఉపయోగాలు

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

significance of conch or shankha

శంఖే చంద్ర మావాహయామి |
కుక్షే వరుణ మావాహయామి |
మూలే పృధ్వీ మావాహయామి |
ధారాయాం సర్వతీర్థ మావాహయామి |

పవిత్రమైన వస్తువులలో శంఖం ఒకటి. శంఖం సిరి సంపదలకు ప్రతీక.  దీన్ని పూజా గదుల యందు ఉంచినట్లయితే  అన్ని అరిష్ఠాలు తొలగిపోతాయి. దేవాలయాలలో, యజ్ఞ్య యాగాది క్రతువులందు,  శుభకార్యాలలోనూ శంఖము యొక్క ధ్వని చేయుట వలన ఆయా కార్యక్రమములకు శోభ పెరుగును . విష్ణు పురాణం ప్రకారం క్షీరసాగర మధనంలో వచ్చిన పదనాలుగు రత్నాలలో శంఖం ఒకటి.

ఒక విధంగా శంఖము లక్ష్మీదేవికి వారసురాలు. కూర్మ పీఠం పై ఎర్రన్ని పట్టు వస్త్రాన్ని వేసి శంఖ దేవతను పూజించినచో సకల శుభములు చేకురును. పగిలినది, విరిగినది, పలచనిపొర, గరుకైన ముక్కు, రంధ్రాలు ఉన్న శంఖాలు పూజకు పనికిరావు. శంఖాలలో చాలా రకాలు ఉన్నాయి. ఒకొక్క రకానికి ఒకొక్క పూజా విధానం కలదు.

శంఖం యొక్క ఆకారాన్ని బట్టి వాటిని 3 రకాలుగా విభజిస్తారు.
1. దక్షిణావృత శంఖం – ఎడమ చేతితో పట్టుకునే శంఖము (పూజకు మాత్రమే ఉపయోగిస్తారు)
2. ఉత్తరావృతవ శంఖం – మధ్యలో నోరులా ఉన్న శంఖము (ఊదుటకు మాత్రమే ఉపయోగిస్తారు)
3. మధ్యావృత శంఖం – కుడిచేతితో పట్టుకునే శంఖము

కొన్ని ముఖ్య శంఖాల పేర్లు:
1. లక్ష్మీ శంఖం, 2. గోముఖ శంఖం, 3. కామధేను శంఖం, 4. దేవ శంఖం, 5. సుఘోష శంఖం, 6.  గరుడ శంఖం, 7. మణిపుష్పక శంఖం, 8. రాక్షస శంఖం, 9. శని శంఖం, 10. రాహు శంఖం, 11. కేతు శంఖం, 12. కూర్మ శంఖం.

శంఖము యొక్క ఉపయోగాలు
శంఖము యొక్క ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక. శంఖాన్ని శివపూజకు, పూజనందు ఆరతి ఇచ్చేటప్పుడు ధార్మిక ఉత్సవాలలో యజ్ఞాలలో రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు మరియు దీపావళి, హోళి, మహాశివరాత్రి, విశిష్టమైన కర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్రపూజకు, గణేశపూజకు, దేవిపూజకు, విష్ణుపూజకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను, అభిషేకిస్తూ వుంటారు. దీనిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలుపోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవుపాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దు:ఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి.

సేకరణ: https://www.panditforpooja.com/blog/significance-of-conch-or-shankha/

conch, dharma sandehalu, pooja, pooja room, shankha
రేపు పాదాధిక గ్రాస్త సూర్యగ్రహణం
పూజారి లేకుండా రికార్డు చేసిన మంత్రాల ద్వారా ఇంట్లో పూజ చేస్తే ఫలితం వస్తుందా?

Related Posts