ఉగాది సింహ రాశి ఫలితాలు – Simha Rasi Phalalu 2026-27

Loading

Simha Rasi Phalalu 2026-27

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉగాది సింహ రాశి ఫలితాలు 2026-27

ఈ పరాభవ నామ సంవత్సరంలో సింహ రాశి [Sri Parabhava Nama Samvatsara Simha Rasi Phalalu 2026-27] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 05
  • వ్యయం – 05
  • రాజపూజ్యం – 07
  • అవమానం – 07

ఎవరెవరు సింహరాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు సింహరాశి లోకి వస్తారు.

  • మఖ 4 పాదాలు (మ, మి, ము, మే)
  • పుబ్బ 4 పాదాలు (మో, ట, టి, టు)
  • ఉత్తర 1వ పాదం (టె)

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సింహరాశి ఫలాలు [Simha Rasi Phalalu 2026-27] ఈ కింది విధంగా ఉన్నాయి.

శ్రీ పరాభవ నామ సంవత్సరం లో సింహ రాశి ఫలాలు 2026-27

  • ఈ రాశివారికి గురుడు 2026 జూన్ 1 వరకు ఏకాదశ స్థానమందు లోహమూర్తిగా సామాన్య ఫలితములను తదుపరి జూన్ 2 నుండి వ్యయస్థానమందు రజితమూర్తిగా సౌభాగ్యకరమగు శుభ ఫలితములను ఆయుర్వృద్ధిని కలుగజేయును.
    రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు సప్తమ, జన్మస్థానములందు సువర్ణమూర్తులుగా విశేష ఫలితములను ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి షష్ట, ద్వాదశ స్థానములందు తామ్రమూర్తులుగానూ సామాన్య ఫలితములు నిచ్చెదరు. ఆధ్యాత్మికంగా రాణిస్తారు. కుటుంబ వ్యవస్థ బలోపేతమవుతుంది.
  • భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, శుభమూలక ధనవ్యయం, గృహమున మంగళ తోరణములు, బంధుమిత్రుల కలయిక, ఆదాయానికి మించిన ఖర్చులు, విదేశీ సందర్శనతో ఆర్థికలాభం. ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక జీవనంతో మంచి ఫలితాలు. స్వదేశంలో స్థిరాస్తులను సమకూర్చుకుంటారు.
  • వృత్తి వ్యాపారాలలో క్రమేపీ అభివృద్ధి, పనులు ఆలస్యం, వ్యయస్థానమందు గురుని స్థితి వలన సంతానం సృజనాత్మకంగా చదువుల్లో రాణింపు. పోటీపరీక్షలలో ఉత్తీర్ణత, విద్యలలో గుర్తింపు. మత్స్యసంబంధ వ్యాపారస్తులకు అపరిచిత వ్యక్తుల ద్వారా విదేశీ విక్రయాలు, స్పెక్యులేషన్, ఆకస్మిక ధనలాభాలు వస్తాయని కలలు కని ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం. మిత్రులతో సంబంధాలు చెడును.
  • సప్తమ స్థానగతుడైన రాహు సంచారము వలన సామాజిక గుర్తింపు తగ్గి వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బ తింటుంది. మాటతొందర వలన బంధువులతో భేదాభిప్రాయములు. జన్మస్థానమందు కేతువు సంచారం వలన ఆధ్యాత్మిక విషయములకు ప్రాధాన్యత, ఒత్తిడి, సమస్యలు, తలనొప్పి, ఆందోళన, జీర్ణ సంబంధ అనారోగ్యములు కలుగును. వ్యవహార వ్యాపారములలో అసందర్భ నిర్ణయాల వలన చికాకులు. శుభకార్య నిర్వహణ. డిసెంబరు నుండి ప్రతిబంధకములు తొలిగి, ధనాగమము కలుగును. పాటించాలి. నిజాయితీ, నిలకడ ద్వారా మిత్రులతో విభేధములను నివారించవచ్చును.
  • జూలై 26 నుండి డిసెంబరు 11 మధు యోగాభ్యాసము, కాలినడక, పాష్టికాహారము తీసుకొనుట వలన ఆరోగ్యం, వ్యాపార లావాదేవీలలో అనుభవజ్ఞుల సలహాలకి, అష్టమరాశియగు మీనరాశిలో రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రములలో శని వక్రించి సంచరించుట వలన వ్యవహార ప్రతిబంధకములు ఆరోగ్యలోపం, ఖర్చులు పెరగడం, అకస్మాత్తుగా వైద్యసహాయం అవసరమగుటను సూచిస్తుంది.
  • మృత్యుంజయ మంత్రంతో రుద్రాభిషేకం అపమృత్యు దోషం నుండి ఉపశమనాన్నిస్తుంది.
  • సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1. 4, 10 సంఖ్యలు గల తేదీలు ఆది, సోమ, బుధ, గురువారాలు కల్సిన మరింత మేలు జరుగును.
Muhurth Fixing | Free Astrology

Astrology Consultation

Price range: ₹2,000.00 through ₹3,000.00

Horoscope Matching

Horoscope Matching for Marriage

Price range: ₹550.00 through ₹2,500.00

Download Horoscope

Download Horoscope

Price range: ₹500.00 through ₹1,000.00

Download

ఉగాది సింహ రాశి ఫలితాలు – Simha Rasi Phalalu 2026-27

Simha Rashiphal 2026, Simha Rasi Phalalu, Simha Rasi Ugadi Rasi Phalalu 2026, Ugadi Rasi Phalalu, Ugadi Rasi Phalalu 2026-27, Ugadi Rasiphalalu, Ugadi Rasiphalalu 2026, What is the future of Simha Rasi, Yearly Prediction for Leo
ఉగాది కన్యా రాశి ఫలితాలు – Kanya Rasi Phalalu 2026-27
ఉగాది కర్కాటక రాశి ఫలితాలు – Karkataka Rasi Phalalu 2026-27

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.