వినాయక చవితి పూజ వెనుక దాగివున్న సామాజిక- ఆయుర్వేద- ఆధ్యాత్మిక- విశేషాలేమిటి?

వినాయక చవితి పూజ వెనుక దాగివున్న సామాజిక- ఆయుర్వేద- ఆధ్యాత్మిక- విశేషాలేమిటి?

Loading

వినాయక చవితి పూజ వెనుక దాగివున్న సామాజిక- ఆయుర్వేద- ఆధ్యాత్మిక- విశేషాలేమిటి?

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

  1. మట్టితో చేసిన వినాయకుడినే పూజించడం వెనుక దాగివివున్నసామజిక విషయమేమిటి?
  2. 21 రకాల ఆకులను పత్రిగా పూజించడం వలన ఆయుర్వేద రహస్యమేమి?
  3. గణేశుడిని మాత్రమే నిమజ్జనం చేయడం వలన కలిగే ఆధ్యాత్మిక ఫలితమేమి?

వినాయక చవితి అంటే ముఖ్యంగా మూడు కార్యక్రమాలు తప్పనిసరి. విగ్రహం తేవడం. మండపాల్లో పెట్టి నవరాత్రుల పాటూ పూజించడం. ఆఖరుగా నిమజ్జనం చేయడం. దీని అర్ధమేంటి? వినాయకుడ్ని మాత్రమే ఎందుకిలా నిమజ్జనం చేస్తారు? అందులో దాగిన సామాజిక- ఆయుర్వేద- ఆధ్యాత్మిక- విశేషాలేమిటి? అన్నిటికన్నా మించి నిమజ్జన రహస్యాలేమిటి?

clay ganesh

పౌరాణికంగా వినాయకుడి జననం.. తర్వాతి రోజుల్లో సామాజిక అవసరంగా మారింది. కేవలం స్వాతంత్ర ఉద్యమం విషయమే కాకుండా ఇందులో మరిన్ని విశేషాంశాలు దాగి వున్నాయని చెబుతారు. ఏమిటవి? ఎలాంటివి? రుతువులకు వినాయక చవితి పండుగకు గల సంబంధమేంటి? పూజ- నిమజ్జన కార్యక్రమాల్లో ఏయే అంశాలు దాగి వున్నాయి?

Cleaning_village_pond

పంచభూతాల్లో ఒకటైన ఈ మట్టి.. సర్వమానవాళికి అందుబాటులో వుండేది. అందుకే మట్టి విగ్రహాలు- అందునా కొత్త మట్టి విగ్రహాలు చేయమనడం మరెందుకో కాదు. సర్వమానవాళి సుఖశాంతుల కోసం. ఇదేమి లింకు? అని ప్రశ్నించుకుంటే, అందుకు అనేక సమాధానాలు తెలియవస్తాయి. వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది. భూమి తల్లి కూడా అప్పుడప్పుడే వానలకు తడిసి వుంటుంది. గ్రామాలు, పట్టణాలన్న తేడా లేకుండా చెరువులు మరింత జలకళతో కనిపించాలంటే.. వాటి పూడిక తీయడం అవసరం. తద్వారా వచ్చే బంకమట్టితో వినాయక ప్రతిమలు చేయడం వల్ల.. దానికి 21 రకాల పత్రులతో నవరాత్రుల పాటూ పూజలు చేయడం వల్ల.. మరిన్ని ప్రయోజనాలున్నాయట.

ganesh nimajjanam

21 రకాల ఆకులు సాధారణమైనవి కావు. ఔషధ శక్తి కలిగినవి. వాటితో పూజ చేయడంవల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి.. మనలో ఉండే అనారోగ్యాలను హరింపచేస్తుందని చెబుతారు. 9 రోజుల పూజ తర్వాత, నిమజ్జనం ఎందుకు చేయాలీ? అన్న సందేహం రావచ్చు. చెరువులు, బావులు, నదులు- వర్షాలవల్ల కలుషితం కావడం సర్వసాధారణం. ఈ నీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రి ఉపయోగపడుతుందట. 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితోబాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడం అందుకేనట. అలా నీటిలో కలిసిన మట్టి, రకాల పత్రి కలిసి నిమజ్జనం తర్వాత 23 గంటలయ్యాక.. తమలో ఉన్న ఔషధ గుణాల ఆల్కలాయిడ్స్‌ని ఆ జలంలోకి వదిలేస్తాయట. అవి బాక్టీరియా నిర్మూలించి, జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయని అంటారు. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం

21 Patra

vinayaka chavithi
ఏకదంతుడినిగా భక్తులను అనుగ్రహించే కృపామూర్తి
జూలై 27, 2018 సంపూర్ణ చంద్ర గ్రహణం ఏ రాశి వారికి యే ఫలితము ఇచ్చును?

Related Posts