Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.
2026 లో శ్రీరామ నవమి ఎప్పుడు.. 26న లేదా 27వ తేదీనా..? అసల పండుగ ఎప్పుడు చేసుకోవాలి?
![]()

శ్రీరామనవమి 2026 – తేదీ, భద్రాచలం సీతారామ కళ్యాణం & పూర్తి వివరాలు
హిందువుల అత్యంత పవిత్రమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణంలో శ్రీరామ నవమి పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. అయితే 2026లో శ్రీరామనవమి 26నా లేదా 27నా అనే సందేహం చాలా మందిలో ఉంది. ముఖ్యంగా భద్రాచలం సీతారాముల కళ్యాణం తేదీ వేరుగా ప్రకటించడంతో ఈ గందరగోళం మరింత పెరిగింది. ఈ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
శ్రీరామనవమి 2026 – అసలు తేదీ [Sri Rama Navami 2026 Date]
2026లో నవమి తిథి రెండు రోజులు ఉంది:
- నవమి తిథి ప్రారంభం: మార్చి 26 మధ్యాహ్నం 2:18 గంటలకు
- నవమి తిథి ముగింపు: మార్చి 27 మధ్యాహ్నం 12:36 గంటలకు
ఈ కారణంగా పండుగ తేదీపై సందేహం ఏర్పడింది.
- దేశవ్యాప్తంగా చాలా క్యాలెండర్లు మార్చి 26ను శ్రీరామనవమిగా చూపిస్తున్నాయి
- కానీ భద్రాచలంలో సీతారాముల కళ్యాణం మార్చి 27న జరుగుతుంది
ఇంతకీ మరి శ్రీరామనవమి 26నా? 27నా? [Ram Navami 2026: When is Ram Navami on March 26 or 27]
హిందూ శాస్త్రాల ప్రకారం సూర్యోదయ సమయానికి ఉన్న తిథిని ఆధారంగా తీసుకుని పండుగను నిర్ణయిస్తారు.
ఈ నియమం ప్రకారం:
- మార్చి 27, 2026 నాడు ఉదయం నవమి తిథి ఉంది
- అందువల్ల చాలా మార్చి 27నే శ్రీరామనవమిగా నిర్ధారణ చేయడం జరిగినది.
అయితే కొన్ని సంప్రదాయాలు మధ్యాహ్న సమయంలో నవమి తిథి ఉండే రోజును పరిగణలోకి తీసుకుంటాయి. ఆ ప్రకారం మార్చి 26న కూడా పండుగను జరుపుకుంటారు.
భద్రాచలం సీతారాముల కళ్యాణం 2026
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన భద్రాచలం సీతారాముల కళ్యాణం:
- తేదీ: మార్చి 27, 2026
- ముహూర్తం: ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:31 వరకు
ఇదే సమయం శ్రీరామ జన్మ ముహూర్తంగా కూడా పరిగణిస్తారు. అందువల్ల భద్రాచలంతో పాటు అనేక ఆలయాల్లో ఈ రోజే సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు.
శ్రీరాముడు ధర్మం, సత్యం, నీతి జీవనానికి ప్రతీక. అందుకే ఆయన జన్మదినాన్ని కేవలం పండుగగా కాకుండా ధర్మ మార్గంలో నడవాలని గుర్తు చేసే పవిత్రమైన రోజుగా భావిస్తారు.
Related
Download 2026 లో శ్రీరామ నవమి ఎప్పుడు.. 26న లేదా 27వ తేదీనా..? అసల పండుగ ఎప్పుడు చేసుకోవాలి?
Related Posts
Recent Posts
- యమునా నది పుష్కర స్నాన సంకల్పం – యమునా పుష్కరములు 2026
- యమునా నది పుష్కరాలు సమయంలో చేయవలసిన దానాలు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కర స్నానానికి ముఖ్యమైన పుష్కర స్నాన ఘాట్లు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కరం తేదీలు ఏమిటి?
- 2026 లో యమునా నది పుష్కరాలు ఎప్పుడు?
- శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ – హనుమాన్ వ్రత విధానం
- హనుమాన్ జయంతి – హనుమజ్జయంతి పండుగ పూర్తి వివరాలు










