2025 సంవత్సరం ఆషాఢ మాసంలో జరగనున్న శ్రీ వారాహి గుప్త నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారి రూపాల విశిష్టత, పూజా విధానం, నివేదన, దీపారాధన, హోమ విశేషాలతో పాటు ఆధ్యాత్మిక ప్రయోజనాలు మరియు సమస్యల పరిహారాలు తెలుసుకోండి.
జూన్ 26 నుండి జూలై 5 వరకు, శ్రీ వారాహి దేవి పది పవిత్ర రూపాలలో దర్శనమిస్తుంది. ఈ కాలంలో, ప్రతి రోజు ఆమె ఒక ప్రత్యేక అంశంగా అనుగ్రహిస్తుంది.
శ్రీ వారాహి గుప్త నవరాత్రులు
- జూన్ 26, గురువారం: అదివారాహి
- జూన్ 27, శుక్రవారం: దండిని వారాహి
- జూన్ 28, శనివారం: బృహద్ వారాహి
- జూన్ 29, ఆదివారం: ఉన్మత్త వారాహి
- జూన్ 30, సోమవారం: స్వప్న వారాహి
- జూలై 1, మంగళవారం: ధూమ్ర వారాహి
- జూలై 2, బుధవారం: వజ్ర వారాహి
- జూలై 3, గురువారం: శ్వేత వారాహి
- జూలై 4, శుక్రవారం: కిరాత వారాహి
- జూలై 5, శనివారం: మహా వారాహి
శ్రీ వారాహి గుప్త నవరాత్రులు పది రోజులు వారాహి దేవి యొక్క ఈ వివిధ రూపాలను పూజించి, ఆమె అనుగ్రహాన్ని పొందవచ్చు.
వారాహిమాతను లలితమ్మ అంగ దేవతగా శ్రీవిద్య లో పూజ చేస్తే ఆమె పూజ రాత్రి సమయంలో మటుకే చేయాలి..వారహిని ప్రధాన దేవతగా పూజించే సమయంలో మూడు కాలాల్లో పూజ చేయవచ్చు.. ఉదయం సాయంత్రం కూడా వారాహి నవరాత్రి జరిపే రోజుల్లో పూజ చేయవచ్చు…
ఈ సంవత్సరం ఈ వారాహి నవరాత్రులు ప్రతి ఇంట్లో జరగాలని కోరుకుంటున్నాను, ఈ తల్లి ఎన్నో సమస్యలకు పరిహారం ఇస్తుంది, ముక్యంగా ఆస్తి తగాదాలు, అప్పులు, అనారోగ్య సమస్యలు, భూమి కొనడం, అమ్మడం, శత్రు బాధలు, గ్రహ బాధలు, ప్రయోగ బాధలు నుండి విముక్తి కలుగుతుంది. రానున్న రోజుల్లో మళ్ళీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ఏ కుటుంబం లో వ్యక్తి లు అయిన వారిని దూరం చేసికునే పరిస్థితి రాకూడదు. సమస్యలు వచ్చినా అవి దాటగల శక్తి అమ్మవారు అనుగ్రహించాలి ,ప్రతి కుటుంబానికి ఆమె రక్ష ఉండాలి.
ఉదయం లలితా సహస్రనామ పారాయణ చేయండి సాయంత్రం 6 గ పైన వారాహి పూజ మొదలుపెట్టాలి.అమ్మవారికి ఇప్ప నూనె అంటే చాలా ఇష్టం ఇప్ప నూనె తో దీపారాధన, ఇప్ప పువ్వులు దొరికితే పూజలో వాడండి, ఆ తల్లికి ప్రతి రోజు నివేదనలో యధాశక్తిన గుండ్రటి పండ్లు నైవేద్యం పెట్టాలి, లడ్డులు ( నువ్వులు బెల్లం నైయ్యి, ఇలాచి), పనస పండు చాలా విశేషం.. బెల్లం పానకం కచ్చితంగా పెట్టాలి.కందగడ్డ తో వంట నైవేద్యం, కంద దీపం, దుంపలు చిలకడ దుంపలు ఉడికించి బెల్లం కలిపి పెట్టడం..దానిమ్మ పండ్లు, దానిమ్మ గింజలతో అర్చన.. పుట్టతేన నైవేద్యం..అమ్మవారికి చేసే హోమంలో , తోక మిరియాలు, తెల్ల ఆవాలు, పనస తో చేస్తే అమ్మవారికి చాలా ప్రీతి.