హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

Loading

హనుమాన్ జయంతి

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

అంజనాదేవి, కేసరిల పుత్రునిగా. వాయుదేవుని యొక్క ఔరస పుత్రునిగా, ఎర్రని కన్నులు కలవాడై. అమిత విక్రముడైన. శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడైన. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకమును హరించినవాడైన. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుక వచ్చి యుద్ధమున వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడైన. దశకంఠుడైన రావణాసురుని గర్వమును అణచినవాడైన, వానరోత్తముడైన హనుమంతుడు జన్మించిన పరమ పవిత్రమైన రోజుగా   హనుమాన్ జయంతిగా పురాణములు పేర్కొన్నాయి.

అయితే ఉత్తర భారత దేశంలో చైత్రమాసమందు వచ్చే పౌర్ణమి రోజుని హనుమాన్ జయంతి ని జరుపుకోగా దక్షిణ భారతదేశంలో వైశాఖమాస బహుళ దశమి రోజుని హనుమాన్ జయంతి గా జరుపుకొంటారు.

పరాశర సంహిత ప్రకారం వైశాఖ బహుళ దశమి మద్యాహ్నం నైద్రుతి యోగమందు శనివారం నాడు ఈశ్వరాంశ సంభూతుడైన హనుమంతుని జననం.

హిందూమతమందు రామ భక్తునిగా, సీతారాముల పాద దాసునిగా, విజయ ప్రదాతగా కొలవబడే ఆరాధ్య దైవం హనుమంతుడు హనుమంతునికి ఆంజనేయుడు, హనుమాన్, భజరంగబలి అని అనేక పేర్లు కలవు.

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం |
బాష్పవారిపరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం ||
ఎక్కడెక్కడ రామనామము వినబడుతుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామి వారు అంజలిఘటిస్తూ పరిపూర్ణమైన ఆనందంతో కన్నుల వెంబడి నీరు కారగా స్వామి వారిని సంకీర్తనము చేయును.

హనుమజ్జయంతి రోజు చేయవలసిన పనులు:

  • హనుమజ్జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ  చేయడం వల్ల సర్వత్ర జయము కలుగును.
  • 5 సంఖ్య హనుమంతునికి చాల ప్రీతి కరమైనది కావునా హనుమాన్ మందిరమునకు 5 ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.
  • ఆలయాల్లో లభించే సింధూరం నుదుటన ధరించడం, ప్రసాదం స్వీకరించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగును.
  • హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటి పళ్ళు , మామిడి పళ్ళు నైవేద్యం పెట్టుట వల్ల స్వామి యొక్క అనుగ్రహం కలుగును.
  • చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు గల మండలం రోజుల పాటు ప్రతిరోజూ 1, 3, 5, 11, లేదా 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగును.
  • మండలం రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేసి ప్రతి నిత్యం అరటిపండు నివేదించి, ఆ పండును ప్రసాదంగా తీసుకొన్నచో సంతానం తప్పకుండ కలుగుతుందని భక్తుల నమ్మకం.
  • హనుమజ్జయంతి రోజున సింధూర వర్ణ వస్త్రములు ధరించడం, రామాలయాన్ని దర్శించుకోవడం వల్ల సర్వ శుభాలు కలుగును

హనుమంతుడి ఆరాధన వల్ల ఫలితములు:

  • శరీరానికి బలాన్ని, ఆయురారోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని విశ్వాసం.
  • జాతకరీత్యా శని గ్రహ దోషంతో బాధపడుతున్న వారు హనుమంతుడిని పూజించుట చేత గ్రహశాంతి ని పొందెదరు.
  • ఆంజనేయ ఆరాధన వల్ల ఆయుష్షు, ఆరోగ్యం ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను నెరవేర్చుతాడని నమ్మకం.
  • నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు ఆంజనేయుడిని స్మరించినవారికి మృత్యుభయం తొలగుటతో పాటుగా సర్వత్ర విజయం లభిస్తుంది.

హనుమంతుడికి సింధూరము ఎందుకు పూస్తారు?
ఒకానొక సందర్భంలో సీతమ్మ నుదుటున సిందూరం పెట్టుకోవడ చూసిన హనుమంతుడు, సింధూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా? అని ప్రశ్నించగా. అందుకు సీతమ్మ చిరుమందహాస ధారిణి ” శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా వుండాలని చెప్పగా. హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఒళ్ళంతా సింధూరం పూసుకుంటాడు.

hanuman
హనుమత్ వ్రతం – హనుమద్వ్రత విధి
మాతృ దినోత్సవం, అంతర్జాతీయ మాతృ దినోత్సవం (Mothers Day) ఎలా ప్రారంభం అయింది

Related Posts