Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.
3వ తేదీ మార్చి 2026 చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
![]()

చంద్రగ్రహణం (Chandra Grahanam) అంటే ఏమిటి?
చంద్రగ్రహణం అనేది భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు జరుగుతుంది. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడటంతో చంద్రుడు పూర్తిగా లేదా భాగంగా కనిపించకుండా పోతాడు. ఈ ఖగోళ సంఘటనను చంద్రగ్రహణం అంటారు.
హిందూ సంప్రదాయంలో చంద్రగ్రహణ సమయానికి ఆలయాలు మూసివేయడం, పూజలు నిలిపివేయడం ఆనవాయితీ. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి, పుణ్యహవచనం చేసి ఆలయాలను తిరిగి తెరిచి దర్శనాలు ప్రారంభిస్తారు.
3వ తేదీ మార్చి 2026 చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3వ తేదీ ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంను సుమారు 10.30 గంటల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
మార్చి 3వ తేదీ సాయంత్రం 3:20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 6:47 గంటలకు పూర్తవుతుంది, గ్రహణానికి 6 గంటల ముందే ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా పాటిస్తారు.
సాయంత్రం 7:30 గంటలకు ఆలయ తలుపులు తిరిగి తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించిన అనంతరం రాత్రి 8:30 గంటల నుండి భక్తులకు శ్రీవారి దర్శనం పునఃప్రారంభమవుతుంది.
తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికను తగిన విధంగా రూపొందించుకోవడం మంచిది.
Related
Download 3వ తేదీ మార్చి 2026 చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
Related Posts
No results found.
Comments
Related Posts
No results found.
Recent Posts
- యమునా నది పుష్కర స్నాన సంకల్పం – యమునా పుష్కరములు 2026
- యమునా నది పుష్కరాలు సమయంలో చేయవలసిన దానాలు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కర స్నానానికి ముఖ్యమైన పుష్కర స్నాన ఘాట్లు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కరం తేదీలు ఏమిటి?
- 2026 లో యమునా నది పుష్కరాలు ఎప్పుడు?
- శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ – హనుమాన్ వ్రత విధానం
- హనుమాన్ జయంతి – హనుమజ్జయంతి పండుగ పూర్తి వివరాలు




