శతాయుర్ వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయచ !
సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం !!
చైత్ర శుద్ధ పాడ్యమి నూతన తెలుగు సంవత్సరాది (ఉగాది పండుగ).
ఈ సంవత్సరం 22వ తేదీ మార్చి బుధవారం తెలుగు సంవత్సరాది. ఈ రోజు నుండే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం (Sri Shobhakrut Nama Samvatsara Ugadi Festival 2023) మొదలవుతుంది.
ఉగ అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది.
కొత్త లెక్కలు, నూతన కార్యక్రమములు ప్రారంభించుటకు మంచిరోజు.
>ఉగాది రోజున చేయవలసిన పనులు:
తైలాభ్యంగనం చేసి, సూర్యునికి ఆర్ఘ్యదీపధూపాధి, పుణ్య కాలానుష్టానం ఆచరించి సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించినవారి కోరికలు సంవత్సరాంతం సిద్ధిస్తాయి.
ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినడం వలన గంగానదిలో స్నానం చేస్తే లభించేటంత ఫలితం లభిస్తుంది.
వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడ్రుచులు మిళితమైన ఉగాది పచ్చడిని తినడం వలన వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుతాయి.
Poojalu.com ద్వారా స్వయంగా పురోహితుని బుక్ చేసుకుని ఈ ఉగాది రోజున ఇష్టదేవతారాధన, పంచంగ శ్రవణం చేయించుకునే అవకాశం కల్పించబోతున్నాం. ఆసక్తి కలిగినవారు వెంటనే మీ వివరాలు తెలపగలరు…
శోభకృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం మీ ప్రదేశం (ఆలయం / అపార్ట్ మెంట్) లో నిర్వహించడానికి ఇప్పుడే పూజారిని బుక్ చేసుకోండి:
