ఉగాది తులా రాశి ఫలితాలు – Tula Rasi Phalalu 2026-27

ఉగాది తులా రాశి ఫలితాలు 2026-27

ఈ పరాభవ నామ సంవత్సరంలో తులా రాశి [Sri Parabhava Nama Samvatsara Tula Rasi Phalalu 2026-27] వారి యొక్క రాశి ఫలితాలు, ఆదాయ –  వ్యయములు, రాజపూజ్య – అవమానాలు, దోష సమయాలు, అనుకూలించే శుభసమయాలు, స్త్రీలకు ప్రత్యేకించి కలిసివచ్చే అంశాలు, చేసుకోవలసిన శాంతులు, నెలవారీగా ఉండేటువంటి శుభ విశేషాలు సంపూర్ణంగా ఇవ్వబడ్డాయి.

  • ఆదాయం – 5, వ్యయం – 14
  • రాజపూజ్యం – 6, అవమానం – 3

ఎవరెవరు తులా రాశి లోకి వస్తారు?

సాధారణంగా కింది నక్షత్రాలలో జన్మించిన వారు లేదా, కింది అక్షరాలను వారి పేర్లలో మొదటి అక్షరం గా కలిగిన వారు తులారాశి లోకి వస్తారు.

  • చిత్త 3, 4 పాదాలు (ర,రి)
  • స్వాతి 1, 2, 3, 4 పాదాలు (రు, రె, రో,త)
  • విశాఖ 1, 2, 3 పాదాలు (తి, తు, తే)

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది తులారాశి ఫలాలు [Tula Rasi Phalalu 2026-27] ఈ కింది విధంగా ఉన్నాయి.

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులా రాశి ఫలాలు 2026-27

  • ఈ రాశివారికి గురుడు 2026 జూన్ 1 వరకు భాగ్యస్థానమందు రజితమూర్తిగా సౌభాగ్యకరమగు ఫలితములను, తదుపరి జూన్ 2 నుండి దశమ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్య ఫలితములనిచ్చును. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ వరకు పంచమ, ఏకాదశ స్థానములందు లోహమూర్తులుగా సామాన్య ఫలితములను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి చతర్ధ దశమ స్థానములందు సువర్ణమూర్తులుగానూ విశేషమగు శుభ ఫలితములను ఇచ్చెదరు.
  • రాజ్యస్థాన గురు సంచారం వలన వీరు సాంఘికంగా గుర్తింపు, ప్రజా గౌరవము పొందుతారు. వృత్తి విషయాలలో భావోద్వేగము ఉద్యోగస్తులకు వేతన విషయాలలో అసమతుల్యతలు. వృత్తి అవకాశాలు, చేసేపనిలో నాణ్యత వలన గుర్తింపు, ఆర్ధికవృద్ధి. దశమ స్థాన సంచారం వలన కెరీర్. వృత్తి విషయాలలో ముందంజ, కీర్తి, రాజకీయపరమైన జీవితంలో ఆందోళనలు. కోర్టులు, లిటిగేన న్యాయపరమైన అంశాలలో విజయం. విద్యార్థులు జ్ఞాన సముపార్జన చేస్తారు. వక్తృత్వపు పోటీలలో విజయం, కీర్తిని ఇనుమడిం జేస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. సామాజికంగా, కెరీర్ పరంగా పురోగతి. కోర్టు అధికారులకు, న్యాయవాద వృత్తి వారికి అభివృద్ధి.
  • శనైశ్చరుని షష్టరాశి సంచారం అత్యంత అనుకూలము. శుభకార్య నిర్వహణ, భూ, గృహ, స్థిరాస్తులు వృద్ధియగుట, ధనధాన్యముల లాభములు, వృత్తి వ్యాపారాలు, ఉద్యోగ విషయాలలో క్రమశిక్షణతో ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. నిర్ధారించుకున్న లక్ష్యాలను సాధిస్తారు. రోజువారీ బాధ్యతలను ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత అభివృద్ధికి అవకాశాలుగా మారుస్తుంది. వృత్తి విషయంలో మంచి అవకాశాలు, విదేశాల నుండి అధిక ధన లాభాలు. రుణాల చెల్లింపుకు అనుకూల సమయము. బ్యాంకు అప్పులు క్రమేపీ తొలగును. వ్యాధి నిర్మూలన కలుగుతుంది. కిరాణా, కూరగాయల వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయి. నిర్మాణరంగం చేసేవారు వృత్తిపరంగా సమస్యలను అధిగమిస్తారు. ఇనుము, స్టీలు, కలప, గ్రానైట్ రాయి వ్యాపారులకు ఆశించిన ఫలితములు కల్గును. మే, జూన్, జూలై నెలలో ప్రయాణములను తగ్గించుకోవాలి. శాంతము వహించాలి.
  • రాహుకేతువులు అనుకూల ఫలితాలను ఇస్తారు. ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుని సంతానం సృజనాత్మకంగా రాణిస్తారు. నూతన పరిశోధనల వలన గుర్తింపు పొందుతారు. అనేక రకాలుగా కృషి అధ్యయనం చేసి కొత్తవిషయాలను కనిపెడతారు. సంతానం సామాజిక నెట్వర్క్లీకు దూరంగా ఉండి విద్యా విషయాలలో నిరంతరం కృషి చేస్తారు. ధాన్యం మిల్లులు, ధాన్యం కమీషన్ వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలుంటాయి. మిర్చి, మిరియాలు, మసాలా, అపరాల వ్యాపారులకు కలసివస్తుంది. డిసెంబర్ నెలాఖరు నాటికి వృత్తి వ్యాపారాలలో మార్పు కలుగవచ్చు. కలప వ్యాపారులకు అధికంగా లాభాలు.
  • తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6.
  • బుధ, శుక్ర, శనివారములు కలసిన మరింత మంచి జరుగును.
  • దుర్గా, సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట, నిత్యము శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతము వినుట, పఠించుట వలన కలిదోషములు తొలగును.
Muhurth Fixing | Free Astrology

Astrology Consultation

Price range: ₹1,000.00 through ₹2,500.00

Download Horoscope

Download Horoscope

Price range: ₹500.00 through ₹1,000.00