ధన త్రయోదశి పూజ – ప్రాశస్త్యం

  1. Home
  2. chevron_right
  3. Devotional Facts
  4. chevron_right
  5. ధన త్రయోదశి పూజ – ప్రాశస్త్యం

ధన త్రయోదశి పూజ – ప్రాశస్త్యం

ధన త్రయోదశికి పౌరాణిక ప్రశస్తి ఎంతో ఉంది. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరమధనం చేయు సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతే కాదు. సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజే ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఎంత చదువు చదివినా.,, ఎన్ని తెలివితేటలు ఉన్నా., జీవితం శూన్యం. అందుకే.. సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీమహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, ఆమె ఆశీసులు అందుకుంటారు. శ్రీమహాలక్ష్మి .., ధనానికి ప్రతిరూపం. అందుకే., ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని..’ధన త్రయోదశి‘ అన్నారు.

dhanteras-significance

ధన త్రయోదశికి పౌరాణిక ప్రశస్తి ఎంతో ఉంది. వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించి, భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో ఆక్రమించిన రోజు గా ఈ ధన త్రయోదశిగా చెబుతారు. అంతేకాదు లక్ష్మీదేవిని నరకాసురుని చెరనుంచి విముక్తి చేసి, శ్రీ మహావిష్ణువు ఆమెను ధనాధిష్ఠాన దేవతగా ప్రకటించి, ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజే.

ధనానికి అధిదేవత ‘శ్రీమహాలక్ష్మి‘.
ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన ‘కుబేరుడు‘.

అందుకే., ఈ ధనత్రయోదశి నాడు శ్రీమహాలక్ష్మితో పాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు. సాధారణంగా., ఈ లక్ష్మీ పూజను., సాయం సమయంలో ప్రదోష వేళలో వృషభ లగ్నంలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిముషాలు ఈ ప్రదోషకాలం ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో వృషభలగ్నం రాత్రి సుమారు 5:30 గంటల నుంచి 8 గంటల వరకూ ఉంటుంది. . కనుక ఈ సమయంలో శ్రీమహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాలలో శ్రీమహాలక్ష్మి, కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు.

గమనిక: మీ కోరిక మేరకు లక్ష్మికుభేర / శ్రీ మహాలక్ష్మి పూజను చేయించుట కొరకు మా పండితులు  సిద్ధంగా ఉన్నారు.

Lakshmi pooja
Maha Lakshmi Pooja

Lakshmi Kubera Homam
Lakshmi Kubera Havan

దీపావళి పండుగ ప్రాశస్త్యం | Importance of Diwali festival and Lakshmi Puja
శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అమ్మవారి పూజా విధానము

Related Posts