ధర్మశాస్త్రంలో స్త్రీలు చేయకూడని పనుల జాబితా

ధర్మశాస్త్రంలో స్త్రీలు చేయకూడని పనుల జాబితా

Loading

ధర్మశాస్త్రంలో స్త్రీలు చేయకూడని పనుల జాబితా

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

what things married women should not do

  1. సుమంగళి స్త్రీలు నుదుటిన కుంకుమ లేకుండా ఎప్పుడూ ఉండకూడదు.
  2. జుట్టు విరబోసుకొని, రెండు చేతులతో తల గీరుకోరాదు.
  3. ఎప్పుడూ కంట నీరు పెట్టుకోరాదు. ఇది పుట్టింటికి, మెట్టినింటికి దారిద్ర్యమును తెచ్చిపెట్టును.
  4. ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరియొక ఆకులో వడ్డించ కూడదు.
  5. గర్భిణి స్త్రీలు కొబ్బరికాయ పగులకొట్ట రాదు.
  6. గర్భిణి నిమ్మకాయను కోసి దీపము వెలిగించ కూడదు
  7. స్త్రీలు ఎప్పుడూ నేరుగా గుమ్మడికాయను కొట్టకూడదు, ఇది గర్భ శోకాన్ని ఇచ్చును.
  8. ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించవలెను.
  9. ఉదయాన్నే లేచి, పనిమనిషి ఉన్నపటికినీ తాను స్వయంగా ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం వలన లక్ష్మి కటాక్షము కలుగును.
  10. చేతితో ఎప్పుడు అన్నం, ఉప్పు, కూరలు వంటి పదార్ధాలు వడ్డించకూడదు
  11. ఏ వస్తువు అయిన ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనాలి. నాస్తి నాస్తి(లేదు లేదు) అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్వినిదేవతలు మరియు తథాస్తు దేవతలు కూడా పలుకుదురు.

సేకరణ: https://www.panditforpooja.com/blog/what-things-married-women-should-not-do/

dharma sandehalu, hindu tradition, sumangali, అయిదోతనము
సముద్రపు నీరు ఉప్పగా ఎందుకు ఉంటుందో తెలుసా???
పూజలో కొబ్బరికాయకు పసుపు కుంకుమ రాయడం అవసరమా???

Related Posts