యాగశాల నిర్మాణం | యాగశాల మరియు దేవతా ప్రతిష్ట సామాగ్రి

యాగశాల నిర్మాణం | యాగశాల మరియు దేవతా ప్రతిష్ట సామాగ్రి

Loading

sarvatobhadra mandal yantra

యాగశాల నిర్మాణం | యాగశాల మరియు దేవతా ప్రతిష్ట సామాగ్రి

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఉత్తరాయణ పుణ్యకాలం దేవాలయ ప్రతిష్టలకు, యజ్ఞయాగాది క్రతువులను చేయుటకు చాలా ఉత్తమమైన సమయం. అయితే ఈ కార్యక్రమములను ఆచరించి క్రతువుని పూర్తి చేయడానికి యాగశాల నిర్మాణం  తప్పనిసరి. అసలు యాగశాల నిర్మాణం ఏ విధంగా చేయాలి? దేవతా ప్రతిష్టకు కావలసిన సామాగ్రి ఏమిటి? అనే ప్రశ్న చాలామంది ఋత్విక్కులకు (పండితులకు) ఉంటుంది. ఈ పోస్ట్ లో సమగ్రమైన యాగశాలకు కావలసిన సామాగ్రి, ఏ విధంగా నిర్మించాలో వాని కొలతలతో సహా పొందుపరచడమైనది.

yagasala construction

యాగశాల నిర్మాణం :-

యాగశాలని 16 స్థంబాలతో 24 అడుగులలో నిర్మించాలి. నాలుగు ద్వారాలు తప్పకుండా ఉండాలి. ప్రతీ స్థంబానికి 6 అడుగుల దూరం ఉండాలి. అంటే ప్రతీ దిక్కుకి 4 స్థంబాలు అంటే 4X4స్థంబాలు=16స్థంబాలు(మొత్తం) అలాగే ప్రతీ స్థంబానికి 6 అడుగులుX4=24అడుగులు(మొత్తం) ఉండేలా నిర్మించుకోవాలి.

యాగశాల చూరు(పైకప్పు) 6 అడుగుల ఎత్తులో ఉండాలి. 16స్థంబాల కర్రల పొడవు 9అడుగులు, యాగశాల మధ్యలో ఉండే సర్వతోభద్రమండపం 4 చివరల నుంచి 12 అడుగుల ఎత్తైన కర్రలు(స్థంబాలు) 4 యాగశాల పైకప్పు వరకు ఉండాలి.

సర్వతోభద్రమండపం :-

సర్వతోభద్రమండపం యాగశాలకి సరిగ్గా మధ్యలో ఉండాలి. వైశాల్యం 4X4 లేక 5X5 గా ఏర్పాటు చేసుకోవాలి. ఎత్తు 3అడుగులు ఉండాలి. సర్వతోభద్రమండపం నమూనాను కింది చిత్రంలో గమనించగలరు.

sarvatobhadra mandal yantra

యాగశాలా మండపాలు :-

4 మండపాలని నాలుగు మూలలో ఏర్పాటు చేయాలి. మండపాల ఎత్తు 2అడుగులు వైశాల్యం 2X2గా ఉండాలి. యాగశాల ప్రాకారానికి ఒక అడుగు దూరంలో మండపాలు ఉండాలి. ఒకవేళ యాగశాల ప్రాకారానికి దడికానీ ఉంటే మండపాలన్నీ దడికి రెండున్నర అడుగుల దూరంలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.

యాగశాలకి ఈశాన్యంలో నవగ్రహ మండపం, ఆగ్నేయంలో యోగినీ మండపం, నైరుతిలో వాస్తు మండపం, వాయవ్యంలో క్షేత్రపాలక మండపం ఉండాలి.

యాగశాలా హోమగుండాలు :-

యాగశాలకి మూడు దిక్కులలో హోమగుండాలు ఏర్పాటు చేయాలి. ఉత్తర దిక్కుని ఖాళీగా ఉంచాలి.

యాగశాలకి తూర్పున చతురస్ర హోమగుండం, పశ్చిమాన యోగినీ హోమగుండం, దక్షిణాన వృత్తాకార హోమగుండం ఉండాలి. హోమగుండాల లోతు 2అడుగులు ఉండాలి. హోమగుండాల నమూనాను కింది చిత్రాలలో గమనించగలరు.

యోని హోమగుండం :-

yoni havan kundచతురస్ర హోమగుండం :-

chaturasra havan kundవృత్తాకార హోమగుండం :-

vruttakara havan kund

గమనిక :-

యాగము లేదా ప్రతిష్ట పూర్తి అయ్యేవరకూ ఒక చాకలి వ్యక్తి కాగడాను వెలిగించి అది ఆరిపోకుండా చివరి వరకూ చూసుకోవాలి. అదేవిధంగా ఒక మంగలి వ్యక్తి సాంబ్రాణి దూపమును వేస్తూనే ఉండాలి.

ముఖ్య సామాగ్రి :-

పసుపు,కుంకుమ,తమలపాకులు,

పోకచెక్కలు(వక్కలు),అగరవత్తులు,

హారతికర్పూరం,అరటిపండ్లు,కొబ్బరిబొండాలు,

కొబ్బరికాయలు,గంధము, విభూతి, పుష్పాలు, చేతిగంట, మారేడు పత్రీ, తులసి పత్రీ, ( దీపారాధన సామాగ్రి ), దీపపు కుందులు, వత్తులు, అగ్గిపెట్ట, పంచామృతాలు, బియ్యము, బెల్లము, పంచపాత్ర, ఆసనములు, విడి చిల్లెర, పూల దండలు, పూల మాల, ఏకహారతి, పుణ్యాహవాచనం నకు 3 కలశాలు .

మంటపారాధన సామాగ్రి :-

బియ్యము, పెద్ద తువాళ్ళు, పంచలు, కండువాలు, ఎండు ఖర్జురపుకాయలు, ధారపు బంతి, కలశ బిందెలు, చెంబులు, పళ్ళెములు, బంగారు ప్రతిమలు, ధాన్యము, రవికల బట్టలు ( జాకెట్ గుడ్డలు ), చీరలు, పసుపుకొమ్ములు, చిల్లర నాణేములు .

ఋత్విక్కు లకు ఇచ్చే సామాగ్రి :-

పంచెలు, కండువాలు, జప మాలలు, ఆసనములు, పంచపాత్రలు . కలశములో ఉంచు సామాగ్రి :-పంచ పల్లవములు Pancha Pallavalu .(రావి, జువ్వి, మర్రి, మేడి, మామిడి చెట్ల యొక్క చిగురులు, ఆకులు, బెరదులు)

పంచ రత్నములు Pancha Ratnamulu ( ముత్యము, పగడము, కెంపు, పచ్చ, నీలము )

పంచ మృత్తికలు Pancha Mruthikalu ( గోశాల, అశ్వశాల, తులసి, నది, పుట్ట మట్టి .)

నవ ధాన్యములు Nava Dhanyamulu ( గోధుమలు, ధాన్యము, కందులు, పెసలు, శెనగలు, బొబ్బర్లు, నువ్వులు, మినుములు, ఉలవలు )

పంచ గంగలు Pancha Ganaga ( కావేరి, తుంగభద్రా, కృష్ణ, గౌతమీ, గోదావరి గంగ జలాలు ) మరియి సుగంధ ద్రవ్యాలు .

పంచ గవ్య మధుపర్క ప్రాశన ద్రవ్యాలు :-

ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, గోమూత్రము, తేన .

భద్ర మండల సామాగ్రి :-

సున్నము, పురికొస, పాత కాగితములు, బియ్యము, రంగులు ( ఎరుపు, నలుపు, పసుపు, ఆకుపచ్చ )

జాలాధివాసము సామాగ్రి :- విగ్రహము ఉంచు తొట్టిలు, పవిత్ర నది జలాలు .

క్షిరాధివాసము సామాగ్రి :- ఆవుపాలు, విగ్రహము ఉంచు తొట్టిలు .

పుష్పాది వాసము సామాగ్రి :- పూజ అర్హములైన పుష్పములు . పత్రములు .

లక్షణొద్ధరనము సామాగ్రి :- బంగారు కణిక, శిల్పికి బట్టలు, దక్షిణ, తేన మైనం .

ధాన్యాదివాసము సామాగ్రి :- ధాన్యము, చాపలు, దుప్పట్లు .

పంచ శయ్యాధి వాసము సామాగ్రి :-

పట్టు పరుపు, దుప్పటి, దర్భాసనం, చిత్రాసనమ్,ధావళి, పట్టు పంచలు,

పట్టు చీరలు, జాకెట్టు బట్టలు, సైను బట్ట, చాకులు, అద్దములు, పండ్లు 8 రకములు .

స్థాపన ద్రవ్యములు :- యంత్రములు, నవ రత్నములు Nava Ratnamulu ( కెంపు, ముత్యము, పగడము, పచ్చ, నీలము, పుష్యరాగము, వజ్రము, గొమెధికము,వైడూర్యము), పంచ ధాతువులు Pancha Dhatuvulu ( బంగారము, వెండి, రాగి, కంచు, తగరము ) పాదరసము, అష్టభంధనము .

హోమద్రవ్యములు :-

హవిస్సు, బలిహరన, గిన్నెలు, మూతలు, గరిటలు, అరణి, ఎండుకొబ్బరి పీచు, ఆవు నెయ్యి, ఆజ్య పాత్రలు, ప్రోక్షణ పూర్ణ పాత్రలు, స్రుక్కు స్రువములు, దర్భ, వంట చెరకు ( కట్టెలు ), పేలాలు, యవలు, తెల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, బెల్లం, బియ్యపిండి, పెసలు, మినుములు, సమిధలు ( జిల్లేడు, మోదుగ, చండ్ర, ఉత్తరేణి, రావి, మేడి, జమ్మి, దర్భ, గారిక )

పూర్ణాహుతి ద్రవ్యములు :-

పట్టు బట్టలు, కొబ్బరి కురిడీలు, లవంగాలు, జాపత్రి, వట్టి వెళ్ళు, గంధపు చెక్క,

యాలకులు, జాజి కాయ, పచ్చ కర్పూరం, ముత్యం పగడం బంగారం .

వికిర ద్రవ్యములు :-

పేలాలు, తెల్ల ఆవాలు, భస్మం, గంధము, అక్షతలు, గారిక, దర్భ అగ్రములు .

కళాన్యాస ద్రవ్యములు :- దుప్పట్లు, కుమ్భమునకు అన్నము, దీపము, కర్పూరము, గుమ్మడికాయ, కొబ్బరి కాయలు, అద్దము, ఆవు, దూడ, నూతన వస్త్రములు ( విగ్రహములకు ) అలంకర సామాగ్రి .

కళ్యాణ సామాగ్రి :- యజ్ఞోపవీతం, మంగళ సూత్రములు, మేట్టలు, పళ్ళెము, చెంబు, గుమ్మడి పండు, గంధపు చెక్క, కొబ్బరి బొండం, పూల దండలు .

మట్టి సామాగ్రి :- పుట్ట మట్టి, మట్టి ముకుళ్ళు, ముంతలు, ప్రమిదలు, పెద్ద కుండ,

ఇతర అవసర సామాగ్రి :- పీటలు, విసనికర్ర, సర్ఫు, తల నునె, భజంత్రీలు, వగెర …

యాగశాల సామాగ్రి : –

మామిడి తోరణాలు, పతాకము లకు రంగు రంగు జండాలు, మినప్పప్పు కలిపినా ధద్యొజనమ్, పాల అన్నము .

దేవాలయ నిత్య అవసర సామాగ్రి : –

నైవేద్య పాత్రలు, కిరానా సామాగ్రి, పూజ పాత్రలు, దేవతలకి వస్త్రాలు,

అలంకరణ సామాగ్రి, దీపపు కుందులు, జై ఘంట, చేతి ఘంట, వివిధ హారతులు, పాదుకలు, పంచ పాత్ర, తీర్ధపు గిన్నె, హుండీలు, పల్లకి, వాహనములు, ఛత్రం , చామరము, సింహాసనములు, వగైరా …

గమనిక :-

పురోహితులకు, దేవస్థానాలకు వారి వారి అవసరాలకు అనుగుణంగా వస్తు సామాగ్రి పరిమాణం, సంఖ్య కలుపుకొవలిసిన్దిగా ప్రార్ధన

సేకరణ: https://www.panditforpooja.com/blog/yagasala-construction/

yagasala construction, దేవతా ప్రతిష్ట, యాగశాల, యాగశాల నిర్మాణం
క్రియా యోగం | విధానం – ఫలితాలు | Benefits of Kriya Yoga
రేపు పాదాధిక గ్రాస్త సూర్యగ్రహణం

Related Posts

No results found.