Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

యమునా పుష్కరాలు
యమునా నది ఉత్తర భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన నదుల్లో ఒకటి కాగా, గంగానదికి అతిపెద్ద ఉపనదిగా ప్రసిద్ధి చెందింది. ఇది గంగానదికి ఎడమవైపు ప్రవహించే ఉపనదులలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని కాళింద పర్వత ప్రాంతంలో ఉన్న యమునోత్రి ఈ నదికి ఆవిర్భావ స్థలంగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడిని కంసుని నుండి రక్షించేందుకు వాసుదేవుడు యమునా నదిని దాటుతున్నప్పుడు, నది రెండు భాగాలుగా చీలి ఆయనకు మార్గం కల్పించిందని చెబుతారు.
బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించే పవిత్ర సమయంలో యమునా పుష్కరాలు సంభవిస్తాయి. 2026 లో యమునా నది పుష్కరాలు జూన్ 2 నుండి జూన్ 13, 2026 వరకు 12 రోజుల పాటు జరుగుతాయి.
పుష్కర స్నానం
పుష్కర కాలంలో పవిత్ర నదుల్లో ఎక్కడ స్నానం చేసినా, పూర్వ జన్మలలో మనస్సు, వాక్కు, శరీరం ద్వారా చేసిన పాపాలు నశించి, మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ఈ పవిత్ర సమయంలో అనేక పుణ్యకార్యాలు ఆచరించాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి.ప్రత్యేకంగా పుష్కర సమయంలో భక్తులు స్నానం, దానం, జపం, అర్చన, ధ్యానం, హోమాలు, తర్పణాలు మరియు పితృ పిండ ప్రదానాలు నిర్వహించాలని మహర్షులు ఉపదేశించారు. ఈ పుణ్యకాలంలో చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యానికి విశేష ఫలితం లభిస్తుందని విశ్వాసం. అన్ని పుణ్యకార్యాలలో అత్యంత ప్రధానమైనది మరియు మహత్తరమైనది పుష్కర స్నానం. పుష్కర సమయంలో పవిత్ర నదిలో భక్తిశ్రద్ధలతో స్నానం చేయడం ద్వారా దైవ అనుగ్రహం, పితృ ఆశీర్వాదం మరియు ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి.
యమునా నది పుష్కర స్నానం సంకల్పం
ఈ సంవత్సరం జరగబోయే యమునా నది పుష్కరాల సందర్భంలో, నర్మదా నదిలో స్నానం చేసేటప్పుడు, పిండప్రధానం, పితృ తర్పణం లేదా దానం చేసేపప్పుడు సంకల్పాన్ని ఏ విధంగా పఠించాలి అలాగే నర్మదా నది పుష్కర స్నాన సంకల్పము వివరాలను కింద ఇవ్వడం జరిగినది.
Related
Download యమునా నది పుష్కర స్నాన సంకల్పం – యమునా పుష్కరములు 2026
Pushkara Snanam, Pushkaram 2026 Guide, Yamuna Pushkar Snanam, Yamuna Pushkaralu 2026, Yamuna River Festival, Yamuna River Pushkara Snana Sankalpam, Yamuna Sankalpam

When to Perform Varalakshmi Vratam in 2026? August 21 or August 28?

యమునా నది పుష్కరాలు సమయంలో చేయవలసిన దానాలు ఏమిటి?
Related Posts
Comments
Related Posts
Recent Posts
- When to Perform Varalakshmi Vratam in 2026? August 21 or August 28?
- యమునా నది పుష్కర స్నాన సంకల్పం – యమునా పుష్కరములు 2026
- యమునా నది పుష్కరాలు సమయంలో చేయవలసిన దానాలు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కర స్నానానికి ముఖ్యమైన పుష్కర స్నాన ఘాట్లు ఏమిటి?
- 2026 యమునా నది పుష్కరం తేదీలు ఏమిటి?
- 2026 లో యమునా నది పుష్కరాలు ఎప్పుడు?
- శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ – హనుమాన్ వ్రత విధానం






