నమస్కారం, ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు (Ugadi Telugu Panchangam 2025-2026).
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 30వ తేదీ మార్చి 2025 లగాయత్తు ప్రారంభం. 2025 – 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మన అందరికి అనుకూల ఫలితాలను ఇస్తూ, అనుకున్న కోర్కెలు సిద్ధించి సత్ఫలితాలను కలగచేయాలని ఆ మల్లినాదుడిని ప్రార్ధిస్తూ Poojalu.com కు స్వాగతం.
ఉగాది రాశి ఫలాలు 2025-2026
[Sri Viswavasu Free Telugu Rasi Phalalu]

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మేష రాశి ఫలితాలు
Mesha Rasi Phalalu Ugadi 2025 – 2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు
Vrushabha Rasi Phalalu Ugadi 2025 – 2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సర మిధున రాశి ఫలితాలు
Midhuna Rasi Phalalu Ugadi 2025 – 2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు
karkataka Rasi Phalalu Ugadi 2025 – 2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సింహ రాశి ఫలితాలు
Simha Rasi Phalalu Ugadi 2025 – 2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది కన్య రాశి ఫలితాలు
Kanya Rasi Phalalu Ugadi 2025 – 2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది తుల రాశి ఫలితాలు
Tula Rasi Phalalu Ugadi 2025 – 2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వృశ్చిక రాశి ఫలితాలు
Vruschika Rasi Phalalu Ugadi 2025 – 2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ధనుస్సు రాశి ఫలితాలు
Dhanu Rasi Phalalu Ugadi 2025 – 2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మకర రాశి ఫలితాలు
Makara Rasi Phalalu Ugadi 2025 – 2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది కుంభ రాశి ఫలితాలు
Kumbha Rasi Phalalu Ugadi 2025 – 2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది మీన రాశి ఫలితాలు
Meena Rasi Phalalu Ugadi 2025 – 2026
చైత్రమాసే జగద్బ్రహ్మా ససర్జ ప్రథమే అహని
శుక్ల పక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి !
ప్రవర్తయామాస తథా కాలస్య గాననామపి
గ్రహన్వారా నృనాత్మూసాన్వత్సరాదిపాన్ !!
బ్రహ్మ దేవుడు తన సృష్టిని బ్రహ్మకల్పం ఆరంభమయ్యే మొదటి సంవత్సరమైన ప్రభవలో, మొదటిమాసమైన చైత్రమాసంలో, ఋతువులలో మొదటి ఋతువైన వసంత ఋతువులో, మొదటి తిథి అయిన పాడ్యమి రోజు, మొదటి వారం అయిన ఆదివారం, మొదటి నక్షత్రం అయిన అశ్విని నక్షత్రంలో ప్రభావిమ్పజేశాడు. అదే యుగానికి ఆది ……… ఉగాది
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పంచాంగం 2025 – 2026
Sri Viswavasu Nama Samvatsaram Telugu Panchangam
ఈ సంవత్సరము రాజు, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి రవి. మంత్రి చంద్రుడు, పూర్వ సస్యాధిపతి గురుడు, అపర సస్యాధిపతి (ధాన్యాధిపతి) కుజుడు, రసాధిపతి శని మరియు నీరసాధిపతి బుధుడు రాజాధి నవ నాయకులలో 6గురు పాపులు ముగ్గురు శుభులు. పగటి కాలమందు సూర్యుడు ఆర్ద్ర నక్షత్ర ప్రవేశంచే ధాన్యాదులకు ధరలు పెరుగును. సస్యములకు అవసరమయ్యే వృష్టి కలుగును. పశుపాలకాధిపత్యము యమునికి వచ్చుటచే పాడిపంటలపై శ్రద్ధ తక్కువ. రెండు తూముల వర్షము 9 భాగములు పర్వతములపైనా, 9 భాగములు సముద్రములయందు, 2 భాగములు భూమిపైనా వర్షము కురియును. ఎర్రని భూములు విశేషముగా రాణించుము. మొత్తము 16 వీసముల పంటకు 8 వీసముల పంట చేతికి అందును. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాటికి తొలకరి వర్షములు కురియును.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆదాయ-వ్యయాలు & రాజ్యపూజ్య-అవమానాలు
మేష రాశి
- ఆదాయం – 2, వ్యయం – 14 & రాజపూజ్యం – 05, అవమానం – 07
- నక్షత్రాలు: అశ్వని నాలుగు పాదాలు, భరణి నాలుగు పాదాలు, కృత్తిక 1 పాదం.
వృషభ రాశి
- ఆదాయం – 11, వ్యయం – 05& రాజపూజ్యం – 01, అవమానం – 03
- నక్షత్రాలు- పాదాలు: కృత్తిక 2, 3, 4, పాదాలు, రోహిణి నాలుగు పాదాలు, మృగశిర 1, 2 పాదాలు.
మిథున రాశి
- ఆదాయం – 14, వ్యయం – 02 & రాజపూజ్యం – 04, అవమానం – 03
- నక్షత్రాలు- పాదాలు: మృగశిర 3, 4, పాదాలు, ఆరుద్ర నాలుగు పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు.
కర్కాటక రాశి
- ఆదాయం – 08 , వ్యయం – 02 & రాజపూజ్యం – 07, అవమానం – 03
- నక్షత్రాలు- పాదాలు: పునర్వసు 4వ పాదం, పుష్యమి నాలుగు పాదాలు, ఆశ్లేష నాలుగు పాదాలు.
సింహ రాశి
- ఆదాయం – 11, వ్యయం – 11& రాజపూజ్యం – 03, అవమానం – 06
- నక్షత్రాలు- పాదాలు: మఖ నాలుగు పాదాలు, పుబ్బ నాలుగు పాదాలు, ఉత్తర ఒక పాదం.
కన్య రాశి
- ఆదాయం – 14, వ్యయం – 02 & రాజపూజ్యం – 06, అవమానం – 06
- నక్షత్రాలు- పాదాలు: ఉత్తర 2, 3 , 4 పాదాలు, హస్త నాలుగు పాదాలు, చిత్త 1,2 పాదాలు.
తుల రాశి
- ఆదాయం – 11, వ్యయం – 05& రాజపూజ్యం – 02, అవమానం – 02
- నక్షత్రాలు- పాదాలు: చిత్త 3,4 పాదాలు, స్వాతి పాదాలు నాలుగు పాదాలు, విశాఖ 3 పాదాలు.
వృశ్చిక రాశి
- ఆదాయం – 02, వ్యయం – 14 & రాజపూజ్యం – 05, అవమానం – 02
- నక్షత్రాలు- పాదాలు: విశాఖ 4 పాదం, అనూరాధ నాలుగు పాదాలు, జ్యేష్ఠ నాలుగు పాదాలు.
ధనుస్సు రాశి
- ఆదాయం – 05, వ్యయం – 05 & రాజపూజ్యం – 01, అవమానం – 05
- నక్షత్రాలు- పాదాలు: మూల నాలుగు పాదాలు, పూర్వాషాడ నాలుగు పాదాలు, ఉత్తరాషాడ 1 పాదం.
మకర రాశి
- ఆదాయం – 8, వ్యయం – 14 & రాజపూజ్యం – 04, అవమానం –05 నక్షత్రాలు- పాదాలు: ఉత్తరాషాడ 2, 3, 5 పాదాలు, శ్రవణ నాలుగు పాదాలు, ధనిష్ఠ 1, 2 పాదం.
కుంభ రాశి
- ఆదాయం – 08, వ్యయం – 14 & రాజపూజ్యం – 07, అవమానం–05
- నక్షత్రాలు- పాదాలు: ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిష నాలుగు పాదాలు, పూర్వాషాడ 1, 2, 3పాదాలు.
మీన రాశి
- ఆదాయం – 05, వ్యయం – 05 & రాజపూజ్యం – 03, అవమానం – 01
- నక్షత్రాలు- పాదాలు: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు, రేవతి నాలుగు పాదాలు.
ఈ సంవత్సరము రాజు, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి రవి. మంత్రి చంద్రుడు, పూర్వ సస్యాధిపతి గురుడు, అపర సస్యాధిపతి (ధాన్యాధిపతి) కుజుడు, రసాధిపతి శని మరియు నీరసాధిపతి బుధుడు రాజాధి నవ నాయకులలో 6గురు పాపులు ముగ్గురు శుభులు. పగటి కాలమందు సూర్యుడు ఆర్రా నక్షత్ర ప్రవేశంచే ధాన్యాదులకు ధరలు పెరుగును. సస్యములకు అవసరమయ్యే వృష్టి కలుగును. పశుపాలకాధిపత్యము యమునికి వచ్చుటచే పాడిపంటలపై శ్రద్ధ తక్కువ. రెండు తూముల వర్షము 9 భాగములు పర్వతములపైనా, 9 భాగములు సముద్రములయందు, 2 భాగములు భూమిపైనా వర్షము కురియును. ఎర్రని భూములు విశేషముగా రాణించుము. మొత్తము 16 వీసముల పంటకు 8 వీసముల పంట చేతికి అందును. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాటికి తొలకరి వర్షములు కురియును,
- 10-06-2025 జ్యేష్ఠ పూర్ణిమా మంగళవారం రాత్రి గం.2.37ని.లకు పశ్చాదస్తమిత గురుమౌఢ్యారంభం
- 8-7-2025 ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారం పగలు గం.3.18ని.లకు ప్రాగుదిత గురు మౌఢ్యత్యాగము.
- 30-11-2025 మార్గశిర శుద్ధ దశమి ఆదివారం ప.గం.1.58ని.లకు ప్రాగస్తమిత శుక్రమౌఢ్యారంభము.
- 13-02-2026 మాఘ బ.ఏకాదశి శుక్రవారం ఉదయం గం.11.370.లకు పశ్చాదుదిత శుక్రమౌఢ్య త్యాగము.
- ది.04-05-2025 వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారం సా.గం.6.44వి.లకు డొల్లు కర్తరి ప్రా.
- ది.11-05-2025 వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం సా.గం.5.31వి.లకు విజకర్తరీ కృత్తికకార్తె ప్రా,
- ది 28-05-2025 జ్యేష్ఠ శుద్ధ విదియా బుధవారం రాత్రి గం.1.28ని.లకు విజకర్తరి త్యాగం.
విశ్వావసు సంవత్సరంలో మన దేశంలో గోచరమగు సూర్యగ్రహణములు లేవు.
మొదటి చంద్ర గ్రహణము 07-09-2025 ఆదివారం రాత్రి
07-09-2025 భాద్రపద పూర్ణిమా ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించును. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. కుంభరాశిలో శతభిషం మరియు పూర్వాభాద్ర నక్షత్రాలలో ఇది సంభవించును. కావున కుంభరాశివారు దీనిని వీక్షించగూడదు. మరుసటి రోజు యధావిధి చంద్రగ్రహణ శాంతి జరుపుకొనవలెను.
- గ్రహణ స్పర్శకాలం రాత్రి గం.9.50ని.లు
- ఉన్మీలన కాలం రాత్రి గం.10.580.లు
- గ్రహణ మధ్యకాలం రాత్రి గం.11.410.లు
- విమీలన కాలం రాత్రి గం.12.240.లు
- సంపూర్ణ చంద్ర గ్రహణం
- గ్రహణ మోక్షకాలం రాత్రి గం.1.31ని.లు, ఆద్యంత పుణ్యకాలం గం. 3.410.లు
రెండవ చంద్రగ్రహణము 3-3-2026 మంగళవారం
సాయంత్రం పాక్షికంగా అతి సూక్ష్మంగా కనబడు చంద్రగ్రహణం
ది.3-3-2026 ఫాల్గుణ పూర్ణిమా మంగళవారం పాక్షిక చంద్రగ్రహణం సంభవించును. ఇది కేతుగ్రస్తము. గ్రస్తోదయ చంద్రగ్రహణము. ఇది సంపూర్ణ గ్రహణమైవమా సాయంత్రము గం.6.20 ని.లకు చంద్రోదయమైన తర్వాత 27 నిముషములు మాత్రమే కన్పించు అవకాశము కలదు. మధ్యాహ్నం గం.3.20ని.లకు గ్రహణ స్పర్శ కల్గును, తదుపరి సాయంత్రం గం.4.30ని.లకు సంపూర్ణ గ్రహణము ప్రారంభమై సా.గం.5.32వి.లకు సంపూర్ణ గ్రహణం పూర్తి అగును. (అయితే ఇది కన్పించదు.) చంద్రుడు క్షితిజముపైకి వచ్చుసరికి పాక్షిక గ్రహణం విడుపు మాత్రమే కన్పించును. పుబ్బ నక్షత్రములో ఈ గ్రహణము సంభవించును. కావున సింహరాశి వారు మరుసటి రోజు యధావిధిగా చంద్రగ్రహణ శాంతి జరుపుకొనవలెను. గ్రహణ స్పర్శ కనబడదు. ఈశాన్య దిక్కులో మోక్షం కన్పించును. స్వల్పగ్రహణం.
- గ్రహణ స్పర్వకాలం ప.గం.3.20 (కనిపించదు)
- మధ్యకాలం సా.గం.5.03ని.లు
- చంద్రోదయం సా.గం.6.090.లు
- గ్రహణ మోక్షకాలం సా.గం.6.470.లు
సరస్వతినది పుష్కరములు (ది.15-05-2025 నుండి 26-05-2025 వరకు)
ది.14-05-2025 వైశాఖ శుద్ధ విదియా బుధవారం రాత్రి గం.10.35ని.లకు దేవగురుడు బృహస్పతి మిథునరాశిలో ప్రవేశం. ఈ ప్రవేశసమయము రాత్రి కావడం వలన సరస్వతినది పుష్కరములు. మరుసటిరోజు తెల్లవారుజామునుండి అనగా ది.15-05-2025 గురువారం సూర్యోదయాత్ పూర్వం నుండి సరస్వతి నదికి పుష్కరములు ఆరంభమవుతాయి. ది. 15-05-2025 నుండి 26-05-2025 వరకు పరస్వతి నదికి పుష్కరములు. ఈ పండ్రెండు రోజులలో సరస్వతి నదిలో సంకల్ప పూర్వకంగా స్నానమాచరించి, జప దాన తర్పణ పిండ ప్రదానాదులు చేయుట వలన పితృదేవతలు సంతృప్తి చెంది వంశ వృద్ధి కలుగజేయుదురని తెలియుచున్నది. జ్ఞానానికి ప్రతీక అయిన దేవతానది సరస్వతి నది వర్ణవ మొట్టమొదటగా ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఇది అంతర్వాహిని. ఋగ్వేద సరస్వతి సమృద్ధి మరియు జ్ఞానశక్తిని ప్రసరించే దేవతా నది అని అందరూ విశ్వసిస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భీంపూర్లో ఉన్న నది సరస్వతి నది. హరిద్వార్ నుండి భీంపూర్ వెళ్ళాలి.
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర పుష్య బహుళ ఏకాదశి తత్కాల ద్వాదశీ అనగా ది.14-01-2026 తేదీ బుధవారం రాత్రి గం.9.21 ని॥లకు అమారాధ నక్షత్రం, వృద్ధి యోగం, కౌలువ కరణంలో రవి మకరరాశి ప్రవేశం.
అస్య పురుషస్య లక్షణం – ఫలం అస్య పురుషస్య లక్షణం | పాత్ర రాగి పాత్రయందు భోజనం నాశం ఆహారం భిక్షాహారం విప్రులకు హాని – ఫలం
వామము మందాకినీ రాజులకు సుఖం స్నానం కుంకుమ స్నానం శుభం అక్షతధారణ చణకాక్షత ధారణ శెవగల
పంట నాశం
వస్త్రధారణ హరిత వస్త్రధారణ శుభం యుద్ధం
లేపనం మృత్తిక లేపనం గోరోచనం శుభం పుష్పధారణ వకుళ పుష్పం శుభం భూషణ ధారణ వెండి అధిక ధరలు ఆభరణము ముక్తాభరణము
ముత్యపు ఆభరణం
ప్రజాక్షయం
ఫలం మామిడి పండు నటులు నాశం | వాహనము వరాహ వాహనం రాజపీడ ఆయుధము అసి కత్తి క్షత్రియ నాశం ఛత్రధారణ పసుపు పచ్చని గొడుగు
శుభప్రదం ధారణం సీతపద్మ ధారణం శుభప్రదం దిగ్యానం ఉత్తరదిగ్యానం తద్దేశారిష్టం అవస్థ విలుచుని ఉండే అవస్థ సువృష్టి చేష్టా లజ్జా చేష్ట ప్రజాసౌఖ్యం వర్షం తిథి ఏకాదశి జనానురాగము.
- రాజు రవి : పాలకులకు పరస్పర విరోధము, అల్పవృష్టి, ప్రజలకు ప్రభువుల వలన శస్త్రముల వలన భయము, అగ్ని బాధలుండును. “స్వల్పం పయోగోషు జనేషు పీడా చోరాగ్ని బాధానిధనం నృపాణాం” పశువులు పాలను తక్కువగా ఇచ్చును. పాల ఉత్పత్తి తక్కువ. పాడిపంటలు తక్కువ ప్రజలకు దుర్మార్గుల వలన ఇబ్బందులు కల్గును. చోరాగ్ని రోగ బాధలుండును. కొన్ని దేశముల యందు అధికార మార్పులు జరుగును. రాజకీయ పరివర్తనము, రాజకీయ కల్లోలములుండును. గోధుమలు, ధాన్యములు, మిర్చి, మిరియాలు, కందులు, వేరుశెనగ, ఇంగువ, కొబ్బరికాయలు, కట్టెలు, కలప, పగడములు, కెంపులు, మాలు వస్త్రములు, మామిడిపండ్లు, వక్కలు, గుర్రములు, ఎర్రని పదార్ధములు, గులాబీరంగు, తెల్లని రంగులకు, విద్యుత్ ఉత్పత్తి సంబంధ వస్తువులకు, ఆవాలు, చర్మములు, రసాయనపు టెరువులు పశువుల ధరలు పెరుగును.
- మంత్రి చంద్రుడు: చంద్రుడు మంత్రి అగుటవలన ప్రజాభ్యుదయము రాజకీయా భ్యుదయము రాజులకు అభివృద్ధి సువృష్టి యుండును. పంటలు బాగుగా ఫలించును. ఆహారధాన్యముల కొరత తీరును. పశువులకు ధరలు పెరుగును. పాడిపంటల సమృద్ధి ఉండును. కిరోసిన్, పెట్రోలు ధరలు తగ్గును. నూనె గింజలు వెన్న, నెయ్యి, పంచదార, వెండి, బంగారం వంటి వస్తువుల ధరలు హెచ్చుగా విలబడి యుండును. ద్విజులు ధర్మ కార్యములు చేయుదురు.
- సేనాధిపతి రవి : రాజులకు అన్యోన్య యుద్ధములు అవగా ప్రపంచ దేశములందు అన్యోన్య యుద్ధములు యుండును. మేఘములు వాయుపూరితములై స్వల్ప వృష్టినిచ్చును. ఏర్రని ధాన్యములు ఎర్రని భూములు బాగుగా ఫలించును.
- అర్ఘాధిపతి రవి : వర్షములు తక్కువ ధరలు హెచ్చు. ప్రజలకు ఆకలి బాధలు యుద్ధ భయము, గూండాల వలన భయము రాజకీయ వడిదుడుకులు ఎర్ర ధాన్యములకు వృద్ధి కల్గును. వెండి, బంగారముల ధరలు హెచ్చుగానే యుండును. వేరుశెవగ కోబ్బరి నూనెలు మిర్చి మిరియాలు వక్కలు ఏర్రని రంగులు మాలు వస్త్రములు ఎర్రని ధాన్యములు గులాబీ రంగులు మొదలగునవి ధరలు హెచ్చును. రాజకీయ పరివర్తన పరిష్టితులుండును.
- మేఘాధిపతి రవి : ఖండ వృష్టి పంటలు తక్కువ ఎర్రని భూములు ఎర్రని ధాన్యము బాగుగా ఫలించును. ప్రజలు భయ భ్రాంతులకు గురి అగుదురు.
- పూర్వ సస్యాధిపతి గురుడు : గురుడు పూర్వ సస్యాధిపతియగుట వలన పచ్చని భూములు పచ్చని ధాన్యములు బాగుగా ఫలించును. యవలు, గోధుమలు శెనగలు పచ్చ జొన్నలు పేపలు ఉలవలు బాగుగా ఫలించును. ప్రత్తి చర్మము వెండి బంగారము వేరుశెనగ పప్పు, తగరం, రబ్బరు బ్యాంకు వ్యాపార వాటాలు వస్త్రముల ధరలు తగ్గును.
- అవర సస్యాధిపతి (ధాన్యాధిపతి)కుజుడు: ముల్లుగల ధాన్యములు, కందులు బొబ్బర్లు, మిర్చి, వేరుశెనగ, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు ఫలించును. “శాలీషు ఘృత తైలాది మహార్షాణి భవన్తీ చ” యనుట వలన మంచి ధాన్యము లకు చెరకు, బెల్లం, పంచదార, నెయ్యి, నూనెగింజలు, నూనెలు వేరుశెనగ, ఆముదము ధరలు పెరుగును. ఆపర ధాన్యములకు మంచి ధరలుండుము,
- రసాధిపతి శని : నువ్వులు, మినుములు, ఉలవలు మొదలగు వల్లని ధాన్యములు వల్లవి భూమియునూ ఫలించును.
- నీరసాధిపతి బుధుడు : చిత్ర వస్త్రములు, అద్దకం వస్త్రములు, శంఖములు, చందనము, సుగంధ ద్రవ్యముల ధరలు కొంత తగ్గి నిలబడియుండును.
పురోహిత, గణక, పరీక్షకాది ఉపనాయక గ్రహములు శుభులు శుభఫలితము లను, పాపులు పాప ఫలితములను ఇచ్చెదరు.
- పురోహితుడు – గురుడు, పశ్వాధిపతి-రవి, మృగాధిపతి గురుడు
- అశ్వాధిపతి – చంద్రుడు, జంగమాధిపతి – కుజుడు, రాష్ట్రాధిపతి-రవి
- రత్నాధిపతి – కుజుడు, గ్రామనాయకుడు – రవి, గ్రామపాలకుడు – బుధుడు
- పరీక్షకుడు – బుధుడు, దేవాధిపతి-గురుడు, శుభాధిపతి-రవి
- గజాధిపతి – గురుడు, సర్పాధిపతి-శుక్రుడు, సర్వదేశోద్యోగి-చంద్రుడు
- వృక్షాధిపతి – కుజుడు, దైవజ్ఞుడు-రవి , వస్త్రాధిపతి-శని,
- గణకుడు-శుక్రుడు, నరాధిపతి-రవి, స్త్రీణామాధిపతి – రవి
అశ్వి | భర | కృ | రో | మృ | ఆర్ద్ర | పు | పుష్య | ఆశ్రే | మఖ | పుబ్బ | ఉత్త | హస్త | చిత్ర |
5 | 0 | 3 | 6 | 1 | 4 | 7 | 2 | 5 | 0 | 3 | 6 | 1 | 4 |
2 | 0 | 1 | 2 | 0 | 1 | 2 | 0 | 1 | 2 | 0 | 1 | 2 | 0 |
3 | 1 | 4 | 2 | 0 | 3 | 1 | 4 | 2 | 0 | 3 | 1 | 4 | 2 |
స్వా | వి | అనూ | జ్యే | మూ | పూషా | ఉషా | శ్రవ | ధని | శత | పూభా | ఉభా | రేవ |
7 | 2 | 5 | 0 | 3 | 6 | 1 | 4 | 7 | 2 | 5 | 0 | 3 |
1 | 2 | 0 | 1 | 2 | 0 | 1 | 2 | 0 | 1 | 2 | 0 | 1 |
0 | 3 | 1 | 4 | 2 | 0 | 3 | 1 | 4 | 2 | 0 | 3 | 1 |
* ఇందలి బేసి సంఖ్యలు ధన లాభమును, సమ సంఖ్యలు సమ ఫలితమును, శూన్య సంఖ్యలు శూన్య ఫలితమును ఇచ్చును. మొదటి సున్న రోగభయము, · మధ్య సున్న మనోభీతిని, చివరి సున్న హానిని తెల్పును. ఒక్కొక్క సంఖ్య 4 మాసము లుండును.
1. రవి :- పనుల తొందర, ఒత్తిడి, ఆలస్యం, తూర్పు ప్రయాణం, దుఃఖం, శిరోవేదన, భయం, రాజభీతి, నిరుత్సాహం, ఆశాభంగం, శ్రమ, కోపం.శాంతి :- రుద్రాభిషేకం, సూర్యస్తుతి.
2. చంద్రుడు :- మాతృసౌఖ్యం, దధ్యన్నసౌఖ్యం, స్త్రీ సంభోగసుఖం, మనో నైర్మల్యం, ఆనందం, గౌరవం, కృషి వ్యాపారాదులు, పెద్దల దర్శనం, సర్వ కళాత్మభావం, లలిత కళల పట్ల కౌశల్యం, సప్త సంతాన పోషణం.
3. గురు :- ధనలాభం, గురు ఆదరణం, జ్ఞానం, సుఖం, భార్యకు ఆభరణ ములు, సంతాన సౌఖ్యం, పడమరకు ప్రయాణం. మంచి వస్త్రధారణం. స్థిర వృద్ధి, శాస్త్ర విజ్ఞానం, ధైర్యం, సర్వశుభం, శివదర్శనం.
4. రాహు :- ఆత్రుత, స్మశాన దర్శనం, దైన్యం, వ్యసనం, కడుపునందు, బొడ్డునందు వ్యాధి, కోపం, ధననష్టం, ప్రయాణంలో దొంగలభయం, గుండెజబ్బు, క్షయ, ఉబ్బసమువంటి దీర్ఘరోగ బాధ.శాంతి :- దుర్గాపూజ, రాహుస్తుతి.
5. బుధ :- బంధుగోష్ఠి, విద్వజ్జన సంగమం, వర్తకజన స్నేహం, వ్యాపారవృద్ధి, భవిష్యత్ ఆలోచనలు, హాస్య సంభాషణ, ధనలాభం, ప్రయత్నసిద్ధి.శాంతి:- విష్ణుభక్తి విష్ణు స్తోత్రములు, పూజలు ఎప్ప
6. శుక్రుడు :- తెల్లనిబట్టలు ధరించుట, పరిమళ ద్రవ్యోపయోగము, స్త్రీ సంభోగ సౌఖ్యం, నూతన పరిచయములు, స్థిరలాభం, మధుర పదార్ధలాభం, ధనలాభం, స్త్రీ లాభం, గోలాభం, సర్వసుఖం, లక్ష్మీ స్తోత్రం.
7. కేతువు :- బంధువైరం, దుష్టస్త్రీ పీడ, మనశ్చాంచల్యం, దైవభక్తి, అతి కోపం, దీర్ఘతర్కం, పుణ్యకర్మలు, స్వల్పాధికారం కలుగుతుంది. పామువల్ల ప్రమాదం. తరచు నష్ట ద్రవ్యలాభం. ప్రాయశ్చిత్తాదివ్రత కర్మాచరణం, క్రతుదీక్షా తత్పరత. శాంతి:- మహారుద్రాభిషేకం, కేతుస్తుతి.
8. శని :- ఏనుగులవలన జంతువులవలన భయం, నల్లని వస్త్ర లాభం, కోపం, పరపీడ, నీచభయం, దుర్వార్తా శ్రవణం, నీచకార్యాచరణము బుద్ధి మాంద్యం, అనవసర ప్రసంగం, విరక్తి, గర్భశూల, గుండెపోటు, శాంతి :-రుద్రాభిషేకం, తైలాభిషేకం, శనిస్తుతి.
9. కుజుడు :- అధికారుల బెడద, ఆయుధముల వలన భయం, కార్యనాశనం, మనస్తాపం, మనఃకాఠిన్యం, దక్షిణ నైఋతి దిశాప్రయాణం, ఔషధ సేవ, ధనమునకు ఇబ్బంది, ఆకారణ విరోధం, రక్తదర్శనం, ఒత్తిడులు, పనులలో ఆటంకం, శాంతి :- శివునకు అభిషేకం, కుజస్తుతి, దుర్గా స్తోత్రం.