సాధారణ సందేహాలు
- ఇది ఎలా పని చేస్తుంది?
మీరు ఇచ్చిన స్టేషన్ వద్దకు ఎంపిక చేసిన తేదీ మరియు సమయముకు పావుగంట ముందుగా భోజనం అనేది స్టేషన్ కి చేరవేయబడుతుంది. ఎవరు భోజనం చేస్తున్నారు వారి కాంటాక్ట్ నెంబర్ మీకు ఇవ్వబడుతుంది - భోజనంలో ఏమేమి ఇస్తారు?
ఒక భోజనంలో.. అన్నం కూర పప్పు పచ్చడి సాంబారు పెరుగు బఫే ఆకు ఇవ్వడం జరుగుతుంది. - ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఎవరిని సంప్రదించాలి?
ఎవరు భోజనం మీకు అందజేస్తారో వారి కాంటాక్ట్ నెంబర్ మీకు ఇవ్వబడుతుంది. వారితో అనుసంధానం అయ్యి మీ భోజనమును పొందవచ్చు. - భోజనమును ఎప్పుడు ఆర్డర్ చేయాలి?
సాధారణంగా మీ ప్రయాణ తేదీ నిర్ధారణ ఆయన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం ఉత్తమం. లేదా ప్రయాణానికి రెండు రోజులు ముందునైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవలెను. - భోజనము నాకు సరైన సమయంలో అందకపోతే పరిస్థితి ఏమిటి?
ఆ సమస్య తలెత్తదు ఎందువలనంటే కచ్చితంగా మీకు భోజనం అందజేసే వారిని మాత్రమే ఏర్పాటు చేస్తాము. ఒకవేళ అలా కాని పక్షంలో ముందుగానే మీకు నిర్ధారణ చేస్తాము. - ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత నాకు వద్దు అంటే ఏమవుతుంది?
మీ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఒకవేళ మీకు భోజనం వద్దు అని అనుకుంటే ప్లేస్ చేసిన రెండు గంటలలో దానిని క్యాన్సిల్ చేయవచ్చు. క్యాన్సిల్ చేయడానికి మా టోల్ ఫ్రీ నెంబర్ కు గాని లేదా వాట్సాప్ నెంబర్ కి గాని కాల్ చేసి తెలుపవచ్చు. ఒకవేళ మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన రెండు గంటల తర్వాత కానీ క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ వచ్చిన యెడల అమౌంట్ తిరిగి ఇవ్వబడదు.
Reviews
There are no reviews yet.