అంతర్జాలం లో అర్చకుల బుకింగ్…

కృష్ణా పుష్కరములకు ఆన్ లైన్ లో పూజారుల బుకింగ్… సాక్షి దినపత్రిక వారి ఆధునికథ అనే article లో Poojalu.com గురించి…

సాంకేతిక పరిజ్ఞ్యానం పుష్కరాలనూ తాకింది. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొనన్ని Websites పురోహితులను, పూజా సామాగ్రిని Online ద్వారా బుక్ చేసుకొనే సదుపాయాన్ని(Online Pandit Booking) కల్పిస్తున్నాయి. భక్తులు వెసులుబాటును బట్టి ఆయా ఘాట్ లలో పూజారులను బుక్ చేసుకోవచ్చును. తేదీలు, పూజలను బట్టి ధర నిర్ణయించుకొని బుక్ చేసుకొనవచ్చును. హైదరాబాద్ కు చెందిన పురోహిత సంఘ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పురోహితులను Online ద్వారా సరఫరా చేస్తున్నారు.

Book a Pandit Online చేసుకొనేయాత్రికులు తమ ఈ-మెయిల్ ద్వారా లాగిన్ అయి పూజ నిర్వహించే తేది, సమయాన్ని ముందుగానమోదు చేసుకోవాలి. ప్రభుత్వ నిభందనలకు అనుగుణంగా పొందుపరచిన వివరాలు, పూజలు, వాటి సామాగ్రి కొనుగోలు చేసి భక్తులకు సమాచారం ఇస్తారు.

ఈ సేవలు Andhrapradesh, Telangana లోని కృష్ణానది పరివాహక ప్రాంతాలలోనే అందుబాటులో ఉంటాయి. అన్ని ఘాట్లు కలిపి తమ నెట్వర్క్ పరిధిలో సుమారు 500 మంది పురోహితులు అందుబాటులో ఉన్నారని హైదరాబాద్ కు చెందిన Poojalu.com వ్యవస్థాపకులు రవికుమార్ శర్మ తెలిపారు. తమ వద్ద ఎప్పటికప్పుడు ఇన్ స్టంట్ గా పురోహితులను బుక్ చేసుకొనే సదుపాయం ఉందని, భక్తులనుంచి సమాచారం వచ్చిన 30 నుంచి 120 నిముషములలో వారి వద్ద ఉంటారని పేర్కొన్నారు.

Published on: http://epaper.sakshi.com/895163/Krishna-District/04-08-2016#page/10/2

This content is Copyrighted, and not allowed to copy!