అక్షయ తృతీయ

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

అక్షయతృతీయ వైశాఖ మాసంలో శుక్షపక్షంలో మూడవ రోజు వస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం. ఈ రోజున సిరి సంపదలను ప్రసాధించే శ్రీ మహాలక్ష్మీ దేవిని అందరూ భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఈ రోజు అక్షయ తృతియ పర్వదినం.

ఈ రోజు అక్షయతృతీయను పసిడిరాసుల పర్వదినంగా భావిస్తారు. చాలా మంది ఈ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అక్షయం అంటే తరిగిపోనిది అని అర్ధం. ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువుతీరుతుందని చాలా మంది విశ్వాసం.

ఈ అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చింది? ఈ పండుగ యొక్క ప్రాధాన్యత ఏంటి…

  1. బంగారం భూలోకంలో మొదటిసారి గండకీనదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ద తదియనాడు ఉద్భవించింది. అందుకే ఈరోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అయితే బంగారంకు పండగ ఏమిటని చాలా మందికి సందేహం రావచ్చు. బంగారం అనేది సాధారణ లోహం కాదు. అది దేవలోహం. బంగారానికి ‘హిరణ్మయి’అనే మరో పేరు కూడా ఉంది.?
  2. ‘హిరణ్య గర్భో భూగర్బో మాధవో మధుసూదన:’ అని విష్ణు సహస్రనామం చెబుతుంది. ‘విష్ణువు’ హిరణ్యగర్భుడు. అంటే ‘గర్భం నుందు బంగారం కలిగిన వాడని’ అర్థం. బంగారం విష్ణువుకు ప్రతి రూపం. అందుకే బంగారం పూజనీయమైనది. దీని జన్మదినమైన అక్షతృతీయ అందరికీ పండుగే మరి!
ఆశీర్వచనం, పూజలో అక్షింతలు ఎందుకు? అక్షింతల వల్ల ఉపయోగం ఉందా
బుధగ్రహ దోష నివారణకు ప్రత్యేక ఉపాయాలు

Related Posts

No results found.

Comments