హనుమాన్ జయంతి – హనుమజ్జయంతి పండుగ పూర్తి వివరాలు

Loading

Details about Hanuman Jayanthi

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

హనుమాన్ జయంతి / హనుమజ్జయంతి పండుగ

హనుమాన్ జయంతి ఈ పండుగను భారతదేశంలోని హనుమంతుని భక్తులందరూ అత్యంత వైభవంగా జరుపుకుంటారు వానర దేవుడైనటువంటి హనుమంతుల వారు ఈనాటి రోజున జన్మించాడని భావించి విశేషంగా హనుమజ్జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటారు అయితే చాలామంది భక్తులు వారు అనుసరించేటువంటి క్యాలెండర్ ప్రకారము వారు ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి హనుమాన్ జయంతి పండుగను వేరు వేరు రోజులలో ఆచరిస్తారు అయితే ఉత్తర భారతంలోని వారందరూ చైత్ర పూర్ణిమను హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు దక్షిణ భారతదేశపు హనుమంతుని భక్తులు వైశాఖ శుద్ధ దశమి రోజున హనుమాన్ జయంతి ఉత్సవాలను చేస్తారు. ఒకవేళ ఈ హనుమాన్ జయంతి మంగళవారం తో కుడి ఉంటే ఇంకా మహా పర్వదినంగా జరుపుకుంటారు.

అసలు హనుమాన్ జయంతిని ఎప్పుడు చేయాలి?

కలౌ పరాశర స్మృతి: కలియుగంలో పరాశర సంహిత అను స్మృతి గ్రంధం ప్రామాణికం కనుక.. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం..

శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే..

పైన తెలిపిన ప్రామాణిక శ్లోకాన్ని అనుసరించి.. ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించాడని అందుకే ఈరోజున హనుమంతుడి జన్మతిథి చేసుకోవడం అన్నీ రకాలా శ్రేష్టం అని అర్ధమగుచున్నది.

హనుమజ్జయంతి ఏ యే ప్రాంతాలలో ఎప్పుడు నిర్వహిస్తారు?

  • హనుమాన్ జయంతిని కొందరు చైత్ర మాసం పౌర్ణమి నాడు చేస్తుండగా మరికొందరు వైశాఖ దశమి నాడు జరుపుకోవటం గమనార్హం.
  • కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మూల నక్షత్రంలో జరుపుకుంటే.. .
  • మహారాష్ట్రలో చంద్రమాన పంచాంగం ప్రకారం చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకొంటారు.
  • ఇక తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లో హనుమజ్జయంతి ని వైశాఖమాసం కృష్ణపక్ష దశమి నాడు జరుపుకుంటారు.
  • కొందరు హనుమాన్ భక్తులు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్లలో 41 రోజుల హనుమాన్ మండల దీక్షను చైత్రమాసం పౌర్ణమి నాడు ప్రారంభించి వైశాఖమాసం కృష్ణపక్షం 10రోజున ముగిస్తారు.

హనుమద్‌ విజయోత్సవం అంటే ఏమిటి?

అయితే కొన్ని ఇతిహాసాల ప్రకారం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు చెబుతారు. ఈ కారణంగా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమజ్జయంతిగా చేసుకుంటారు.

hanuman, Hanuman Jayanthi Festival, What is special about Hanuman Jayanthi, When is the real Hanuman Jayanti, Why is Hanuman Jayanti celebrated twice
శ్రీ ఆంజనేయ స్వామి అష్టోత్తర పూజ – హనుమాన్ వ్రత విధానం
వాసవిమాత ఆవిర్భావం, జన్మ వృత్తాంతం – వాసవి కన్యకా పరమేశ్వరి కధ

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.