అయోధ్య రామమందిరం – భూ వివాదం మరియు చరిత్ర

Loading

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం బ్రిటిష్ కాలం నుంచే కొనసాగుతోంది. స్వాతంత్రానికి పూర్వమే తెరపైకి వచ్చినా 1959 తర్వాత తీవ్రతరమైంది. ఈ ఏడు దశాబ్దాల్లో అనేక మలుపులు తిరిగి అయోధ్య వివాదంపై అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై ప్రతిసారీ సంచలన తీర్పులను న్యాయస్థానాలు వెలువరించడం విశేషం. తీర్పులు వచ్చిన ప్రతిసారీ సంచలనమే.

500ఏళ్లుగా సాగిస్తున్న పోరాటపు సంక్షిప్త వివరాలు చూద్దాం –

1528: మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశాలతో బాబ్రీ మసీదు నిర్మాణం
1853: స్థలం విషయంపై అయోధ్యలో తొలిసారిగా మత ఘర్షణలు
1885: రామ మందిరం నిర్మాణం కోసం తొలి పిటిషన్. మహంత్ రఘువీర్ దాస్ పిటిషన్ న్ను కొట్టివేసిన ఫైజాబాద్ జిల్లా కోర్టు
1949: వివాదాస్పద స్థలంలో రాముడి విగ్రహం ఏర్పాటు. ముస్లింల నిరసన
1950: రాముడి విగ్రహ ఏర్పాటుకు అనుమతి కోరుతూ ఫైజాబాద్ సివిల్ కోర్ట రెండు పిటిషన్లు. ఆ స్థలంపై హక్కులు కోరుతూ 1959లో నిర్మోహి అఖారా పిటిషన్ దాఖలు
1984: రాముడి జన్మభూమిగా ప్రకటించి మందిరం నిర్మించాలని నిర్ణయం
1986: మసీదు గేట్లు తెరవాలని, వివాదాస్పద స్థలంలో భక్తులు పూజ చేసుకునేలా కోర్టు తీర్పు
1992: డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత
2003: ఎలాంటి మతపరమైన పూజలు, ప్రార్థనలు నిర్వహించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు
2010 సెప్టెంబర్ 30: వివాదాస్పద భూమిని వక్స్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాలకు సమానంగా పంచాలంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు
2011 మే 9: అలహాబాద్ హైకోర్ట్ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే
2017 మార్చి 21 : వక్స్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్ లల్లాలు కోర్టు బయటే వివాదం పరిష్కరించుకోవాలని జస్టిస్ జేఎస్ ఖేహర్ సలహా
2018 సెప్టెంబర్ 27: ఐదుగురు సభ్యుల బెంచ్ కు కేసును బదిలీ చేసేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
2019: ఆగస్ట్ 6 నుంచి అక్టోబర్ 16వరకు రోజువారీగా సుప్రీంకోర్టులో వాదనలు.
2019 నవంబర్ 9: వివాదస్పద స్థలం 2.77 ఎకరాలు హిందువులదన్న ధర్మాసనం. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు.
2024 జనవరి 22: అయోధ్య రామ మందిరం లో బాలరాముని ప్రాణప్రతిష్ఠ

ayodhya, hanuman, lakshmana, lord rama, ram mandir, rama, sita
మేడారం సమ్మక్క సారలమ్మల జాతర
అయోధ్య రామమందిరం – ప్రాణ ప్రతిష్ట ముహూర్తం

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.