అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టకు సర్వం సిద్ఘమౌతోంది. కొత్త ఏడాది ప్రారంభంలో జనవరి 22వ తేదీన హిందూవులంతా ఆతృతగా ఎదురుచూస్తున్న రామమందిరం ప్రారంభం కానుంది. రామాలయంలో రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది.
ప్రాణ ప్రతిష్ట ముహూర్తం (Muhurtam for Lord Rama Prana Pratishta):
జనవరి 22వ తేదీన మద్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 30 సెకన్ల మధ్య ఈ అద్భుత ముహూర్తముందని వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయం ఆచార్యుడు గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ చెబుతున్నారు. ఇది మేషలగ్నంలోని అభిజిత్ ముహూర్తమంటున్నారు. ఈ సమయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.
హిందూ పురాణాల ప్రకారం, శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. అభిజిత్ ముహూర్తం 11:51 AM నుండి 12:33 PM వరకు ఉంటుంది. జనవరి 22వ తేదీనే ప్రాణ ప్రతిష్ట చేయడానికి ఇది కూడా ప్రధాన కారణం. శ్రీరాముని ప్రతిష్ఠాపనకు సంబంధించిన శుభ సమయం 2024 జనవరి 22న మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు కొనసాగుతుంది. ఈ మధ్య ఉన్న వ్యవధి 1 నిమిషం 24 సెకన్లు. ఈ వ్యవధిలో అభిజీత్ ముహూర్తం ఉంటుంది. ఇది రాజ్యాల స్థాపనకు చాలా పవిత్రమైనదిగా నమ్ముతారు. దేశం, ప్రజలు దీని నుంచి అనేక విధాలుగా ప్రయోజనం పొందుతారని చెబుతారు.