సప్తచిరంజీవులు అంటే ఎవరు?

 1. Home
 2. chevron_right
 3. Devotional Facts
 4. chevron_right
 5. సప్తచిరంజీవులు అంటే ఎవరు?

సప్తచిరంజీవులు అంటే ఎవరు?

చిరంజీవులు అంటే ఎప్పటికీ చావు లేనివారు అని అర్థం. వీరినే చిరజీవులు అనికుడా అంటారు.

పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు.

సప్తచిరంజీవి శ్లోకం:

అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।
కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।
జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥

sapta chiranjiv

పై శ్లోకం ఆధారంగా సప్తచిరంజీవులు ఎవరంటే…

 1. అశ్వత్థాముడు
 2. బలి చక్రవర్తి
 3. హనుమంతుడు
 4. విభీషణుడు
 5. కృపుడు
 6. పరశురాముడు
 7. వ్యాసుడు

వారు చిరంజీవులు ఎలా అయ్యారు?

శ్రీకృష్ణ పరమాత్మ శాపము వలన అశ్వత్థాముడు, వామనుని అనుగ్రహము వల్ల బలిచక్రవర్తి, లోకహితము కొరకు వ్యాసుడు, శ్రీరాముని యొక్క భక్తితో హనుమంతుడు, రాముని అనుగ్రహము వల్ల విభీషణుడు, విచిత్రమైన జన్మము కలగడం వలన కృపుడు, ఉత్క్రుష్టమైన తపోశక్తి కలగడం చేత పరశురాముడు సప్తచిరంజీవులు అయ్యారు. ఈ ఏడుగురితో పాటుగా, శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుడిని ప్రతినిత్యం స్మరించుకొన్నచో సర్వవ్యాధులనుంచి ఉపశమనం పొంది శతాయుష్యు కలుగునని శాస్త్ర వచనం.

సేకరణ: https://www.panditforpooja.com/blog/who-are-the-7-chiranjiv/

, , , , , , ,
గబ్బిలం ఇంట్లోకి రావడం వల్ల ఏమవుతుంది | ఇంట్లోకి గబ్బిలం వస్తే ఏమిచేయాలి
కుండలినీ యోగ – కుండలిని శక్తి జాగృతమవడం వల్ల జరిగే అధ్భుతాలు

Related Posts