గబ్బిలం ఇంట్లోకి రావడం వల్ల ఏమవుతుంది | ఇంట్లోకి గబ్బిలం వస్తే ఏమిచేయాలి

గబ్బిలం ఇంట్లోకి రావడం వల్ల ఏమవుతుంది | ఇంట్లోకి గబ్బిలం వస్తే ఏమిచేయాలి

గబ్బిలం ఇంట్లోకి రావడం వల్ల ఏమవుతుంది?
సూర్యాస్తమయం అయిన వెంటనే చెట్ల గుబుర్లలోంచి బయటికి వచ్చే క్రూరమైన జీవులలో గబ్బిలం ప్రధానమైనది. గబ్బిలాలు అతి వేగంతో ఎగురుతూ చటుక్కని ఎగురుతున్న పురుగులను పెద్ద సంఖ్యలో ఫలహారంగా తింటూ ఉంటాయి.

గబ్బిలం యొక్క రంగు నలుపు, అది ఉండే ప్రదేశం నలుపు(కటిక చీకటి). మన హిందూధర్మంలో శుభకార్యక్రమములలో నలుపు వర్ణం నిషిద్ధం. అందుకే సర్వ శుభములు జరిగే ఇంట్లోకి గబ్బిలం రావడం దోషంగా పరిగణించవచ్చు. అంతేకాదు గబ్బిలం శరీరంలోని వెంట్రుకలలో ఉండే కొన్ని రసాయనముల వల్ల అది ఉన్నచోట దుర్వాసన వ్యాపిస్తుంది. గబ్బిలం ఇంట్లోకి రావడం వల్ల దుర్వార్తలను వింటారని పెద్దల విశ్వాసం.

what will happens if bat enters the house

ఇంట్లోకి గబ్బిలం వస్తే ఏమిచేయాలి?
ఒకవేళ పొరపాటున ఇంట్లోకి గబ్బిలం వస్తే…

  1. ఇల్లంతా కడిగి/తడిగుడ్డ పెట్టి శుభ్రం చేసుకోవాలి.
  2. ఇంట్లో దేవతారాధన చేసి, సాంబ్రాణి దూపపు పొగను ఇల్లంతా చూపించాలి.
  3. దుర్వార్తలను వినకుండా వేదస్వస్తులను, గృహశాంతులను చేయించుకొనవచ్చును.

గబ్బిలాలు మానవ ఆరోగ్యం పై చూపు ప్రభావం ఏమిటి?
సగటున గబ్బిలాలు 0.5% బ్యాట్ రాబిస్(గబ్బిలాల వల్ల కలిగే రాబిస్)​ వ్యాధిని తీసుకుని వస్తాయని ఒక నివేదికలో తేలింది. గబ్బిలములు మానవులను కరవడం చాలా అరుదు అయినా, 2010లో గబ్బిలములు కరచి దక్షిణఅమెరికాలోని పెరూ ప్రాంతంలో నలుగురు చిన్నారులు మరణించారని ఒక ఆ నివేదిక పేర్కొంది. అంతేకాక గబ్బిలం యొక్క నేత్రములలో ఉండే కిరణములు శరీరంపై పడితే సులభంగా చర్మవ్యాధుల వచ్చే అవకాశం ఉంది.

సేకరణ: https://www.panditforpooja.com/blog/what-will-happens-if-bat-enters-the-house/

bat, dharma sandehalu, facts, own house, pooja, remedise, పూజ గది
కలలో భవిష్యత్తును గుర్తించు శక్తి కోసం ఏమిచేయాలి?
సప్తచిరంజీవులు అంటే ఎవరు?

Related Posts