ఒకే గోత్రం ఉంటే (సగోత్రీకులకు) వివాహం చేయరాదు ఎందుకంటే..

Loading

Why are marriages in same Gotra prohibited

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

హిందూ సాంప్రదాయంలో ఇద్దరి వ్యక్తులు ఒకే గోత్రం కలిగి ఉంటే వారిని సగోత్రీకులు అంటారు. సగోత్రీకుల మధ్య వివాహాలను చేయుటకు పెద్దలు అనుమతించరు. ఈ ఆచారాన్ని అన్ని వర్ణాల వారు పాటిస్తారు. అయితే ఇలాంటి ఆచారం ఎందుకు ఏర్పడింది. అనేది ఒకసారి పరిశీలిద్దాం…

గోత్రం‘ అనే పదం ‘గౌః‘ అనే సంస్కృత పద మూలం నుంచి వచ్చింది. ‘గౌః‘ అంటే గోవులు అని అర్థం. అంతేకాక ‘గోత్రం’ అనే పదానికి గురువు, భూమి, వేదం, గోవుల సమూహం అనే అర్థాలు కూడా ఉన్నాయి. గోత్రం అనగా మన వంశోత్పాదకులైన ఆది మహర్షులలో మొదటి మహర్షి మూల పురుషుడి పేరు. ‘గోత్రం’ అనే పదం మొట్టమొదటిసారిగా ‘ఛాందోగ్యోపనిషత్‌‘ లో ఉన్న సత్యకామ జాబాలి కథలో గమనించవచ్చును.

పురాతన కాలంలో గోవులే ధనం. ఒక చోట నుంచి మరోచోటికి వలస వెళ్తుండేవారు. అలాంటి సమయంలో గోవుల రక్షణకు గోత్రాలను ఏర్పరిచారు. ఒకరి గోవులు మరొకరి గోవులలో కలిసిపోవడం వల్ల వచ్చే గొడవలను తపోనిష్ఠతో ఉండే గోత్రపాలకులు తీర్చేవారు. అలాంటి గోత్రపాలకుల పేర్లే ఆపై వారి వారి సంతానానికి గోత్రనామాలయ్యాయి. వారి వంశక్రమంలో జన్మించిన వారు, వారి వారి మూల పురుషులను గోత్ర నామంతో ఆరాధిస్తున్నారు. పూజల్లో, యజ్ఞాల్లో , యాగాల్లో, వివాహ సంబంధమైన విషయాల్లో గోత్రం యొక్క పాత్ర ఎంతో ఉంటుంది.

తమకు విద్య నేర్పించిన గురువులను బట్టి అంటే వశిష్ట, విశ్వామిత్ర మొదలైన ఋషులను తమ గోత్రాలుగా చెప్పుకోవడం అనేది ఒక పద్దతి. ఒకే గోత్రానికి చెందిన వారు సోదర సమానులు. ఎలాగైతే ఒకే తండ్రి పిల్లలు అన్నా చెల్లెళ్లు అవుతారో అలాగే ఒకే గోత్రానికి చెందిన వారు అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు అవుతారు. అందుకని సంబంధం కుదుర్చుకునే ముందు గోత్రాలను తెలుసుకుంటారు. వేర్వేరు గోత్రాల వారికి మాత్రమే వివాహం జరిపిస్తారు. సగోత్రికులకు ఎన్నడూ వివాహం చేయరాదు.

ఒకే గోత్రం వాళ్లు (సగోత్రికులు) అంటే.. వారి యొక్క జన్యువుల యొక్క నమూనాలు కూడా కొద్దిగా ఒకే రీతిని కలిగి ఉంటాయి. తద్వారా వీరు పెళ్లి చేసుకుంటే.. సరైన సంతానం కలుగకపోవచ్చని శాస్త్రీయపరంగా నిర్ధారణ కూడా జరిగింది. ఒకే గోత్రం ఉన్న వాళ్లు పెళ్లి చేసుకుంటే సంతానంలో కూడా లోపాలు ఉంటాయని గమనించి మన పూర్వీకులు ఇలాంటి పద్దతిని ఆచారంగా అవలంబిస్తూ వచ్చారు.