ఎటువంటి పుష్పాన్ని పూజలో స్వామికి సమర్పించాలి?

ఎటువంటి పుష్పాన్ని పూజలో స్వామికి సమర్పించాలి?

Loading

specific flower should be offered for god

భగవంతుని కృపకు పాత్రులు కావడానికి పూజ అనేది మొదటి మెట్టు. ఈ పూజలో మనము సాధారణంగా అనేక రకముల పువ్వులను సమర్పిస్తుంటాము. కానీ స్వామి ఎప్పుడూ అలా కోరడు. మరి ఎటువంటి పుష్పాన్ని పూజలో స్వామికి సమర్పించాలి???
భగవానుడు త్వరగా ప్రీతిపొండటానికి కావడానికి మన శాస్త్రంలో ఎనిమిది విశేష పుష్పాలను సమర్పించాలని తెలపడం జరిగింది అవి…

శ్లోకం:
అహింసా ప్రథమం పుష్పం, పుష్ప మింద్రియ నిగ్రహః |
సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం విశేషతం ||
జ్ఞానం పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం తదైవచ |
సత్యమష్ట విధం పుష్పం విష్ణోః ప్రీతికరంభవేత్ ||

  • అహింసా ప్రథమం పుష్పం – అహింస అనేది మొట్టమొదటి పుష్పం
  • పుష్ప మింద్రియ నిగ్రహః  – ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం రెండవ పుష్పం
  • సర్వభూత దయాపుష్పం – అన్ని ప్రాణులయందు దయకలిగి ఉండటం మూడవ పుష్పం
  • క్షమాపుష్పం విశేషతం – క్షమ (ఓర్పు) కలిగిఉండటం నాల్గవది
  • జ్ఞానం పుష్పం – జ్ఞానం అనే పుష్పాన్ని
  • తపః పుష్పం – ఒకే విషయం మీద మనస్సు లగ్నం చేయటమే తపస్సు
  • ధ్యాన పుష్పం – మనస్సు యందు స్వామిని మననం చేసుకొంటూ ధ్యానిస్తూ ఉండటం
  • సత్యమష్ట విధం పుష్పం – సత్యము మాట్లాడటం అనే పుష్పం

ఇంతేకాదు హృదయ కమలం (మనస్సు) అనబడే పుష్పాన్ని పూజలో సమర్పించడం వల్ల అమ్మవారు సంతుష్టురాలు అవుతుందని శ్రీ శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ప్రస్తావిన్చిరి.

సేకరణ: https://www.panditforpooja.com/blog/which-specific-flower-should-be-offered-for-god-in-pooja/

flower, god, hindu tradition, pooja, pooja room
ఆదర్శవంతమైన భర్తగా ఉండటం ఎలా???
సముద్రపు నీరు ఉప్పగా ఎందుకు ఉంటుందో తెలుసా???

Related Posts