నాగుల చవితి రోజున చేయవలసిన పనులేమిటి?

నాగుల చవితి రోజున చేయవలసిన పనులేమిటి?

Nagula Chavithi

నాగేంద్రా!!!
మేము మా వంశములో వారము నిన్ను ఆరాధిస్తున్నాము..

పొరపాటున తోక తొక్కితే తొలగిపో..
నడుం తొక్కితే నా వాడనుకో..
పడగ తొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రీ…

 

కార్తీకశుద్ద చతుర్దశి నాడు దీపావళి వెళ్ళిన నాలుగో రోజున నాగుల చవితి. ఈ రోజున ఉదయమే, తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజుకు పూజించి పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు . ముఖ్యముగా చెవి బాధలు వున్నవారికి ఈ పుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు.

ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులై అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటూ వంశవృద్ధి కూడా కలుగుతుంది. నాగ చతుర్థి సందర్భంగా పుట్ట వద్ద దీపావళి నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. నాగేంద్రస్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

dharma sandehalu, festivals, god, hindu tradition, Karthika Masam, pooja
స్కంద షష్టి | సుబ్రహ్మణ్య పూజా విధానం
మాసశివరాత్రి

Related Posts