సాధారణంగా పూజా మందిరంలో పూజించే దేవతా మూర్తుల విగ్రహములు ఎప్పుడూ పెద్దవిగా ఉండరాదు. పూజ గదిలో విగ్రహాల సైజు అంగుష్ఠ ప్రమాణములో(వ్రేలేడు సైజులో) కానీ, ఒక అడుగు(12 అంగుళాలు) సైజుకన్నా తక్కువగా మాత్రమే ఉండాలి. ఇంట్లో ఉండే విగ్రహాలు అంతకన్నా పొడవుగా ఉంటే వాటికి మామూలుగా ఇంట్లో చేసుకునే పూజ సరిపోదు. విశేష పూజలను చేసి, తప్పకుండా నిత్య నైవేద్యాలను సమర్పించాలి. అలాగే అశుచిగా ఉండే సమయంలో పూజా మందిరం వైపు వెళ్ళకుండా నియమనిష్టలను పాటించడం ఉత్తమం.
విగ్రహం పరిమాణం ఎంతైనా నిత్యం ప్రాణ ప్రతిష్ఠ చేసుకుని పూజించాలి. ప్రాణ ప్రతిష్ఠ చేయకుండా పూజను చేసిన యెడల ఆ పూజ అలంకార ప్రాయముగానే ఉండును. కనీసం యధాశక్తి శ్లోకమును చెప్పి పూజించడం మంచిది, ఎందుచతననగా దేవుడి విగ్రహాలు అలంకార ప్రాయంగా ఉండకూడదని ధర్మ శాస్త్రం చెబుతోంది.
ఎటువంటి విగ్రహాలను పూజగదిలో పూజించాలి?
దేవుడి విగ్రహాలు ప్రస్తుత కాలంలో కాగితము, రాయి, లోహము, ప్లాస్టిక్, సిమెంట్, గాజు వంటి వివిధరకాల పదార్థాలతో తయారుచేయబడి ఉంటున్నాయి కానీ వీటిలో కొన్నిటితో చేసిన విగ్రహాలను మాత్రమే వాడాలి. ఇంట్లో విగ్రహాలు ఎప్పుడూ రాయితోగాని, లోహముతో చేసినవై ఉండాలి. రాయితో తయారయిన చిన్న విగ్రహాలు దొరకడం కష్టమైతే రాగితో చేసిన విగ్రహాలను వాడవచ్చును. శక్తి కలిగినవారు ఉత్తమమైన బంగారంతో కానీ, మధ్యమమైనది వెండితో కానీ ఏర్పాటు చేసుకొనవచ్చును. మిగితా లోహాలు, పదార్థాలతో చేసిన విగ్రహాలు వాడకపోవడమే ఉత్తమం!
సేకరణ: https://www.panditforpooja.com/blog/best-size-of-idols-in-pooja-room/