కార్తీక పూర్ణిమ – జ్వాలాతోరణం ఏ రోజు?

కార్తీక పూర్ణిమ – జ్వాలాతోరణం ఏ రోజు?

Jwala Thoranam

ఎగసి పడే మంటలను జ్వాలా తోరణం అంటారు. ఉదాహరణకు అగ్ని పర్వతాల నుంచి ఎగసి పడే మంటలు. అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ఎగసి పడే మంటలను జ్వాలా తోరణం అంటారు. జ్వాలా తోరణం పదం పురాణ ప్రసిద్ధమైంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పడు మొదటగా హాలాహలము ఉద్భవించింది. ఇది లోకములను సర్వ నాశనము చేసే ప్రమాదము ఉన్నందున, బ్రహ్మాదులు ఈ ఉత్పాతం నుంచి రక్షించ వలసినదని మహాశివుని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి, మహాశివుడు ఆ హాలాహలాన్ని మ్రింగటానికి సిద్ధ పడ్డాడు. ఆ హాలాహలం బయట ఉంటే పై లోకాలను, కడుపు లోనికి వెడితే అధో లోకాలను దహించివేస్తుందనే ఉద్దేశంతో మహాశివుడు ఆ విషాన్ని కంఠ మద్యములో నిక్షేపించాడు. ఈ దృశ్యాన్ని చూసి, పార్వతీ దేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి, శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరము అగ్ని జ్వాల క్రింది నుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మ్రొక్కుకుంది. మహాశివునికి ప్రమాదము జరుగలేదు. కనుక ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయములలో, ఎండు గడ్డితో చేసిన తోరణమును, రెండు కర్ర స్తంభముల మధ్య కట్టి, దానికి అగ్నిని ముట్టించి, ఆ తోరణము జ్వాలగా వెలుగుతుంటే, ఆ జ్వాల క్రింది నుంచి శివ, పార్వతుల పల్లకీని మూడు సార్లు మోసుకొని వెడతారు. జ్వాల వలె వెలిగే ఈ తోరణాన్ని “జ్వాలా తోరణం” అంటారు.

ఈ సంవత్సరం, కార్తీక పూర్ణిమ సోమవారం, నవంబర్ 27, 2023 నాడు జరుపుకుంటారు.

పూర్ణిమ తిథి ప్రారంభం: నవంబర్ 26, 2023న మధ్యాహ్నం 03:53

పూర్ణిమ తిథి ముగుస్తుంది: నవంబర్ 27, 2023న మధ్యాహ్నం 02:45 గంటలకు

dharma sandehalu, diwali, facts, festivals, god, hindu tradition, Karthika Masam, kedareswara, maha lakshmi, pooja room, siva
ఆకాశ దీపం అంటే ఏమిటి?
కార్తీక మాసం విశిష్టత

Related Posts