- హనుమాన్ వ్రతమును ఎప్పుడు ఆచరించాలి?
- హనుమంతునికి ప్రీతిగా ఏ విధంగా ఈ వ్రతమును ఆచరించాలి?
- హనుమాన్ వ్రతం రోజున ఏయే పూజలను చేయడం శ్రేష్ఠం?
- ఈ రోజు చేసే పూజలకు మారుతి ఎటువంటి ఫలితాలను ఇస్తాడు.?
మార్గశీర్షే త్రయోదశ్యాం – శుక్లాయాం జనకాత్మజా |
దృష్ట్యా దేవీ జగన్మాతా – మహావీరేణ ధీమతా ||
మర్గశిర శుద్ద త్రయోదశి హనుమత్ వ్రతం. ఆంజనేయ స్వామి భక్తికి ప్రతీకగా, ఆత్మవిశ్వాసం పెంచి అపజయాలు తొలగించి విజయాలు చేకూర్చే శక్తి. భోగాన్ని, మోక్షాన్ని ఇచ్చే కల్ప వృక్షం హనుమంతుడు. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం హనుమత్ వ్రతం ఆచరించడం.
మార్గశిర త్రయోదశినాడు సువర్చలా సమేత హనుమంతుడిని కలశంలోకి ఆవాహనచేసి పూజించి, హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తిచేసుకుంటారు. పదమూడు ముళ్ల తోరాన్ని ధరిస్తారు. ఈవిధంగా పదమూడుసంవత్సరాలు వరుసగా చేసిన వారికి హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రవచనం.
విశేషించి ఈ హనుమత్ వ్రతం నాడు స్వామికి అత్యంత ప్రీతికరమైన అప్పాలు, తమలపాకులు, సింధూరంతో పూజలు చేయుట వలన స్వామి కృప కలిగి ఆరోగ్యము, విజయము, మృత్యుభయ విముక్తి కలుగును.
సేకరణ: https://www.panditforpooja.com/blog/importance-of-hanuman-vratham/