సంధ్యావందనం ఎలా చేయాలి – కృష్ణ యజుర్వేద సంధ్యావందనం విధి

Loading

how-to-perform-sandhyavandanam

Poojalu. com శ్రేయోభిలాషులకు శుభాభినందనలు. ఇకపై గ్రూప్ ల ద్వారా కాకుండా నేరుగా నిత్య పంచాంగం, పూజా విధానాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక సమాచారాలను పొందడానికి ఇప్పుడే మా WhatsApp Channel ను అనుసరించండి.

ఉపనయనం అయిన ప్రతీ వ్యక్తి చేయవలసిన నిత్య కర్మలలో సంధ్యావందనం చాలా ప్రదానమైనది.  పగలు, రాత్రుల నడుమ వచ్చే సంధి కాలము నాడు చేయవలసిన కార్యక్రమం కాబట్టి దీన్ని సంధ్యావందనం అని అంటారు. సంధ్యావందనం(Sandhyavandanam) చేయకుండా ఇతర కర్మలను చేయకూడాదు. సంధ్యావందనం ఎలా చేయాలి అన్నది ఇక్కడ తెలుసుకోవచ్చును.

how-to-perform-sandhyavandanam

కృష్ణ యజుర్వేద సంధ్యావందనం విధి – How to Perform Sandhyavandanam

శ్రీ గురుభ్యో నమః | హరిః ఓం ||

|| శుచిః ||
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా |
యః స్మరేత్పుండరీకాక్షం స బాహ్యాభ్యన్తరశ్శుచిః ||

పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః ||

|| ఆచమనము ||
శ్రౌతాచమనము –
౧. ఓం తత్సవితుర్వరేణ్యమ్ స్వాహా
౨. భర్గో దేవస్య ధీమహి స్వాహా
౩. ధియో యోనః ప్రచోదయాత్ స్వాహ
౪. ఆపో హిష్ఠా మయోభువః (అరచేయి)
౫. తా న ఊర్జే దధాతన (అరచేయి)
౬. మహేరణాయ చక్షసే (పై పెదవి)
౭. యో వః శివతమో రసః (క్రింద పెదవి)
౮. తస్య భాజయతే హ నః (శిరస్సు)
౯. ఉశతీరివ మాతరః (శిరస్సు)
౧౦. తస్మా అరఙ్గమామవః (ఎడమ చేయి)
౧౧. యస్య క్షయాయ జిన్వథ (పాదములు)
౧౨. ఆపో జనయథా చ నః (శిరస్సు)
౧౩. ఓం భూః (గడ్డము)
౧౪. ఓం భువః (ఎడమ ముక్కు)
౧౫. ఓం సువః (కుడి ముక్కు)
౧౬. ఓం మహః (ఎడమ కన్ను)
౧౭. ఓం జనః (కుడి కన్ను)
౧౮. ఓం తపః (ఎడమ చెవి)
౧౯. ఓగ్‍ం సత్యమ్ (కుడి చెవి)
౨౦. ఓం తత్స వితుర్వరేణ్యమ్ (నాభి)
౨౧. భర్గో దేవస్య ధీమహి (హృదయము)
౨౨. ధియో యోనః ప్రచోదయాత్ (శిరస్సు)
౨౩. ఓమాపో జ్యోతీ రసోఽమృతం (ఎడమ భుజము)
౨౪. బ్రహ్మ భూర్భువస్సువరోమ్ (కుడి భుజము)

స్మృత్యాచమనము –
౧. త్రిరాచామేత్ (స్వాహా | స్వాహా | స్వాహా )
౨. ద్విఃపరిమృజ్య (పెదవులు)
౩. సకృదుపస్పృశ్య (పెదవులు)
౪. దక్షిణేన పాణినా సవ్యంప్రోక్ష్య (ఎడమ అరచేయి)
పాదౌ (రెండు పాదములు)
శిరశ్చ (శిరస్సు)
౫. ఇంద్రియాణ్యుపస్పృశ్య చక్షుషీ (కళ్ళు)
నాసికే (ముక్కు పుటములు)
శ్రోత్రే చ (చెవులు)
౬. హృదయమాలభ్య (హృదయం)
అపవుపస్పృశ్య

పురాణాచమనము –
౧. ఓం కేశవాయ స్వాహా
౨. ఓం నారాయణాయ స్వాహా
౩. ఓం మాధవాయ స్వాహా
౪. ఓం గోవిందాయ నమః (ఎడమ అరచేయి)
౫. ఓం విష్ణవే నమః (కుడి అరచేయి)
౬. ఓం మధుసూదనాయ నమః (పై పెదవి)
౭. ఓం త్రివిక్రమాయ నమః (క్రింద పెదవి)
౮. ఓం వామనాయ నమః (శిరస్సు)
౯. ఓం శ్రీధరాయ నమః (శిరస్సు)
౧౦. ఓం హృషీకేశాయ నమః (ఎడమ చేయి)
౧౧. ఓం పద్మనాభాయ నమః (రెండు పాదములు)
౧౨. ఓం దామోదరాయ నమః (శిరస్సు)
౧౩. ఓం సంకర్షణాయ నమః (గడ్డము)
౧౪. ఓం వాసుదేవాయ నమః (ఎడమ ముక్కు)
౧౫. ఓం ప్రద్యుమ్నాయ నమః (కుడి ముక్కు)
౧౬. ఓం అనిరుద్ధాయ నమః (ఎడమ కన్ను)
౧౭. ఓం పురుషోత్తమాయ నమః (కుడి కన్ను)
౧౮. ఓం అథోక్షజాయ నమః (ఎడమ చెవి)
౧౯. ఓం నారసింహాయ నమః (కుడి చెవి)
౨౦. ఓం అచ్యుతాయ నమః (నాభి)
౨౧. ఓం జనార్దనాయ నమః (హృదయము)
౨౨. ఓం ఉపేంద్రాయ నమః (శిరస్సు)
౨౩. ఓం హరయే నమః (ఎడమ భుజము)
౨౪. ఓం శ్రీ కృష్ణాయ నమః (కుడి భుజము)

|| భూతోచ్ఛాటనము ||
ఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||

|| ప్రాణాయామము ||
ఓం భూః | ఓం భువః | ఓగ్‍ం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍ం సత్యమ్ |
ఓం తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ ||
ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||

|| సంకల్పము ||
(* – “సంకల్పం కోసం సూచనలు” చూ.)
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ___ ప్రదేశే ___, ___ నద్యోః మధ్య ప్రదేశే శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమన వ్యావహరిక చాంద్రమానేన శ్రీ ____ (*౧) నామ సంవత్సరే ___ అయనే(*౨) ___ ఋతౌ (*౩) ___ మాసే(*౪) ___ పక్షే (*౫) ___ తిథౌ (*౬) ___ వాసరే (*౭) ___ నక్షత్రే (*౮) ___ యోగే (*౯) ___ కరణ (*౧౦) ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభాయాం శుభతిథౌ శ్రీమాన్ ___ గోత్రః ___ నామధేయః (శ్రీమతః ___ గోత్రస్య ___ నామధేయస్య ధర్మపత్నీసమేతస్య) శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం సంధ్యాం ఉపాసిష్యే ||

|| మార్జనము ||

ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన | మహేరణాయ చక్షసే |
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః | ఉశతీరివ మాతరః |
తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ | ఆపో జనయథా చ నః |

మంత్రాచమనం ||

(ప్రాతః కాలమున)
సూర్యశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః | పాపేభ్యో రక్షన్తామ్ | యద్రాత్రియా పాపమకార్షమ్ | మనసా వాచా హస్తాభ్యామ్ | పద్భ్యాముదరేణ శిశ్నా | రాత్రిస్తదవలుమ్పతు | యత్కిఞ్చ దురితం మయి | ఇదమహం మా మమృత యోనౌ | సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా |

(మధ్యాహ్న కాలమున)
ఆపః పునన్తు పృథివీం పృథివీ పూతా పునాతు మామ్ | పునన్తు బ్రహ్మణస్పతిర్బ్రహ్మ పూతా పునాతు మామ్ | యదుచ్ఛిష్టమభోజ్యం యద్వా దుశ్చరితం మమ | సర్వం పునన్తు మా మాపోఽసతాం చ ప్రతిగ్రహగ్గ్ం స్వాహా ||

(సాయం కాలమున)
అగ్నిశ్చ మా మన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః | పాపేభ్యో రక్షన్తామ్ | యదహ్నా పాపమకార్షమ్ | మనసా వాచా హస్తాభ్యామ్ | పద్భ్యాముదరేణ శిశ్నా | అహస్తదవలుమ్పతు | యత్కిఞ్చ దురితం మయి | ఇదమహం మా మమృత యోనౌ | సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా |

ఆచమ్య (చే.) ||

|| పునః మార్జనము ||
దధిక్రావ్ణోఅకారిషం జిష్ణోరశ్వస్య వాజినః | సురభి నో ముఖా కరత్ప్రాణ ఆయూగ్ంషి తారిషత్ ||

ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన | మహేరణాయ చక్షసే |
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః | ఉశతీరివ మాతరః |
తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ | ఆపో జనయథా చ నః |

హిరణ్యవర్ణాః శుచయః పావకా యాసు జాతః కశ్యపో యాస్విన్ద్రః |
అగ్నిం యా గర్భం దధిరే విరూపాస్తా న ఆపశ్శగ్గ్ స్యోనా భవన్తు ||

యాసాగ్ం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే అవపశ్యఞ్జనానామ్ |
మధుశ్చుతశ్శుచయో యాః పావకాస్తా న ఆపశ్శగ్గ్ స్యోనా భవన్తు ||

యాసాం దేవా దివి కృణ్వన్తి భక్షం యా అన్తరిక్షే బహుధా భవన్తి |
యాః పృథివీం పయసోన్దన్తి శుక్రాస్తా న ఆపశ్శగ్గ్ స్యోనా భవన్తు ||

శివేన మా చక్షుషా పశ్యతాపశ్శివయా తనువోప స్పృశత త్వచం మే |
సర్వాగ్ం అగ్నీగ్ం రప్సుషదో హువే వో మయి వర్చో బలమోజో నిధత్త ||

పాపవిమోచన మంత్రం ||

ద్రుపదా దివ ముంచతు | ద్రుపదా దివేన్ముముచానః |
స్విన్నః స్నాత్వీ మలాదివ | పూతం పవిత్రేణేవాఽఽజ్యమ్ ||
ఆపః శున్ధన్తు మైనసః ||

|| అర్ఘ్యప్రదానము ||

ఆచమ్య (చే.) ||
ప్రాణానాయమ్య (చే.) ||

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ (ముఖ్య కాలాతిక్రమణ దోష నివృత్త్యర్థం ప్రాయశ్చిత్త అర్ఘ్య ప్రదాన పూర్వక) ప్రాతః / మాధ్యాహ్నిక / సాయం సంధ్యాంగ అర్ఘ్యప్రదానం కరిష్యే ||

(ప్రాతః కాలమున)
ఓం భూః | ఓం భువః | ఓగ్‍ం సువః | ఓం తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ || [౩ (+౧) సార్లు]

(మధ్యాహ్న కాలమున)
హగ్ం సశ్శుచిషద్వసురన్తరిక్ష సద్ధోతా వేదిష దతిథిర్దురోణ సత్ | నృషద్వరస దృత స ద్వ్యోమ స దబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ || [౧ సారి]

ఓం భూః | ఓం భువః | ఓగ్‍ం సువః | ఓం తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ || [౨ సార్లు]

(సాయం కాలమున)
ఓం భూః | ఓం భువః | ఓగ్‍ం సువః | ఓం తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ || [౩ (+౧) సార్లు]

ప్రదక్షిణ ||
ఉద్యన్తమస్తం యన్తమాదిత్యమభిధ్యాయన్కుర్వన్బ్రాహ్మణో విద్వాన్త్సకలం భద్రమశ్నుతేఽసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవసన్బ్రహ్మాప్యేతి య ఏవం వేద ||
అసావాదిత్యో బ్రహ్మ ||

|| తర్పణములు ||

ఆచమ్య (చే.) ||
ప్రాణానాయమ్య (చే.) ||

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ ప్రాతః / మాధ్యాహ్నిక / సాయం సంధ్యాంగ తర్పణం కరిష్యే ||

(ప్రాతః కాలమున)
సంధ్యాం తర్పయామి | గాయత్రీం తర్పయామి |
బ్రాహ్మీం తర్పయామి | నిమృజీం తర్పయామి |

(మధ్యాహ్న కాలమున)
సంధ్యాం తర్పయామి | సావిత్రీం తర్పయామి |
రౌద్రీం తర్పయామి | నిమృజీం తర్పయామి |

(సాయం కాలమున)
సంధ్యాం తర్పయామి | సరస్వతీం తర్పయామి |
వైష్ణవీం తర్పయామి | నిమృజీం తర్పయామి |

|| గాయత్రీ ||

ఆచమ్య (చే.) ||

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షమ్ |
గాయత్రం ఛందం | పరమాత్మం సరూపం | సాయుజ్యం వినియోగమ్ |

ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మ సమ్మితమ్ |
గాయత్రీం ఛన్దసాం మాతేదం బ్రహ్మ జుషస్వ మే ||

యదహ్నాత్కురుతే పాపం తదహ్నాత్ప్రతి ముచ్యతే |
యద్రాత్రియాత్కురుతే పాపం తద్రాత్రియాత్ప్రతి ముచ్యతే |
సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి |

ఓజోఽసి సహోఽసి బలమసి భ్రాజోఽసి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయుస్సర్వమసి సర్వాయురభిభూరోం |
గాయత్రీమావాహయామి | సావిత్రీమావాహయామి | సరస్వతీమావాహయామి | ఛన్దర్షీనావాహయామి | శ్రియమావాహయామి ||
గాయత్రియా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషిః సవితా దేవతా అగ్నిర్ముఖం బ్రహ్మశిరో విష్ణుర్ హృదయగ్ం రుద్రశ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపానవ్యానోదాన సమానా స ప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్ం శత్యక్షరా త్రిపదా షట్కుక్షిః పంచశీర్షోపనయనే వినియోగః ||

|| మంత్ర జపం ||

ఆచమ్య (చే.) ||
ప్రాణానాయమ్య (చే.) ||

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం యథా శక్తి ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం సంధ్యాంగ గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే ||

కరన్యాసము ||
ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః |
వరేణ్యమ్ విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః |
భర్గో దేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో యోనః జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః |
ప్రచోదయాత్ సర్వాత్మనే కరతల కరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసము ||
ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరేణ్యమ్ విష్ణ్వాత్మనే శిరసే స్వాహా |
భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో యోనః జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయ ఫట్ |

ఓం భూర్భువస్సువరోం ఇతి దిగ్బంధః ||

గాయత్రీ ధ్యానము ||
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః
యుక్తామిన్దు నిబద్ధ రత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాఙ్కుశ కశాశ్శుభ్రంకపాలం గదాం
శంఖం చక్రమథారవిన్దయుగళం హస్తైర్వహన్తీం భజే ||

యో దేవస్సవితాఽస్మాకం ధియో ధర్మాదిగోచరాః
ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే ||

గాయత్రీ ముద్రలు ||
సుముఖం సంపుటం చైవ వితతం విస్తృతం తథా |
ద్విముఖం త్రిముఖం చైవ చతుః పంచముఖం తథా ||
షణ్ముఖోఽధోముఖం చైవ వ్యాపికాఞ్జలికం తథా |
శకటం యమపాశం చ గ్రథితం సమ్ముఖోన్ముఖం ||
ప్రలమ్బం ముష్టికం చైవ మత్స్యః కూర్మో వరాహకమ్ |
సింహాక్రాన్తం మహాక్రాన్తం ముద్గరం పల్లవం తథా ||
చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః |
ఇతి ముద్రా న జానాతి గాయత్రీ నిష్ఫలాభవేత్ ||

పరబ్రహ్మ ప్రకాశం చ సత్య బ్రహ్మ ప్రకీర్తితాః |
ఆగచ్ఛ వరదా దేవి జపేమే సన్నిధిం కురు ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుదేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః |

గాయత్రీ మంత్రం ||
ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ ||

|| మంత్ర జపావసానం ||

ఆచమ్య (చే.) ||
ప్రాణానాయమ్య (చే.) ||

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః / మాధ్యాహ్నిక / సాయం సంధ్యాంగ గాయత్రీ మహామంత్ర జపావసానం కరిష్యే ||

కరన్యాసము ||
ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః |
వరేణ్యమ్ విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః |
భర్గో దేవస్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో యోనః జ్ఞానాత్మనే కనిష్ఠికాభ్యాం నమః |
ప్రచోదయాత్ సర్వాత్మనే కరతల కరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసము ||
ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరేణ్యమ్ విష్ణ్వాత్మనే శిరసే స్వాహా |
భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో యోనః జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయ ఫట్ |

సువర్భువర్భూరోం ఇతి దిగ్విమోకః ||

ధ్యానమ్ –
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః
యుక్తామిన్దు నిబద్ధ రత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాఙ్కుశ కశాశ్శుభ్రంకపాలం గదాం
శంఖం చక్రమథారవిన్దయుగళం హస్తైర్వహన్తీం భజే ||

యో దేవస్సవితాఽస్మాకం ధియో ధర్మాదిగోచరాః
ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే ||

ఉత్తర ముద్రలు ||
సురభిః జ్ఞాన చక్రే చ యోనిః కూర్మోఽథ పంకజం |
లింగం నిర్యాణ ముద్రా చేత్యష్ట ముద్రాః ప్రకీర్తితాః |

తత్సద్ బ్రహ్మార్పణమస్తు ||

|| సూర్యోపస్థానమ్ ||

(ప్రాతః కాలమున)
మిత్రస్య చర్షణీ ధృతశ్శ్రవోదేవస్య సానసిమ్ | సత్యం చిత్రశ్రవస్తమమ్ || మిత్రో జనాన్యాతయతి ప్రజానన్మిత్రో దాధార పృథివీ ముతద్యామ్ | మిత్రః కృష్టీరనిమిషాఽభిచష్టే సత్యాయ హవ్యం ఘృతవద్విధేమ | ప్ర స మిత్రమర్తో అస్తు ప్రయస్వాన్యస్త ఆదిత్యశ్శిక్షతి వ్రతేన | న హన్యతే న జీయతేత్వోతోనైనమగ్ంహో అశ్నోత్యన్తితో న దూరాత్ ||

(మధ్యాహ్న కాలమున)
ఆ సత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యం చ |
హిరణ్యయేన సవితా రథేనాఽఽదేవోయాతి భువనావి పశ్యన్ ||
ఉద్వయం తమసస్పరి పశ్యన్తో జ్యోతిరుత్తరమ్ |
దేవం దేవత్రా సూర్య మగన్మ జ్యోతిరుత్తమమ్ |
ఉదు త్యం జాత వేదసం దేవం వహన్తి కేతవః దృశే విశ్వాయ సూర్యమ్ |
చిత్రం దేవానా ముదగా దనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః |
ఆ ప్రా ద్యావాపృథివీ అన్తరిక్షగ్ం సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ |
తచ్చక్షుర్దేవహితం పురస్తాచ్ఛుక్రముచ్చరత్ | పశ్యేమ శరదశ్శతం జీవేమ శరదశ్శతం | నన్దామ శరదశ్శతం మోదామ శరదశ్శతం భవామ శరదశ్శతగ్ం శృణవామ శరదశ్శతం ప్రబ్రవామ శరదశ్శతమజీతాస్స్యామ శరదశ్శతం జోక్చ సూర్యం దృశే | య ఉదగాన్మహతోఽర్ణవాద్విభ్రాజమానస్సరిరస్య మధ్యాథ్స మా వృషభో లోహితాక్షస్సూర్యో విపశ్చిన్మనసా పునాతు ||

(సాయం కాలమున)
ఇమం మే వరుణ శ్రుధీ హవ మద్యా చ మృడయ | త్వామవస్యు రాచకే | తత్త్వా యామి బ్రహ్మణా వన్దమాన స్తదా శాస్తే యజమానో హవిర్భిః | ఆహేడమానో వరుణే హ బోధ్యురుశగ్ం స మా న ఆయుః ప్రమోషీః ||
యచ్చిద్ధి తే విశో యథా ప్ర దేవ వరుణ వ్రతమ్ | మినీమసిద్యవిద్యవి | యత్కిఞ్చేదం వరుణ దైవ్యే జనేఽభి ద్రోహం మనుష్యాశ్చరామసి | అచిత్తీ య త్తవ ధర్మా యుయోపిమ మానస్తస్మా దేనసో దేవ రీరిషః | కితవాసో యద్రిరిపుర్నదీవి యద్వాఽఘా సత్యముత యన్న విద్మ | సర్వా తా విష్య శిథిరేవ దేవాథా తే స్యామ వరుణ ప్రియాసః ||

|| దిఙ్నమస్కారః ||

ఓం నమః ప్రాచ్యై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసన్త్యే తాభ్యశ్చ నమో
నమో దక్షిణాయై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసన్త్యే తాభ్యశ్చ నమో |
నమః ప్రతీచ్యై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసన్త్యే తాభ్యశ్చ నమో
నమ ఉదీచ్యై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసన్త్యే తాభ్యశ్చ నమో
నమ ఊర్ధ్వాయై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసన్త్యే తాభ్యశ్చ నమో
నమోఽధరాయై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసన్త్యే తాభ్యశ్చ నమో
నమోఽవాన్తరాయై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసన్త్యే తాభ్యశ్చ నమః ||

|| ముని నమస్కారః ||
నమో గఙ్గాయమునయోర్మధ్యే యే వసన్తి తే మే ప్రసన్నాత్మానశ్చిరఞ్జీవితం వర్ధయన్తి
నమో గఙ్గాయమునయోర్మునిభ్యశ్చ నమో నమో గఙ్గాయమునయోర్మునిభ్యశ్చ నమః |

|| దేవతా నమస్కారః ||
సంధ్యాయై నమః | సావిత్ర్యై నమః | గాయత్ర్యై నమః | సరస్వత్యై నమః | సర్వాభ్యో దేవతాభ్యో నమః | దేవేభ్యో నమః | ఋషిభ్యో నమః |
మునిభ్యో నమః | గురుభ్యో నమః | పితృభ్యో నమః | మాతృభ్యో నమః |

కామోఽకారిషీన్నమో నమః | మన్యురకారిషీన్నమో నమః |

పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ | ఓం నమో భగవతే వాసుదేవాయ |

యాగ్ం సదా సర్వ భూతాని చరాణి స్థావరాణి చ
సాయం ప్రాతర్నమస్త్యన్తి సామా సన్ధ్యాఽభిరక్షతు ||

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయగ్ం శివః ||
యథా శివమయో విష్ణురేవం విష్ణుమయశ్శివః |
యథాఽన్తరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ||
నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||

|| గాయత్రీ ప్రస్థాన ప్రార్థనా ||

ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వత మూర్ధని
బ్రాహ్మణేభ్యోఽభ్యనుజ్ఞాతా గచ్ఛదేవి యథాసుఖమ్ |
స్తుతో మయా వరదా వేదమాతా ప్రచోదయన్తీ పవనే ద్విజాతా |
ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం
మహ్యం దత్వా ప్రజాతుం బ్రహ్మ లోకమ్ ||

నమోఽస్త్వనన్తాయ సహస్ర మూర్తయే
సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే
సహస్ర కోటీ యుగధారిణే నమః ||

ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు | పితర్మాతర్యదిహోపబ్రువే వామ్ |
భూతం దేవానా మవమే అవోభిః | విద్యామేషం వృజినం జీరదానుమ్ |

ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం |
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ||

సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలమ్ |
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వా దేవం జనార్దనమ్ ||

వాసనాద్వాసుదేవస్య వాసితం తే జగత్త్రయం |
సర్వభూత నివాసోఽసి వాసుదేవ నమోఽస్తుతే ||

|| ప్రవర ||
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు || _____ ప్రవరాన్విత ___ గోత్రః ఆపస్తంబ సూత్రః ___ శాఖాధ్యాయీ ____ శర్మాఽహం భో అభివాదయే ||

ఆచమ్య (చే.) ||

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతేః స్వభావాత్
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||

శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||

ఆబ్రహ్మలోకాదాశేషాదాలోకాలోక పర్వతాత్ |
యే సన్తి బ్రాహణా దేవాస్తేభ్యో నిత్యం నమో నమః ||

ఓం శాంతిః శాంతిః శాంతిః

hindu tradition, pooja room, Sandhyavandanam, Yagnopaveetham
రజస్వలా దోషాన్ని నివారించే ఋషిపంచమి వ్రతం
స్త్రీలు దీపారాధన చేయాలి అంటే రోజూ తలస్నానం చేయాలా..?

Related Posts

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.