రజస్వలా దోషాన్ని నివారించే ఋషిపంచమి వ్రతం

 1. Home
 2. chevron_right
 3. Pujas & Prominences
 4. chevron_right
 5. రజస్వలా దోషాన్ని నివారించే ఋషిపంచమి వ్రతం

రజస్వలా దోషాన్ని నివారించే ఋషిపంచమి వ్రతం

రజస్వలా దోషాన్ని నివారించే ఋషిపంచమి వ్రతం:

ఋషి పంచమి వ్రతం ఒక ప్రాయశ్చిత్త వ్రతం. స్త్రీలు ఈ ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించినట్లయితే జన్మ జన్మలందు రజస్వలయై చేసిన దోషములు(బహిష్టు ఇంట్లో కలుపుట / అన్యులను తాకుట / అన్నం వండి పెట్టుట మొ..) హరించబడతాయి. ఇది స్త్రీల వ్రతం. ప్రతి స్త్రీ తప్పక ఆచరించవలసిన వ్రతం.

ఋషిపంచమి వ్రతం ఎలా ఆచరించాలి?

ఋషిపంచమి వ్రతం ఆచరించాలని చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసినా ఆచరించే వాళ్ళు తక్కువ! కొందరు ఆచరించినా చాలా అశాస్త్రీయంగా చేయడం కొంత విచారకరం.

 • పంచమినాటి తెల్లవారుఝామున స్త్రీలు స్నానం చేసి పుష్పసంచయనం చేయాలి.
 • స్నానం చేస్తున్న సమయంలోనే వ్రత సంకల్పాన్ని చెప్పుకోవాలి.
 • అనంతరం గణపతి పూజ పూర్తిచేసి, ఉత్తరేణి మొక్కకు పూజసల్పి, దాన్ని సమూలంగా పెరికివేసి,దాని కొమ్మతో దంతధావనం (పళ్ళుతోమడం) చేయాలి.
 • పుణ్యస్త్రీలు విభుడి, గోపిచందనం, పంచగవ్యములతో స్నానించాలి.
 • ఈ తంతు ముగియగానే ఆకాశంలోని సప్తఋషులను,అరుంధతిని చూస్తూ ఋషి పూజ చేయాలి.
 • పూజలో నాల్గువత్తుల దీపం ఉండాలి. పూజానంతరం, భోజనంలో బఱ్ఱె పెరుగు, వేయించిన శనగలు, తోటకూర కూరను భుజించాలి.
 • వివాహితలు ఈ వ్రతంవల్ల భర్త ప్రేమనూ, వితంతువులు రాబోయే జన్మలో ఆయుష్మంతుడైన భర్తను పొందుతారని ” వ్రతోత్సవ చరిత్ర ” స్పష్టం చేస్తున్నది.
 • ఋషిపంచమి మధ్యాహ్నకాల వ్యాపిని అయి ఉండాలి. పంచమి తిధి ఉభయదినవ్యాపినిగా ఉంటే మొదటిరోజునే ఈ వ్రతం ఆచరించాలి.
 • నీలమతపురాణం ఋషిపంచమిని వరుణపంచమిగానూ, ” జ్యోతిషీ” రక్షాపంచమిగానూ, స్మృతి కౌస్తుభమౌ – చతుర్వర్గ చింతామణి – పురుషార్ధ చింతామణి వంటి పలు ప్రాచీన గ్రంథాలు”ఋషిపంచమి” గానూ పేర్కొనడం జరుగింది.
 • ఋషిపంచమి రోజున కనీసం అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని శాస్త్ర వచనం
rishi-panchami-vratam-to-remove-menstruation-doshas

సప్తఋషి ధ్యాన శ్లోకములు:

కశ్యప ఋషి :
కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః| ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః||
ఓం అదితి సహిత కశ్యపాయ నమః||

అత్రి ఋషి :
అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్| సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్||
ఓం అనసూయా సహిత అత్రయేనమః||

భరద్వాజ ఋషి :
జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్| కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్||
ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః||

విశ్వామిత్ర ఋషి :
కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్| దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్||
ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః||

గౌతమ ఋషి :
యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా| అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః||
ఓం అహల్యా సహిత గౌతమాయనమః||

జమదగ్ని ఋషి :
అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్| దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే||
ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః

వసిష్ఠ ఋషి :
శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్| బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా||
ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః||

కశ్యపత్రి ర్భరద్వాజో విశ్వా మిత్రోథ గౌతమః| వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తథా||

సప్తఋషిభ్యో నమః

, , ,
నిజంగా దేవతల సంఖ్య ఎంత?
సంధ్యావందనం ఎలా చేయాలి – కృష్ణ యజుర్వేద సంధ్యావందనం విధి

Related Posts