కుండలినీ యోగ – కుండలిని శక్తి జాగృతమవడం వల్ల జరిగే అధ్భుతాలు

కుండలినీ యోగ – కుండలిని శక్తి జాగృతమవడం వల్ల జరిగే అధ్భుతాలు

మానవ శరీరం యొక్క వెన్నుపాములో దాగి ఉండే ఒక అద్వితీయమైన శక్తే ఈ కుండలిని శక్తి. దీని బీజ మంత్రం లం. మూలాధారం నుంచి సుషుమ్నా నాడి ద్వారా పైన ఉన్న సహస్రారం వరకు ఈ కుండలిని శక్తిని తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ. కుండలినీ యోగ లో ప్రధానమైన సాధన ప్రాణాయామం. ప్రాణాయామం ద్వారా మాత్రమే కుండలి శక్తిని జాగృతం చేయగలము. కుండలినీ శక్తి సుషుమ్నా నాడి ద్వారా సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతాడు.

మూలాధారం ఒక భూతత్వం. కుండలిని శక్తి జాగృతమైతే విశేషమైన అధ్భుతాలు జరుగుతాయి. బంధములనుండి విముక్తులై పరమాత్మలోకి చేరడానికి మూలం కుండలిని శక్తిని ప్రేరేపించడమే. ఈ శక్తిమూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న 7 దశలలో చేరుతుంది. ఈ విధంగా చేర్చగలిగితే పరమాత్మలో ఐక్యం అవ్వడానికి మార్గం దొరికినట్లే అలా జరగలేదంటే 7 దశలలో ఎక్కడో తప్పటడుగు వేసి ఆగిపోయామని అర్థం.

kundalini-yoga

7 దశలలో కుండలిని శక్తి జాగృతమవడం వల్ల జరిగే అధ్భుతాలు:

  1. కుండలిని మూలాధారంలో నిద్రావస్థలో ఉన్నంత వరకు మనిషికి ఈ భూమి మీద ఉన్న అన్ని వస్తువులపై ఎనలేని ఆకర్షణ ఉంటుంది. 
  2. మొదటగా కుండలిని జాగ్రుతమై జననేంద్రియములను ఆనుకుని ఉన్న స్వాధిష్ఠానమునకు చేరినప్పుడు ఇంద్రియ స్కలనం పై నియంత్రణ వస్తుంది. ఎక్కడలేని సృజణాత్మకత, సృష్ఠికి ప్రతి సృష్టి చేసే సామర్థ్యం వస్తుంది.
  3. అనంతరం మణిపూరక చక్రానికి (బొడ్డు) చేరినప్పుడు చంచలత చెలరేగి పోతుంది. ఉదాహరణకు కొందరు విశ్రాంతి లేకుండా ఉండటం, ఏవేవో ఆలోచనలు రావడం, తిరుగుతూ ఉండటం, సరైన నిర్ణయములు తీసుకోలేకపోవడం, అస్తమానూ ఊళ్ళు మారడం లాంటివి ఈ స్థితిలోనే జరుగుతాయి.
  4. ఆపై కుండలిని శక్తి హృదయ స్థానమందున్న అనాహతమునకు ప్రాకినప్పుడు, మనిషిలో ఇహ పర భేదములు నశించి నిష్కళంకమైన విశ్వ ప్రేమ వికసిస్తుంది.
  5. తర్వాత కుండలిని శక్తి కంఠ భాగమునందున్నవిశుద్ధమునకు చేరడంతో, ఇతర బాషలో ఎట్టి ప్రావీణ్యం లేకపోయినా తన మాతృ భాషలా మాట్లాడగలగడం, తనకు పట్టు లేని విషయాలను కూడా సులభ రీతిలో విశ్లేషించి చెప్పగలగడం జరుగుతాయి. విశేషించి ఈ సమయంలోనే ఆశువుగా కవిత్వములు చెప్పడం, వాక్పటుత్వం పెరిగి సాధకుని మాటలు శాసనములుగా శిరసావహించ బడతాయి.
  6. అనంతరం భ్రూ మద్యమున ఉన్న ఆజ్ఞా చక్రంలోకి కుండలిని శక్తి చేరిన యెడల, మాటతోకానీ, సైగలతోకానీ అవసరం లేకుండా కేవలం కంటి చూపుతో ప్రాణికోటిని ఆజ్ఞాపించి తలచిన కార్యం రెప్ప పాటులో ఇతరులచే చెయ్యించుకునే శక్తి వస్తుంది. సాధకుడు ఈ స్థితి వరకే ప్రపంచంలో మానవ కళ్యాణం కోసం ఉపయోగపడతాడు.
  7. చివరగా ఎప్పుడైతే కుండలిని సహస్రారమునకు చేరినదో సాధకుడు అహం భ్రహ్మస్మి స్థాయికి చేరి పరమాత్మలో ఐక్యమైపోతాడు.

అందుకే భగవంతుడు ప్రతీ వ్యక్తికీ కొన్ని మాయా పూరితమైన కోరికలు కల్పించి ఆలోచనలు, కళలు, ఆశలు, పనులు కల్పించి ప్రాపంచిక విషయాలపైకి తిప్పి జనానికి ఉపకరించేలా చేస్తాడు. తాను తలచిన వెంటనే ఆ మాయా తెరను తొలగించి తన దివ్యదర్శనం గావించి తనలో విలీనం చేసుకుని కైవల్యం ప్రసాధించును.

సేకరణ: https://www.panditforpooja.com/blog/reflections-on-kundalini-shakti/

dharma sandehalu, facts, god, pooja, remedise, yoga
సప్తచిరంజీవులు అంటే ఎవరు?
క్రియా యోగం | విధానం – ఫలితాలు | Benefits of Kriya Yoga

Related Posts