రాహు గ్రస్త చంద్ర గ్రహణం – రాశులు మీద ప్రభావం

రాహు గ్రస్త చంద్ర గ్రహణం – రాశులు మీద ప్రభావం

రాహు  గ్రస్త  చంద్ర గ్రహణం – పరిహారాలు  

శ్రీ శోభకృత్ సంవత్సర ఆశ్వయుజ శుక్ర పౌర్ణమి శనివారం రాత్రి అశ్వని నక్షత్రం మేషరాశి నందు అనగా  తేదీ 28-10-2023 రాత్రి గం. 01 .05 నిమిషాల నుండి గం.02.24 నిమిషాలవరకు  రాహు గ్రస్త చంద్ర గ్రహణం సంభవిస్తున్నది.

ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి అనుకూలముగానూ కొన్ని రాశుల వారికి వ్యతిరేకంగానూ కొన్ని రాశుల వారికి సామాన్యం గానూ ఉంటుంది. అలాగే కొన్ని  ప్రత్యేక సూత్రాల ప్రకారం జన్మ రాశి రీత్యా అనుకూలంగా వున్నా  కొన్ని నక్షత్రాల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. అవి ఏమిటో చూద్దాం.

ముహూర్త చింతామణి అనే గ్రంథం ప్రకారం  జన్మ నక్షత్రం లో గ్రహణం పడితే మరణం అని చెప్ప్పబడింది.

1. జన్మరాశి లో గ్రహణం ఘాతం అనగా ఊహించి చిక్కులు. ( మేషం)

2. రెండవ రాశిలో క్షతి. ( మీనం)

3. మూడవ రాశి లో సంపద. ( కుంభం)

4. నాలుగవ రాశిలో వ్యధ. ( మకరం)

5. అయిదవ రాశిలో చింత. (ధనస్సు)

6. ఆరవ రాశిలో సౌఖ్యం. (వృశ్చికం)

7. ఏడవ రాశిలో భార్యకు / భర్తకు పీడ.(తుల)

8. ఎనిదవ రాశిలో మరణం లేదా మరణ సమానమైన పరిస్థితులు.(కన్యా)

9. తొమ్మిదవ రాశిలో గౌరవ భంగం (సింహం)

10. పదవ రాశిలో  సుఖం.(కర్కాటకం)

11. పదకొండవ రాశిలో లాభం.(మిథునం)

12. పన్నెండవ రాశిలో అపాయం.(వృషభం)

మొత్తం మీద పరిశీలన చేస్తే ఫలితాలు ఇలా ఉంటాయి

1. శుభ ఫలితాలు… మిథున, కర్కాటక, వృశ్చిక, కుంభ రాశులు.

2. మధ్యమ ఫలితాలు… సింహ, తుల, ధనుస్సు, మీన రాశులు.

3. అధమ ఫలితాలు…మేష, వృషభ, కన్య,  మకర రాశులు.

ఈ అధమ ఫలితాలు వచ్చే రాశులలో నక్షత్రాలతో పాటుగా ఈ క్రింది నక్షత్రాల వారికి కూడా గ్రహణ శాంతి అవసరం….

 అశ్వని,  రోహిణి, ఆర్ద్ర, పుష్యమి ,మఖ,  హస్త, స్వాతి, అనూరాధ, మూల, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర.

5. ఇవి మాత్రమే కాక…

A) కర్కాటక రాశికి శుభ ఫలితాలు వున్నా పుష్యమి  వారికి ఇబ్బంది.

B) వృశ్చిక రాశికి శుభ ఫలితాలు వున్నా అనూరాధ  వారికి ఇబ్బంది.

C) మీన రాశి వారికి శుభ  ఫలితాలు వున్నా ఉత్తరాభాద్ర  వారికి ఇబ్బంది.

గ్రహణ శాంతి అవసరం అయిన మొత్తం నక్షత్రాలు…

అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, మూల,  పుష్యమి, మఖ, హస్త , స్వాతి, అనూరాధ, ఉత్తరాషాఢ,  శ్రవణం, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర.

గ్రహణ శాంతి ఎలా చేసుకోవాలి?

1. శాస్త్ర విధానంలో అయితే వెండి చంద్ర బింబం, బంగారు సర్పం, కంచు పాత్రలో నేయి, బియ్యం, మినుములు దక్షిణ తో దానం చేయాలి.

2. సాధ్యం కాకపోతే ఇంటిలో చంద్ర, రాహు జపాలు, ఆ మంత్ర సంపుటి తో పాశుపత విధానంలో రుద్రాభిషేకం, హోమం.

3.గ్రహములు అన్ని రాహు కేతువుల మధ్యలో స్థితి

ఇంద్రియముల అధిపతి ఇంద్రుడు

జీవ కారకుడు దన కారకుడు

వక్రీ బృహస్పతి

మనసు కారకుడు చంద్రుడు

తో కూడిన గ్రహణం

నిర్లక్ష్యం తగదు

 

DOWNLOAD CHANDRA GRAHANA DANA SANKALPAM

chandra grahan, grahan, grahan kaal, lunar eclipse, precautions on eclipse, remedise
గ్రహణం పూర్తి అయిన తరువాత చేయవలసిన పనులు
గ్రహణం సమయంలో చేయకూడని, చేయవలసిన పనులు

Related Posts