గ్రహణం సమయంలో చేయకూడని, చేయవలసిన పనులు

గ్రహణం సమయంలో చేయకూడని, చేయవలసిన పనులు

సాధారణంగా గ్రహణ సమయములో గర్భవతులు పాటించవలసిన నియమాలు గూర్చి చెబుతారు కాని… అందరూ ఎటువంటి పనులు గ్రహణం సమయంలో చేయకూడదో, ఏ పనులు చేయాలో ధర్మసింధు వివరంగా తెలిపినది.

గ్రహణకాలే శయనే కృతే రోగో మూత్రే దారిద్ర్యం పురీషే కృమిః |
మైథునే గ్రామసూకరో అభ్యఙ్గే కుష్ఠీ భోజనే నరక ఇతి ||

  • గ్రహణకాలమున నిద్రిస్తే రోగము,
  • మూత్రవిసర్జన వలన దారిద్ర్యము,
  • మలవిసర్జన వలన పురుగుగా జన్మించుట,
  • మైథునం వలన గ్రామపందిగానూ,
  • అభ్యఙ్గస్నానం వలన కుష్ఠు రోగము,
  • భోజనం చేయుటవలన నరకము ప్రాప్తించును.

గ్రహణ సమయంలో చేయవలసిన పనులు:

గ్రహణ పట్టు ,మధ్య , విడుపుస్నానాలు ఆచరించే వారు యాధావిధిగా స్నానం ఆచరించి,మంత్రానుష్టానములను నిర్వహించుకొవచ్చును.

గర్భిణీ స్త్రీలు పఠించవలసిన శ్లోకం:

దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥
వాసుదేవ జగద్వన్ద్య శ్రీపతే పురుషోత్తమ ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥

గ్రహణం సమయంలో ఎవరి నక్షత్ర జపం వారు చేసుకోవచ్చును. లేదా మీకు ఏదైనా మంత్రానుష్టానం ఉంటే ఆ మంత్రం జపం చేసుకోవచ్చు. గాయత్రీ ఉపదేశం ఉన్న వారు కచ్చితంగా గాయత్రీ మంత్ర జప పఠణం తప్పక చేయవలెను.

ఏ ఉపదేశం లేని వారు చంద్ర గాయత్రి లేదా చంద్ర ధ్యాన శ్లోకము పఠించుట సర్వదా శ్రేయస్కరం.

చంద్ర గాయత్రి:
ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి |
తన్నోశ్చంద్రః ప్రచోదయాత్ ||

చంద్ర శ్లోకం:
దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవం ||
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||

chandra grahan, grahan, grahan kaal, lunar eclipse, precautions on eclipse
రాహు గ్రస్త చంద్ర గ్రహణం – రాశులు మీద ప్రభావం
సంకటహర చతుర్థి ‬పూజ | వ్రత విధానం మరియు సమగ్ర వివరణ

Related Posts