గ్రహణకాల అనంతరం ఏ దానమును ఇవ్వాలి? దాని మంత్రమేమిటి?

గ్రహణకాల అనంతరం ఏ దానమును ఇవ్వాలి? దాని మంత్రమేమిటి?

grahan kaal mantra and grahan daan

గ్రహణం సంభవించిన రాశుల వారు గ్రహణానంతరం  ఏ దానమును ఇవ్వాలో, దానము ఇచ్చే సమయంలో పురోహితులు చెప్పవలసిన సంకల్ప మంత్రము ఇక్కడ సవివరంగా ఇవ్వబడ్డాయి.

గ్రహణము యేయే రాశులయందు సంభవించునో వారు బంగారు రాహు, కేతు వెండి చంద్రబింబములను పూజించి, నెయ్యితో నిండిన కంచుగిన్నెను, వస్త్రములను, నువ్వులతో తగిన దక్షిణలు కలిపి దానమీయవలయును. మరియు రావిచెట్టును తాకకుండా 21 ప్రదక్షిణలు చేయవలయును. గ్రహణ సమయమునందు దానము గ్రహించువారు దొరకకున్న గ్రహణానంతరము సంకల్పించుకున్నదానికి ద్విగుణీకృతంగా దానమీయవలయును.

గ్రహణకాల దాన మంత్రము:

యజమానస్య జన్మరాశి జన్మ నక్షత్ర స్ధిత సూర్య గ్రహణ సూచిత సర్వారిష్ట శాంతి పూర్వక ఏకాదశ స్ధాన స్ధిత గ్రహ సూచిత శుభ ఫలావాప్త్యర్ధం సూర్యబింబ నాగబింబ దానం కరిష్యే…

తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్ధనా!
హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదో భవ!!
విధుంతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత!
దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్ధవేత్!!
అను మంత్రముచే చదివి

గ్రహణ సూచిత అరిష్ట వినాశార్ధం మమ శుభ ఫలావాప్త్యర్ధం ఇదం కేతుబింబ సూర్య బింబదానం ఘృతపూర్ణ కాంశ్య పాత్ర సహితం యధాశక్తి తిల వస్త్ర దక్షిణాసహితం తుభ్యమహం సంప్రదదే నమమ. అని దానమును స్వీకరించి, దానమిచ్చిన వారిని ఆశీర్వదించవలెను.

సేకరణ: https://www.panditforpooja.com/blog/grahan-kaal-mantra-and-grahan-daan/

danam, grahan, grahan kaal, Solar Eclipse, Surya Grahan
భోగి రోజు రేగి పండ్లు(భోగి పళ్ళు) పోయడం వెనుక అసలు రహస్యం
ఋషి పంచమి పూజా విధానం మరియు ఋషిపంచమి వ్రత కథ

Related Posts