సంపూర్ణ చంద్ర గ్రహణం | ఈ నెల చంద్రగ్రహణం యొక్క పూర్తి వివరాలు

సంపూర్ణ చంద్ర గ్రహణం | ఈ నెల చంద్రగ్రహణం యొక్క పూర్తి వివరాలు

Loading

this year lunar eclipse full information

సంపూర్ణ చంద్ర గ్రహణం | ఈ నెల చంద్రగ్రహణం యొక్క పూర్తి వివరాలు

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీ హేమలంబ నామ సంవత్సర మాఘ శుక్ల పూర్ణిమ బుధవారం ది.. 31-01-2018 తేదీ బుధవారం రాహుగ్రస్త గ్రస్తోదయ సంపూర్ణ చంద్ర గ్రహణం.

ది. 31 – జనవరి – 2018 , శ్రీ హేమలంబ నామ సంవత్సరం మాఘ మాస పౌర్ణమి బుధవారం పుష్యమి, ఆశ్లేష నక్షత్రములందు సాయంత్రం 5.17 ని నుండి రాత్రి 8.41 వరకూ సంపూర్ణ చంద్ర గ్రహణం (Total Lunar Eclipse on January 31, 2018) ఏర్పడును. ఈ గ్రహణం భారత దేశమంతటా కనిపించును. ఐతే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం పడమర దిక్కు నుండి తూర్పు దిక్కుకు ప్రయాణిస్తుంది. ఈ గ్రహణం పూర్తిగా ఒక గంట 16 నిమిషాల 4 సెకన్ల వరకు ఉంటుంది.

this year lunar eclipse full information

జనవరి 31, 2017 చంద్రగ్రహణ సమయాలు

గ్రహణ స్పర్శకాలం: సాయంత్రం 5గంటల 17 నిముషములు (IST)
చంద్రోదయకాలం(RJY): సాయంత్రం 6గంటల 05 నిముషములు (IST)
గ్రహణ నిమీలన కాలం: రాత్రి 6గంటల 21 నిముషములు (IST)
గ్రహణ మధ్య కాలం: రాత్రి 6గంటల 59 నిముషములు (IST)
గ్రహణ ఉన్మీలన కాలం: రాత్రి 7గంటల 37 నిముషములు (IST)
గ్రహణ మోక్ష కాలం: రాత్రి 8గంటల 41 నిముషములు (IST)
గ్రహణ పుణ్య కాలం 3గంటల 24 నిముషములు
బింబదర్శన కాలం 1గంట 16 నిముషములు

ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహణ ఫలితములేవి?

ధనస్సు – మేషం – కర్కాటక – సింహ రాశుల వారికి అధమ ఫలితము.
వృశ్చిక – మకర – మీన – మిధున రాశుల వారికి మధ్యమ ఫలితము.
కన్య – తుల – కుంభ – వృషభ రాశుల వారికి శుభ ఫలములను పొందుతారు.

ఎవరు ఈ చంద్ర గ్రహణాన్ని చూడరాదు?

ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం పుష్యమీ, ఆశ్లేష నక్షత్రాలు, కర్కాటక రాశులలో సంభవిస్తున్న వలన పుష్యమి, ఆశ్లేష నక్షత్ర జాతకులు, కర్కాటక రాశి వారు చంద్రగ్రహణం చూడరాదు మరియు గ్రహణ శాంతి జరిపించుకోవలెను.

grahan, grahan kaal, lunar eclipse, precautions on eclipse
మూత పడనున్న తిరుపతి ఆలయం
రథ సప్తమి రోజున తిరుపతి వెళ్తున్నారా? ఇది తప్పకుండా గమనించండి!

Related Posts