రథ సప్తమి రోజున తిరుపతి వెళ్తున్నారా? ఇది తప్పకుండా గమనించండి!

రథ సప్తమి రోజున తిరుపతి వెళ్తున్నారా? ఇది తప్పకుండా గమనించండి!

Loading

ttd-cancelled-special-darshanas-and-sevas-on-ratha-saptami-day

రథ సప్తమి రోజున తిరుపతి వెళ్తున్నారా? ఇది తప్పకుండా గమనించండి!

మీరు ప్రతి రోజు మా WhatsApp channel  ద్వారా సమాచారం పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

తిరుమల తిరుపతి రథ సప్తమి రోజున వెళదామన్న ఆలోచనలో ఉన్నారా? అయితే ఇది తప్పకుండా గమనించండి!

రథ సప్తమి రోజున తిరుమల తిరుపతికి వెళ్ళే భక్తులు తప్పకుండా కొన్ని విషయాలను గమనించాలి. ప్రత్యేకంగా స్వామివారికి చేసే సేవలు, ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది.

ttd-cancelled-special-darshanas-and-sevas-on-ratha-saptami-day

విశేషించి రథసప్తమి పర్వదినం రోజు అనగా 24 జనవరి 2018 బుధవారం నాడు తిరుమల తిరుపతి యందు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) రద్దు చేసింది.

అంటే ప్రతీ రోజు ఉండే విఐపి బ్రేక్‌ దర్శనాలను, వయోవృద్ధులకు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు అదేవిధంగా దాతలకు, మిలటరీ, యన్‌.ఆర్‌.ఐలకు సుపథం మార్గంలో కల్పించబడే ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేసినది.

రథ సప్తమి / సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, శ్రీవారు ఒకే రోజున సప్త వాహన దారియై ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగింపబడతారు. ఈ కారణం చేతనే రథసప్తమి నాడు ఒకే రోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలను కూడా జరిపించెదారు.

శ్రీవారిని ఊరేగించే వాహనాల వివరాలు, సమయాలు:

సమయం    వాహనం
ఉ. 5.30 – ఉ. 08.00 సూర్యప్రభ వాహనం
(సూర్యోదయం ముహూర్తం ఉ. 6.45 గంటలుగా నిర్దేశించడమైనది)
ఉ. 9.00 – ఉ. 10.00 చిన్నశేష వాహనం
ఉ. 11.00 – మ. 12.00 గరుడ వాహనం
మ. 1.00 – మ. 2.00 హనుమంత వాహనం
మ. 2.00 – మ. 3.00 చక్రస్నానం
సా. 4.00 – సా. 5.00 కల్పవృక్ష వాహనం
సా. 6.00 – సా. 7.00 సర్వభూపాల వాహనం
రా. 8.00 – రా. 9.00 చంద్రప్రభ వాహనం

అంతే కాకుండా… శ్రీవారి ఆలయంలో సూర్య జయంతి రోజున, ప్రతి నిత్యం నిర్వహించే ఆర్జితసేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేయడం జరిగింది. అయితే సుప్రభాతం, తోమాల మరియు అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు అని తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) తెలిపినది.

TTD News
సంపూర్ణ చంద్ర గ్రహణం | ఈ నెల చంద్రగ్రహణం యొక్క పూర్తి వివరాలు
శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా పీఠాధిపతుల 82వ జన్మదిన మహోత్సవములు

Related Posts