శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్ధస్వామి వారు శ్రీ శ్రీ శ్రీ భారతితీర్ధస్వామి వార్ల ఆత్మీయ అభిమాన శిష్యులు శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా పీఠాధిపతులు (వెదురుపాక గాడ్ ) గారి 82వ జన్మదిన వేడుకలు 2018 జనవరి 17, 18, 19వ తారీఖులయందు శ్రీ విజయ దుర్గా పీఠం వద్ద నిర్వహించబడుతున్నవి.
ఈ సందర్భముగా ప్రతి నిత్యమూ జపములు, హోమములు, అభిషేకములు, పీఠం వద్ద ప్రతిష్టించిన పవిత్ర దేవతామూర్తులకు అర్చనలు, హారతులు జరుపబడును. ఆధ్యాత్మిక కార్యక్రమములు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును. పరిసర ప్రాంతాల యందు అనాధ బాలుర వసతి గృహములు, వృద్దాశ్రమములు, కుష్టురోగుల శరణాలయముల వద్ద నివాసికులకు అన్నదాన, వస్త్ర దాన, వైద్య సేవలు నిర్వహించబడును. రాష్ట్రములయందలి ప్రముఖ దేవాలయముల వద్ద రాష్ట్ర ప్రజల, పీఠ భక్త జనుల సంక్షోభ నివారణకు, అతివృష్టి, అనావృష్టి నిర్మూలన, అకాల మృత్యు నివారణ, ఉపద్రవముల నివారణార్ధము ప్రత్యేకముగా అభిషేకములు, యాగములు అర్చనలు నిర్వహించబడుతున్నవి.

కార్యక్రమాల వివరములు:
17-01-2018 బుధవారం ఉ.గం.08:29ని.లకు మండపం వద్ద జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమము ప్రారంభమగును. తదుపరి మండపారాధన, అర్చనలు. ఉ. గం.09:18ని.లకు శ్రీ విజయదుర్గా అమ్మవారికి నక్షత్ర పూర్వక, నవగ్రహ పూర్వక, అధిదేవత, ప్రత్యధి దేవత సహిత నవావరణ హోమం (ప్రత్యేక మూలమంత్రం ద్వారా) నిర్వాహకులు కోటా సునీల్ కుమార్, గూడూరు వారిచే నిర్వహించబడును. సా.గం.06:00 ని.లకు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారిచే శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారికి కళాణ్యము నిర్వహించబడును
18-01-2018 గురువారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే శ్రీ విజయ దుర్గా పీఠం వద్ద నెలకొల్పిన శ్రీదేవి భూదేవి సామేత శ్రీ విజయ వేంకటేశ్వరస్వామీ వారి దివ్య కళ్యాణము తిరుమల వైఖానస పండితులచే నిర్వహించబడును. సా.గం.06:00 ని.లకు శైలజా పాత్రో బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించబడును. ప్రతి నిత్యమూ ఆధ్యాత్మిక కార్యక్రమములు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును.
శ్రీ విజయ దుర్గా పీఠాధిపతుల 82వ జన్మదినము నాడు 19-1-2018 జన్మదిన వేడుకలు నిర్వహించబడును. కావునా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములు మరియు జన్మదిన వేడుకల యందు యావన్మంది భక్తులు పాల్గొని శ్రీ విజయ దుర్గా దేవి మరితు శ్రీ విజయ దుర్గా పీఠాధిపతుల ఆశీస్సులను పొంది సర్వ సంక్షోభములనుండి విముక్తులవగలరు.